Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఖనిజసంపద (ప్రపంచమున, భారతదేశమున) 188 సంగ్రహ ఆంధ్ర

గును. ఒక్కొక్కప్పుడు వజ్రములపై సూర్యరశ్మి కొంత సేపు సోకిన తరువాత వాటిని చీకటిలో ఉంచినను ప్రకా శించును. కెంపు (Ruby) శోభాయమాన మైన సింధూర వర్ణ (Scarlet) కాంతిని ప్రదర్శించును. ఈ కాంతి కొంత వరకు సాధారణమైన సూర్యరశ్మిలో గూడ చూడనగును. క్రోమియమును కలిగియున్న గులాబి, ఎరుపు వర్ణముల స్పి నెల్సు (spinels) భ్రాళమాన (fluorescent) ఖనిజము లకు మరియొక చక్కని ఉదాహరణము. అపురూపములగు (Rare earth) మూలపదార్థములు లేరూపములో కలిసి ఉండుటవలన ఫ్లోరైట్ (Fluorite) ఖనిజము యొక్క కొన్నిరకములు అల్ ట్రావయలెట్ కిరణములు వాటిమీద పడినప్పుడు నీలి – ఊదారంగులను ప్రదర్శించును. భ్రాశ -మానములయిన ఇతర ఖనిజములలో, పసుపుపచ్చ-నీలము వన్నెగల కురువిందము (corundum), షీలైటు (Schee- lite), ఓపాల్ (opal) మున్నగునవి పేర్కొనదగినవి.

వై. జి. కె. ఎం.

ఖనిజసంపద (ప్రపంచమున, భారతదేశమున):

మానవుడుతనకుపకరించుపదార్థముల కొరకు ప్రకృతిని శోధించుచునే యున్నాడు. ఈ ఆవశ్యక పదార్థాన్వేషణమునకు మనము వసించు భూమియే ప్రధానస్థలము. భూమ్యుపరితలమునను, అంత ర్భాగముననుఅనేక పదార్థములను కాలక్రమమున కనుగొని, వెలికితీసి,రూపాంతరీకరించి,మానవోపయోగ్య మొనరించి,సుఖించుటకు నిర్విరామముగ కృషి జరుగుచున్నది వీటిలో ఖనిజములకొక ముఖ్యస్థానముగలదు.ఖనిజములుతరతరములనుండి ఉపయోగమందుండినను, రానురానువీనిని దైనందినావసరములకేకాక వీటి ఉపయోగముచే జీవితమునే సుఖవంతమొనరింప జేసికొనుటకై పెక్కు ప్రయత్నములు జరుగుచున్నవి. అందుచే వీటి ఆవశ్యకత అనేక ఇతర పరిణామములకు త్రోవతీసినది. వీటి అన్వే షణ యందు అనేక క్రొత్త దేశములు, క్రొత్తజాతులు కల్గొనబడినవి. ఈ ఖనిజములయందు ఆధిక్యతగల దేశము లకు క్రమేణ రాజకీయ, ఆర్థిక, వ్యాపారపలుకుబడి పెంపొందినది. ఆ కారణమున వివిధ దేశముల మధ్య స్పర్థలు, యుద్ధములు, సామ్రాజ్యవిస్తరణ కాంక్షలు కలుగుటకు ఆస్కార మేర్పడెను.

ప్రతిదేశములో కొన్ని ఖనిజములు అధికముగా నుండి, మరికొన్ని ఖనిజములకొరకు ఇతర దేశములపై ఆధారపడవలసి యుండును. ఏ ఒక్క దేశము కూడ ఖనిజ సంపదయందు సర్వసమృద్ధముగ నుండజాలదు. ఖనిజము లందు ఇంతవరకు చాలవరకు సర్వసమృద్ధి సాధించినది ఒక్క రష్యాదేశము మాత్రమే. ఆ దేశము అంత త్వరిత ముగా పారిశ్రామిక ఆధిక్యత సంపాదించుటకు గల ముఖ్యకారణములలో ఇదియొకటి. ఒక దేశమున లేని ఖనిజములను అది సమృద్ధిగాగల ఇతర దేశములనుండి సంపాదించు కొని అన్యోన్య సహకారమును వృద్ధి చేసు కొనుటమీదనే ప్రపంచ పారిశ్రామికాభ్యున్నతి ఆధార పడి యున్నది.

అంధయుగమునందు (Dark Ages) వ్యాప్తిలోనున్న ఖనిజములు పది మాత్రమే. (ఇనుము, రాగి, సీసము, టిన్, 'బంగారము, వెండి, పాదరసము, వజ్రములు, కొన్ని రకముల బంకమన్ను (clay), భవన నిర్మాణముల కుపయోగపడు రాళ్లు). కాని ఇప్పుడు 75 రకములకు పైగా ఖనిజములు ప్రపంచములో వ్యాప్తియందున్నవి. మానవునకు ఖనిజావశ్యకత పొడసూపినది మొదలు నేటి వరకు వాటి వినియోగమున అనేక నూతన విధా నములు కనుగొనబడినవి. అందుచే వాటి గిరాకి (demand) అత్యధికముగా పెరిగినది. పోత ఇనుము యొక్క ఉత్పత్తి గత శతాబ్దమునుండి ఇప్పటివరకు 100 రెట్లు వృద్ధి చెందుటయే దీనికి సరియైన ప్రామాణి కోదాహరణము. ప్రపంచమందలి ఖనిజ సంపద అంతయు రెండు ముఖ్య వర్గములక్రింద విభజింపబడినది. (1) లోహ ఖనిజములు (2) లో హేతర ఖనిజములు. ప్రతి ఖనిజమందును లోహము, వాయు పదార్థము, ఇతర ద్రవ్య ములును కొన్ని భాగములలో కలిసియుండును. ఏయే ఖనిజములనుండి లోహమును ఆర్థికముగ వేరుచేయుటకు వీలగునో అట్టివి మొదటి వర్గమున చేర్పబడినవి. రెండవ వర్గమునకు చెందిన ఖనిజములయం దిమిడి యున్న లోహపు విలువచేకాక, వాటికి గల ఇతర భౌతిక లక్షణ ముల ఔన్నత్యముచే అవి ఆర్థిక ఖనిజము లగుటవలన, అట్టివి లో హేతర ఖనిజములక్రింద వర్గీకరింపబడినవి. వీటికి రెండు జనసామాన్యమగు ఉదాహరణము లియవలె