Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/232

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము = 3 189 ఖనిజసంపద (ప్రపంచమున, భారతదేశమున)

నన్న (1) తెల్ల సుద్ద (clay) యను పదార్థమందు అల్యూమినియము అను లోహమును, (2) రాతి నార (asbestos) యందు మెగ్నీషియము అను లోహమును కలవు. కాని మొదటిది పింగాణి పాత్రల తయారీయం దును, రెండవది ఉష్ణనిరోధ కావసరములకును ఉపయోగ పడుచున్నవి.

గ్రాఫైటు (graphite), వజ్రము- ఈ రెండును రాసాయనిక ముగ బొగ్గు పదార్థము మాత్రమే కలిగి యుండును. కాని మొదటిది ఉష్ణరాసాయన నిరోధక పదార్థముగను, రెండవది ఆభరణముగను, కోతపదార్థము గను ఉపయోగపడుచున్నవి.

మానవోపయోగ ఆర్థిక ఖనిజములను గూర్చిన అనేక ఇతర విషయములను తెలిసికొనుటకు పూర్వము వీటికి సంబంధించిన శాస్త్రములను, వీటి అన్వేషణకై జరిగిన కృషినిగూర్చి తెలిసికొనుట అవసరము. రాతియుగ మం దలి మానవుడు వేట కొరకును, నిప్పును సృష్టించుటకును ఉపయోగించిన రాతిసాధనములు ఒక రక మైన ఖనిజము లే. అందుచే ఖనిజములు రాతియుగము నుండియే మాన వోపయోగములుగ నున్నవని చెప్పనగును, కాని అప్పటి మానవుడు, ఈ ఖనిజములు తాదాత్మ్యకముగ కనిపించి నపుడు, వాటిని ఆ సమయమున తనకు తోచినరీతిగా ఉపయోగించెడివాడు; లేకున్న పార వై చెడివాడు. కావున ప్రధానావసరములగు పనిముట్లు తయారైన పిదప వాని దృష్టి రంగు రంగులుగా నుండి మెరయు చుండెడి వజ్ర సంబంధిక పదార్థములచే ఆకర్షింపబడెను. ఆనాటి మానవుడు వజ్రములను ఆభరణములుగను, ఆట వస్తువులుగను ఉపయోగించుకొనుటకు కృషి సల్పెను. కావుననే మొట్టమొదటగా వజ్రములు క్రీ.పూ. 3500 సం. పూర్వము నుండియే ఉత్తర ఈజిప్టుదేశమున ఆర్థిక ముగ ఉన్నతస్థాన మలంకరించినవి. కాని వీనికి సంబంధించిన విషయములను తెలివిగా, తార్కికముగా ఆలోచించి ఎవ్విధముగా వాటిని ఉపయోగించిన సార్థకమగునో కనుగొనుటకు ప్రప్రథమమున యత్నించినది గ్రీకు దేశీయులు. ఖనిజములు ఒక పరిశ్రమగా రూపొందుట క్రీ. పూ. 2500 సం. కే ప్రారంభమైనది. అప్పుడే తెల్ల సుద్ధతో పింగాణీ పాత్రలు, ఇటుకలు, బొమ్మలు చేయుట మొదలైనది. ఈ ఖనిజ విషయముల నొకచో క్రోడీకరించి గ్రంథరూప మొసగిన ("Book of stones") ఘనత గ్రీకు తత్త్వవేత్త అరిస్టాటిల్ శిష్యుడగు థియోప్రటన్ (క్రీ. పూ. 372-287, నకు దక్కినది. క్రీ.పూ. 1925 సం.న ఈజిప్టు దేశస్థులు ఎఱ్ఱసముద్ర ప్రాంతమున 'మరకతము ' (emerald) అను వజ్రము కొరకు 800 అడుగుల లోతున 400 మంది మనుష్యులు పనిచేయుటకు వీలైన సొరంగ మును త్రవ్వినట్లు ఆధారములు కన్పట్టినవి. ఆనాటి భారత దేశమున ఇ ను ప ఖనిజమును కొలుములలో కరిగించి, దాని నుండి ముడి ఇనుమును తయారుచేసి, పని ముట్లుగా నిర్మించుకొనెడివారు మనదేశమున కన్పడు ఇనుప స్తంభములను పరికించినచో, ఆ రోజులలో భారతీ యులు ఎంతటి మేలురకమైన ఇనుమును, ఉక్కును తయారుచేయగలిగిరో స్పష్టమగును.

అనంతరము చాలకాలము వరకు ప్రయత్నపూర్వక ముగనో, తాదాత్మ్యక ముగనో కనుగొనబడిన ఖనిజము లను శ క్తికొలది వినియోగించుకొనుట యందును, ఖనిజ సంబంధ విషయ సేకరణము నందును పెక్కు ప్రయత్న ములు జరిగినవి. కాని వాటి నొకచో క్రోడీకరించి, విభ జించి, వివిధ శాస్త్రములుగ రూపొందించుట జరుగ లేదు. ఖనిజము లె ట్లేర్పడినవను విషయముపై కృషి సల్పి సవ్యమైన సిద్ధాంతమును ప్రథమముగా ప్రతిపాదించిన వాడు జార్జియస్ అగ్రికోలా (1494-1555). అతని సిద్ధాం తమునకు ప్రస్తుతము విలువ లేకున్నను, ఆ శాస్త్రమునకు నాందీ ప్రస్తావన జరపిన ఘనత అతనికే దక్కినది. 18 వ శతాబ్దిలో ఈశాస్త్రమున కొక విశిష్టస్థానమును కల్పించు టకు అనేకులు విస్తారమైన కృషి సల్పిరి. 19, 20 వ శతాబ్దులయందు శాస్త్రజ్ఞుల కొక తార్కిక విమర్శనా దృష్టి ఏర్పడి, అనేక విశిష్ట సిద్ధాంతరచనకు అవకాశ మేర్పడెను. వీటిలో అనేక సిద్ధాంతము లిప్పటికిని చలా మణిలో నున్నవి.

వివిధ ఖనిజములను ఉపయోగించు విధానములు జన రంజక మగుటయేగాక, అనేక నూతన విధానములు నిర్విరామముగ కనుగొనబడు చుండుటచే, వాటి గిరాకి దినదిన ప్రవర్థమాన మగుచున్నది. అడియుగాక, ఖనిజ ములను వెలికి తీసి, తరిగించుటయే మనకు తెలియును