Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఖగోళశాస్త్రము (ప్రాచీన భారతీయుల కృషి)

సంగ్రహ ఆంధ్ర

సాధ్యమగుచున్నది. అందుచేత ఈ ప్రక్రియలు వ్యవసాయోత్పత్తిని పెంపొందించుకొనుటకు పరోక్షముగ సహాయకారు లగుచున్నవి.

పోడిమి గలిగినట్టియు, సమర్థవంతమగు నట్టియు కంచె విధానమును ఎన్నుకొనుటయందు సామాన్యుడైన వ్యవసాయదారుడు జాగరూకత వహింపవలయును.

బి. ఆర్. బి.


ఖగోళశాస్త్రము (ప్రాచీన భారతీయుల కృషి) :

మిక్కిలి ప్రాచీనమైన శాస్త్రములలో ఖగోళశాస్త్ర మొకటి. ఈ శాస్త్రము మొదట ఏ దేశమున ప్రారంభింపబడినది అను విషయమును గూర్చి పండితు లింకను మీమాంసించుచునే యున్నారు. చైనా దేశమున ఈ శాస్త్రము క్రీస్తు పూర్వము మూడువేల సంవత్సరముల నుండియు, బాబిలోనియాలోకూడ ఇంచుమించు అదేకాలము నుండియు ప్రచారములో నున్నట్లు, ఈజిప్టులో 'నైల్' నదీ ప్రాంతమునకూడ కొంతవరకీ శాస్త్రము అభివృద్ధియైనట్లు, క్రమముగా నీ శాస్త్రము బాబిలోనియా నుండి గ్రీసుదేశము క్రీస్తుపూర్వము 700 సంవత్సరముల నాటికి వ్యాపించి బాగుగా వృద్ధిపొందినట్లు, అచ్చటి నుండి క్రమముగా అరేబియాద్వారా భారతదేశమునకు వ్యాపించినట్లు పాశ్చాత్య చరిత్రకారులు వ్రాసి యున్నారు. ఈ సిద్ధాంతమును లోకమాన్య బాలగంగాధర తిలక్ మహాశయ ప్రభృతులు తీవ్రముగా ఖండించి, ప్రాచీన భారతదేశమున తక్కువలోతక్కువ కాలమును పరిగణించినను, 8 వేల సంవత్సరములనుండి ఖగోళశాస్త్రము ప్రచారములో నున్నట్లు స్పష్టీకరించి యున్నారు.

ఈ శాస్త్ర ముద్భవించుటలో భారతదేశమునకు తదితర దేశములకు ముఖ్యమైన భేదమొకటి గమనించవలసి యున్నది. ఇతరదేశములలో ప్రాక్తన మానవుడు ఖగోళీయ గ్రహ నక్షత్రములను కేవల జిజ్ఞాసా ప్రబోధితుడై అర్థము చేసికొనుటకు యత్నించుటలో శాస్త్ర మభివృద్ధియైనది. కాని భారతదేశమున అట్లుకాదు. ఏనాడో, ఏ విధముగానో, ఉద్భవించి ఆసేతు హిమాచలము ప్రచారములోనున్న వేదవాఙ్మయము యజ్ఞయాగాది కర్మను బోధించుచు, తత్తత్కర్మాచరణమునకు ఉచిత కాలనిర్ణయము చేసియున్నట్లు వేదములనుండియే తెలియుచున్నది. కావున ఖగోళశాస్త్ర మీ దేశమున ఆధ్యాత్మిక వ్యవసాయమున జనించినట్లు స్పష్టమగుచున్నది. మరియు వేద కాలమని వ్యవహరింపబడు ప్రాచీన కాలమునుండియు ఈ దేశమున పంచాంగగణనము ప్రచారములో నున్నట్లు గోచరించుచున్నది. మరియు భాస్కరాచార్యుడు (క్రీ. శ. పండ్రెండవ శతాబ్ది). సిద్ధాంత శిరోమణి యందు


'వేదాస్తావత్ యజ్ఞకర్మ ప్రవృత్తాః
 యజ్ఞాః ప్రోక్తా స్తేతు కాలాశ్రయేణ
 శాస్త్రాదస్మాత్ కాలబోధోయతస్స్యాత్,
 వేదాంగత్వం జ్యౌతిషస్యోక్త మస్మాత్ '

అని చెప్పుచు వేద విహిత యజ్ఞయాగాది కర్మానుష్ఠాన విహితకాల నిర్ణాయక శాస్త్రమగుటచేత జ్యోతిషము వేదాంగముగ పరిగణింపబడి యున్నదని నిర్వచించి యున్నాడు. దీనినిబట్టి మనము ముఖ్యముగా గమనించ వలసిన విశేష మేమన ఏ నాడు వేదాంగ విభాగము మనదేశమున వ్యవహారములోకి వచ్చెనో, ఆనాడే జ్యోతిశ్శాస్త్రము శాస్త్రస్వరూపములో నున్నట్లు స్పష్టము. వేదాంగ విభాగ వ్యవహారకాలము వేద కాలమునకు సుసన్నిహిత మగుటచేత ప్రాచీన భారతీయుల ఖగోళశాస్త్ర కృషి ప్రాచీనతమమని స్పష్టముగా చెప్పవచ్చును. అదియును గాక వేద వాఙ్మయమందే పంచాంగవ్యవహార సూచక వాక్యము లనేకములు మనకు గోచరించుట జేసి సాక్షాత్ వేదసమాన కాలికత్వము భారతీయ ఖగోళశాస్త్రమునకు సిద్ధించుచున్నది. అందు కుదాహరణములు :


యజుర్వేద సంహిత యందు :
“కృత్తికా నక్షత్ర మగ్నిర్దేవతా”

అని నక్షత్ర విభాగము కృత్తికాదిగా ప్రతిపాదింపబడినది. మరియొక చోట


"షట్కృత్తికా ముఖ్యయోగం వహంతీ
య మస్మాక మేధ్యత్యష్టమీ"

అని చెప్పబడినది. కృత్తికా శబ్దము క్షురాపరపర్యాయ మగుటచేత, ఆరునక్షత్రములు కలసి మంగలికత్తి యాకారమున నుండు గుంపునకు షట్కృత్తికావ్యవహారముగా వేద కాలమునుండి ప్రచారములో నుండె నని స్పష్టమగు చున్నది. గ్రీసుదేశములోకూడ నీ వ్యవహారము కన్పట్టుట

168