క్షేత్రయ్య II (సాహిత్యము)
సంగ్రహ ఆంధ్ర
ములుగా క్షేత్రయ్య చిత్రించెను. ఇతడు ప్రతిపదమునందును నాయికా రూపమున నిలచినాడు. గోపాలుని అనుగ్రహముచే పరిపూర్ణుడై క్షేత్రజ్ఞుడనిపించుకొన్నాడు. మధురభావ సాధనలో ఉత్తమస్థాయి నందుకొన్నాడు క్షేత్రయ్య. ఇతని గొప్పతనమును గుర్తించుట సులభ సాధ్యముకాదు. ఇతడు పోయిన శృంగారరసపు పోకడలు ఏ మహాకవి కవిత్వములోను కనబడవు.
“ఈమేను జీవునకు ఎంత ప్రియమాయెనే"
“ఎంతలేదని ఎంచకురా"
“ఎటువంటి మోహమోగాని"
"ఎన్ని తలచుకొందునమ్మా"
“ఏమని తెలుపుదు, ఏలాగు తాళుదు"
"ఏమి సేయుదు మోహమెటువలె దీరును"
మొదలైనవి ప్రకృతమునకు ఉదాహరణములు. వీటిని జాగ్రత్తతో పరిశీలించినచో క్షేత్రయ్య భావనాశక్తి ఎంత ఉన్నతమైనదో తెలియగలదు. ఇది అనుభవైక వేద్యము. ఇదే క్షేత్రయ్యయొక్క ప్రతిభా విశేషము. ఇదే ఇతని ప్రత్యేకత.
వి. అ.
క్షేత్రయ్య II (సాహిత్యము) :
ఆంధ్ర వాఙ్మయ ప్రపంచమున క్షేత్రయ్య జీవితము సాహిత్య త్రివేణీ సంగమము. క్షేత్రయ్య రససిద్ధుడగు ఆంధ్ర వాగ్గేయ కారుడు. పదకవితా పట్టభద్రుడు. ఆంధ్ర జయదేవుడు. మధుర భక్తి కలకండములు పండజేసినట్టి ధన్యజీవి క్షేత్రయ్య.
అన్నమయ్య, త్యాగయ్య. క్షేత్రయ్య అను నీ త్రిమూర్తులును సుప్రసిద్ధ వాగ్గేయకారులై వరలిరి అన్నమయ్య ఆంధ్ర సంర్తన కవితా పితామహు డని పేర్వడసెను. త్యాగయ్య భక్తిపరవశుడై కృతులు పాడెను. క్షేత్రయ్య రసపరవశుడై పదములు వ్రాసెను. త్యాగయ్య అనంతరాగ కలశములందు, లోకులాస్వాదించుటకై. రామ ముఖారవింద మకరందమును తేరిచి పోసినవాడు. క్షేత్రయ్య తన పదములందు శ్రీ కృష్ణుని కోమల పాదములందు గుల్కిన మువ్వల మ్రోతను జాను తెనుగులచే పొదిగినవాడు. త్యాగయ్య నాదబ్రహ్మోపాసకుడు; క్షేత్రయ్య రమ్యకళోపాసకుడు.
పదమనగా అభినయమునకు పనికివచ్చు శృంగార గేయము. జావళీలలో లేని సర్వకళా సౌష్ఠవము, తాళ విలంబనము పదములలో కాననగును. భానుదత్తుని రసమంజరి యందలి లక్షణములకు అభినయరూపమైన లక్ష్య సామగ్ర్యము నొసగినవారు కూచిపూడివారు. పదరూపమైన మనోహర లక్ష్యసమగ్రత నొసగినవాడు క్షేత్రయ్య. ఇతని పదములలో లక్షణానుసరణము, రసభావ ప్రకటనము, సమప్రాధాన్యము వహించి, అహమహమికతో పరుగిడు చుండును. క్షేత్రయ్య రాగము, తాళము, అభినయము అను నీ మూడు మార్గములలో తన పరమభక్తి ప్రవాహమును నడిపించిన ఘనుడు.
నాయికా నాయక భావమున రసరాజగు శ్రీకృష్ణపరమాత్మయందు రసరాజమగు శృంగారభక్తిని ప్రవర్తింప జేసి అది స్వపరతారక మగున ట్లొనర్చిన నిరవధిక కృష్ణభక్తి పరినిష్ఠితుడు క్షేత్రయ్య.
క్షేత్రయ్య నాయికలకు గల విరహము, సంయోగము అను రెండు విధములైన శృంగారములయందు గూడ జనించు గ్లాని, శంక, అసూయ, దైన్యము, ఆవేగము, అవహిత్థ, హర్షము మున్నగు భావావస్థలలో వాటి వాటికి తగిన రాగతాళములను ఏర్చి, కూర్చి తన సంగీత శాస్త్రాది రహస్యాభిజ్ఞతను, వైదుష్యమును వెల్లడించినాడు
క్షేత్రయ్య పదములందు విస్తరింపబడిన సంయోగ విప్రయోగము లను రెండువిభాగములలో రెండవదానివే రసికులు మధురమైన దానినిగా స్వీకరించిరి. క్షేత్రయ్య నాయికకు నాయకునితోడి వియోగమువలన ఏర్పడు పలు రకముల దుఃఖములను ఉదహరించుచు, వాటికి తగిన ముఖారి, ఘంట, నాదనామక్రియ, పున్నాగవరాళి మొదలగు రాగములను అభినయించుట కనువగు త్రిపుట, చాపు, అట మున్నగు తాళములను సమకూర్చినాడు.
జయదేవాదులు వడియగట్టిన సంస్కృత భాషా మాధుర్యమును మించిన తీపి తెనుగునందు కలదని తన పదరచనాద్వారమున ప్రకటించిన మహావిద్వాంసుడు క్షేత్రయ్య. ఇతని పదములలో కొన్ని నాయికా వాక్యములు, కొన్ని నాయక వాక్యములు, కొన్ని దూతికా వాక్యములు, మరికొన్ని నాయికా నాయకుల సంభాషణ
158