Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/237

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఖనిజసంపద (ప్రపంచమున, భారతదేశమున)
దొరకును. ఇందు మాస్కో బేసిన్, సైబీరియా, కాకసస్ ప్రాంతములు పేర్కొనదగినవి. ఆ దేశపు సంపద 233 బిలియనుల టన్నులని అంచనా. జర్మనీ దేశమున మేలురకమైనబొగ్గు లభ్యమగును. 'రూర్' (Ruhr) ప్రాంతములోవిస్తారముగా బొగ్గు తీయబడుచున్నది. ఆ దేశపు బొగ్గుసంపద మొత్తము 477 బిలియనులు టన్నులు. చైనా దేశమందుగూడ బొగ్గు విస్తారముగ దొరకును. ఒక్కొకచోట 50 అడుగులమందము గల అచ్చులు (blocks)గూడ గలవు. మంచూరియా ప్రాంతమున చాల మేలురకపు బొగ్గు లభ్యమగును. భారత దేశమందు అనేకప్రాంతములలో బొగ్గు దొరకును. అందు రాణిగంజ్,ఝరియా, బొకారో, గిరిధి, పెన్స్ లోయ, సష్టి (Sasti),సింగ రేణి ప్రాంతములు ముఖ్యములైనవి. మనదేశమునసంవత్సరమునకు 380 లక్షల టన్నుల బొగ్గు ఉత్ప త్తియగుచున్నది. మొత్తము 79 బిలియను టన్నుల బొగ్గు ఈదేశమున కలదని అంచనా.
నూనె : ప్రపంచములో కెల్ల అత్యధికముగా నూనె కలిగియున్నది మధ్యధరా సముద్ర ప్రాంతము (ఇరాన్,ఇరాక్, కువైట్, అరేబియా). ఇచ్చట బావులందు నూనెఊట సమృద్ధిగా గలదు. ఇచ్చటనున్న నూనెబావులు225 మాత్రమే అయినను, అవి సగటున రోజుకు 5000పీపాల నూనె నిచ్చుచున్నవి. కాని అమెరికాయందు28.000 నూ నెబావు లున్నను, వాటినుండి సగటున రోజుకు 13 పీపాల నూనెకంటె ఎక్కువ తీయుటకు సాధ్యపడుట లేదు.ఇరాన్ దేశ మున 1000-9000అడుగులలోతునుండియు. అరేబియాలో1900-2500అ.లోతునుండియు,కువైట్లో3670-4750 అ.లోతునుండియునూనెతీయబడుచున్నది. ఈ ప్రాంతమందు మొత్తము సుమారు 155 బిలియనుల పీపాలనూనె కలదని అంచనా వేయబడినది. రష్యా దేశమందు 2500 సం.ల క్రితమే నూనెకల్గొనబడినది.ఆదేశమందునూనెగలప్రాంతములుముఖ్యముగా అయిదు. అందు బాకు, యూరల్-వోల్గాప్రాంతములు ముఖ్యతరమైనవి.ప్రస్తుతము నూనె2500అ.నుండితీయబడుచున్నది; ఆ దేశపు మొత్తము నూనెసంపద 150బిలియనుల పీపాలుండునని అంచనా వేయబడినది. 194 సంగ్రహ ఆంధ్ర
అమెరికాలో మొత్తము 22 రాష్ట్రములలో నూనె దొరకును. ఇందు మధ్య అమెరికా ప్రాంతము (ఓక హామా, కాన్సాస్, టెక్సాస్, న్యూమెక్సికో, ఆర్క న్సాస్, లూసియానా రాష్ట్రములు) నుండితీయబడునంతటినూనెప్రపంచమందలిమరేఒక్క ప్రాంతము నుండి తీయబడుట లేదు. తరువాత కాలిఫోర్నియా, ఇల్లినాయిస్ రాష్ట్రములు ముఖ్యములు. ప్రపంచమందుతీయబడు నూనెలో 611 శాతము ఈ దేశమునుండియేవచ్చుచున్నది. ఇచ్చట మొత్తము 110 మిలియను పీపాలనూనె కలదని అంచనా. తరువాత వెనిజులా, కొలంబియా, ట్రినిడాడ్ ప్రాంతములు ప్రసిద్ధము లై నవి.ఇచ్చట మొత్తము 80 బిలియనులు పీపాల నూ నెగలదు.కెనడా దేశమందు 8 ప్రాంతములలోను,మెక్సికోయందు4th ప్రాంతములలోను నూనె తీయబడుచున్నది. బర్మాదేశమందు ఆరకాన్, యోమా పర్వతశ్రేణికి ఇరువైపులునూనె దొరకు ప్రాంతము. భారతదేశమున నూనెదొరకుముఖ్యప్రదేశములు అస్సాము, పంజాబు రాష్ట్రములు.బొంబాయి రాష్ట్రమందును, కావేరీనదీ ప్రాంతమున,ఇతర ప్రదేశములందు నూనెను కల్గొనుటకు విశేషప్రయత్నములు జరుపబడుచున్నవి. ప్రస్తుతము నూనెకనుగొనబడినప్రాంతములలోదిగ్బాయి, నహర్కాతియా, జ్వాలాముఖి ప్రదేశములు ముఖ్యము లై నవి.
రాగి : ఆధునిక పరిశ్రమలకిది ముఖ్యావసరము. విద్యుచ్ఛక్తి విస్తరణము, టెలిఫోను, రేడియో, యుద్ధ సామగ్రి మొదలగు వాటికిది అత్యవసరము. ప్రపంచ మందలి అన్ని ప్రాంతములనుండి 2.8 మిలియను టన్నులరాగి ఖనిజము తీయబడుచున్నది. ఈ లోహమును 16రకముల ఖనిజములనుండి తీయవచ్చును. ఇది నూటికి80 పాళ్లు ఆమెరికా, చిలీ, పెరూ ప్రాంతములు, కెనడా,దక్షిణాఫ్రికా దేశములందును దొరుకుచున్నది. అమెరికెల్ల ఎక్కువగా రాగి ఖనిజము దొరకు చోటు ఆరిజోనా ప్రాంతము. తర్వాత అప్లాషియన్, లేక్ సుపీ రియర్ మొదలుగా గల ప్రాంతములు ఎన్నదగినవి. ప్రపంచ రాగి సంపదలో 20 శాతము అమెరికా యందు గలదు, కెనడా దేశమందుహడ్సన్బే,సడ్బరీ(sudbury) నోరాండా యందలి రాగి గనులు చాల ముఖ్యము లైనవి. లో