Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

ఖనిజముల రంగులు

axes) యొక్క అన్యోన్య అభినమనము (mutual inclination) ను బట్టియు, వాటి పొడవు, నిష్పత్తులను బట్టియు స్ఫటికములన్నియు ఆరు సంహతులుగా విభజింప బడెను.

ద్వివక్రీభవనము (Double Refraction) మరియు ద్వివర్ణత (Dichroism): ఒక పదార్థము నుండి వెలుతురు యొక్క కిరణము ప్రసరించి ఏకకిరణముగానే బయల్వెడలినచో దానిని ఏక వక్రీభవనము (Singly refracting) లేక ఐసోట్రోపిక్ (Isotropic) అని అందురు. ఉదా. స్ఫటికాకారము లేని పదార్థములు (amorphous Substances) మరియు క్యూబిక్ స్ఫటిక సంహతికి (cubic crystal system) చెందిన ఖనిజములు ఇతర సంహతులకు చెందిన పదార్థముల స్ఫటికములలో పతనకిరణము (incident ray) రెండుగా రూపొంది, ఆ రెండును స్ఫటికములో భిన్నమార్గముల ప్రవర్తించును. అట్టి ఖనిజములన్నియు ద్వివక్రీభవనములు (doubly refractive) లేక (anisotropic) అనబడును. అట్టివాని గుండా వెలుతురు ప్రసరించునప్పుడు వక్రీభవనము నందలి భేదమే గాక దాని యొక్క సెలెక్టివ్ శోషణము (selective absorption) లో గూడ భేదముండును. ఇందువలన వాటి రంగులలో భేద మేర్పడును. ఈ ధర్మమును ద్విదిజ్ఞ్నా నావర్ణత (dichroism) అందురు. ఇది రత్న పరీక్ష యందు చాలా ముఖ్యము. రంగుగల ఖనిజముల యొక్క ద్విదిజ్ఞా నావర్ణతను డైక్రొ స్కోప్ (dichroscope) అను ఉపకరణము యొక్క సాయమున బాగుగ తెలిసికొనవచ్చును. ఈ ఉపకరణములో ద్వివక్రీభవన ఖనిజము యొక్క జంట రంగులు కాననగును. పై ధర్మమును కల్గిన ఖనిజముల ఉదాహరణములు: బయోటైట్ (biotite), కసిటరైట్ (cassiterite), టూర్మలీన్ (tourmaline), జిర్‌ కన్ (zircon), స్ఫీన్ (sphene), రుటైల్ (rutile) హైపర్ స్తీన్ (hypersthene), హారన్ బ్లెండు (hornblende) మొదలగునవి. రంగులేనట్టి లేక తెల్ల రంగు గల ఖనిజములు ద్వివక్రీభవనములై నప్పటికిని ద్విదిజ్ఞ్నా నావర్ణతను ప్రదర్శింపవు

స్వయంప్రకాశము (Luminiscence) : అల్ట్రావయలెట్ కిరణములు (ultra violet rays), ఎక్సు- కిరణములు (X-Rays), కాథోడ్ (cathode) కిరణములు లేక రేడియో ధార్మిక కిరణములు కొన్నికొన్ని ఖనిజములపై ప్రసరించినపుడు అవి ప్రకోపింపచేయబడి అందమైన రంగులతో వెలుగును. ఈ కిరణ సముదాయములు వాటి యొక్క తరంగ పరిమాణము కంటె సాధారణమైన వెలుతురుయొక్క తరంగపరిమాణము తక్కువగా నుండుటచే మన కంటికి అదృశ్యములు. ఈ రకపు ప్రకాశము చీకటి యందు గాని, వెలుతురు తక్కువగా నున్నప్పుడు గాని చక్కగా కన్పించును. పై జెప్పబడిన కిరణములు ఖనిజముమీద పడిన తర్వాతగూడ ఆ ఖనిజము ప్రకాశించు చుండినచో, ఆ గుణమును ఫాస్ఫారిసెన్స్ (phosphorescence) అందురు. ఖనిజముల యొక్క స్వయం ప్రకాశత్వము అల్ట్రావయలెట్ కిరణముల సహాయముతో బాగుగా గోచరించును. స్వయం ప్రకాశ పదార్థములు ఈ కిరణ విసర్జనముల (Radiations) ఒత్తిడిచే శక్తిని (energy) లో గొనును. అందువలన వాటి పరమాణువుల (atoms) యందలి ఎలక్ట్రానులు (electrons) విస్తృతమయిన మండలములలో తిరుగ మొదలిడును. ఈ కారణముగా ఆ పదార్థములో అస్థిరపరిస్థితులు ఏర్పడి అధికమయిన శక్తి వృద్ధినొందును. అట్టి శక్తి స్వయంప్రకాశ రూపమున విడనాడబడుట చేత ఎలక్ట్రానులు మరల వాటి సహజ మండలములలోనికి వచ్చును. ఈ కారణమున పదార్థములోని అస్థిరపరిస్థితులు సరియగును. ఖనిజములలోను, భిన్నములయిన రాళ్ళలోను గల కలుషములు (impurities), స్ఫటికనిర్మాణములో అవి కలిగించు లోపముల మూలమున, ప్రకాశముయొక్క తీక్ష్ణత, తదితర ధర్మముల మీదను గాఢమయిన ప్రభావమును కలిగియున్నవి. వాటిలో కొన్ని ప్రకాశమును అధికముచేయును. అట్టివానిని చైతన్యకారకము (activators) లందురు. మరికొన్ని ప్రకాశమును అణచివేయును. అట్టివానిని క్లుప్తకము (inhibitors) లందురు. ఉదా: విల్లెమైట్ (willemite) పై అల్ట్రావయలెట్ కిరణములు పడినపుడు ఉజ్జ్వలమయిన ఆకుపచ్చ వన్నెతో ప్రకాశించును. దీనికి కారణము ఆ ఖనిజములో మాంగనీసు లేశరూపమున కలిసియుండుటయే. వజ్రము ఆకాశ నీలవర్ణము, ఆకుపచ్చ లేక పసుపుపచ్చ రంగులతో వెలు

187