Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/236

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము –3 25 25 193 ఖనిజసంపద (ప్రపంచమున, భారతదేశమున)

కాని మేగ్నెసైటు (1800° సెంటిగ్రేడు ఉష్ణమును నిరోధించగలది) సేలమిల్లాలోని కొండలలో (chalk hills) విస్తారముగ దొరకును.

ప్రస్తుత ప్రపంచ పరిస్థితులలో బంగారము ఎంత ఎక్కువ కలిగియున్న, ఆ దేశము అంత భాగ్యవంతము, శ క్తి మంతము అగును. కావున దీనికి స్వయంసమృద్ధి యను నది లేదు. ఎంత దొరకిన అంత మంచిది. కాని భారత దేశ మున ఇది మైసూరులోని కోలారు గనులనుండియు, బొంబాయిలోని 'హట్టి' గనుల నుండి మాత్రమే తీయబడు చున్నది. ఇంకను కొన్ని ప్రదేశములలో ఇది దొరకు చున్నను, వదలి దానిని తీయుటలాభదాయకము కాకుండు టచే, వేయబడినది. 1959-60 సం. లో భారత దేశమున ఈ లోహపు ఉత్పత్తి 47,72,597 గ్రాములు. దీని విలువ 511.36 లక్షల రూపాయలు. 66

ఇనుము : ఇది క్రీ. పూ. 4000 సం. క్రిందటనే కల్గొన బడినను, పరిశ్రమగా రూపొందినది క్రీ. పూ. 800 సం. నుండి మాత్రమే. అప్పటినుండియే ఇనుప యుగము ప్రారంభమైన దందురు ఈ ఖనిజము అన్నిటికంటె అత్యవ సరమైనది. దైనందిన వ్యవహారములో ప్రతిచోట మన కిది సాక్షాత్కరించును. దీని ఉత్పత్తియందు అమెరికాకు ప్రథమస్థానము కలదు. ప్రపంచఉత్పత్తిలో సగము ఇచ్చట నుండియే వచ్చుచున్నది. అమెరికాలో “ లేక్ సుపీరియర్” (Lake Superior) అను ప్రాంతమందలి గనులు ప్రపంచ మం దెల్ల అత్యుత్తమమైనవి. ఇచ్చట నుండి 24 వేల కోట్ల టన్నుల ఇనుము తీయబడినది. రష్యాదేశము సం. నకు దాదాపులి కోట్ల టన్నులు ఉత్పత్తి చేయుచున్నది (రెండవ ప్రపంచయుద్ధమునకు పూర్వము) ఇందు ఎక్కువ భాగము ఉక్రెయిన్ రాష్ట్రము నుండి ఉత్పత్తియగుచున్నది. జర్మనీ, ఫ్రాన్సు దేశముల నడుమ గల లారెయిన్ (Lorraine) ప్రాంతమందు ముఖ్యమైన ఇనుప గనులు గలవు. కాని ఈ ఖనిజము అంత నాణ్యమైనది కాదు. ఇందు లోహ భాగము 30 శాతము మాత్రమే. భారత దేశమందు ముఖ్య మైన ఇనుపగనులు దేశ వ్యాప్తముగా గలవు. ఇందులోహ 30 అత్యధిక ములు. మైళ్ళ భాగము 70 శాతము గలవి పొడవుక లిగి, 1000 అడుగుల లోతువరకు ఉండి, అంత టను లోహ భాగము 60 శాతము కలిగియుండిన ఇనుప గని సింగ్ భూమ్ ప్రాంతమందు (కలకత్తాకు పశ్చిమముగా 150 మైళ్లు) కలదు. ఇచ్చటి ఖనిజము అమెరికాయందలి 'లేక్ సుపీరియర్ ' ప్రాంతపు ఖనిజమును పోలియుండును. సింగ్ భూమ్ గని ప్రపంచమునకెల్ల పెద్దదని రూఢిగా చెప్పనగును. 60 లోహ శాతముగల ఖనిజము అచ్చట కనీసము 3000 మిలియను టన్నులుండునని అంచనా. చాందాజిల్లా యందుగల పది ప్రదేశములలోను, దుర్గ్ జిల్లాయందు చిన్న కొండలుగాను ఈ ఖనిజము దొరకు చున్నది. మైసూరు రాష్ట్ర మందలి 'బాబా బుడన్' కొండల నుండి అధిక లోహ శాతముగల ఖనిజము విస్తారముగ లభించుచున్నది. ఇవి కాక, అనేక చోట్ల చిన్న చిన్న రాళ్లుగా మట్టిలో ఇమిడియున్న ఖనిజముగూడ తీయబడుచున్నది. ఉదా. ఆంధ్రప్రదేశ్ లోని జగ్గయ్యపేట ప్రాంతము.

చైనా దేశమందును చెప్పదగు ఖనిజసంపద కలదు. ఇది 'యాంగ్జి' లోయయందు గలదు. లోహభాగము 56 శాతము. ఇది మంచూరియాయం దెక్కువగా విస్త రించి యున్నది. ఆ దేశ

బొగ్గు : ప్రపంచమునందు ఇది లక్షల సంవత్సరముల వరకు చాలినంత కలదు. దీని ప్రపంచ ఉత్పత్తిలో 22 శాతము ఇనుము ఉక్కు తయారీయందును, 29 శాతము ఆవిరి తయారీయందును, 23 శాతము రైళ్ళు నడపుట కును, 17 శాతము గృహోపయోగమందును, 6 శాతము విద్యుచ్ఛక్తి ఉత్పత్తి యందును వినియోగ పడుచున్నది. బొగ్గు అమెరికాయందు విస్తారముగా కలదు . మందలి 33 రాష్ట్రములు బొగ్గును ఉత్పత్తి చేయుచున్నవి. ఆమెరికా సం. నకు 65 కోట్లటన్నుల బొగ్గును ఉత్పత్తి చేయుచున్నది. కెనడా దేశమున నోవస్కోషియా ప్రాంత మునను, పసిఫిక్ సముద్రతీర ప్రాంతమునను బొగ్గు విస్తారముగ దొరకును. ఆ దేశ మున 1234 బిలియను టన్నుల బొగ్గు దొరకగలదని చ వేయబడినది. బ్రిటిష్ దీవులలో (ఇంగ్లండు, స్కాట్లండు, వేల్సు రాష్ట్రములు) ఈ ఖనిజము సమృద్ధిగా దొరకును. ఆ దేశ మున కొన్ని ప్రదేశములలో 3000 అడుగులలోతునుండి కూడ బొగ్గు తీయబడుచున్నది. ఈ దేశపు బొగ్గుసంపద దాదాపు 200 బిలియను టన్నులని అంచనా కలదు. రష్యాదేశమందు మొత్తము 185 ప్రదేశములలో బొగ్గు