Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

క్షేత్రయ్య II (సాహిత్యము)

రూపముననున్న వాక్యములును కలవు. ఇతని పదములలో విరహోత్కంఠ యగు నాయిక విరహబాధను సహింప జాలక తన గోడును చెలికత్తెతో వెల్లడించు ఘట్టములు పెక్కులు గలవు. ఇట్టి విరహవర్ణనాత్మక పదబాహుళ్యముచే పదములందు సాత్త్వికాభినయమునకు చేకూరిన అవలంబనము అనంతమైనది. నాయకుడు అన్యాసక్తుడై యుండుట నెరిగి, నాయిక అతనిని ఉపాలంభించు ఘట్టములు, వాసవసజ్జిక, ఖండిత మున్నగు నాయికలు తమ భావాభివ్యంజన మొనర్చు ఘట్టములు అచ్చటచ్చట కనిపించుచున్నవి. క్షేత్రయ్య అన్యాపదేశముగా ఆత్మీయాం శములను చెప్పు తావులునున్నవి ఆత్మభావోద్రేకత, శక్తి, రసభావపూర్ణత గలవి క్షేత్రయ్య పదములు. క్షేత్రయ్య పదములందలి రసము ప్రధానముగ శృంగార మగుట చేతను, దాని నాతడు చిత్రించినరీతి మిక్కిలి రమ్య మగుట చేతను, అతని పదములు సర్వజనాహ్లాదకరములైనవి.

శృంగార వర్ణనమున సభ్యత పరాకాష్ట నొందిన తావులు పెక్కులున్నవి.


“పచ్చియొడలి దానరా...
"ఇన్నాళ్లవలె గాదమ్మా. . .
“వెదకి తేరా, పోయి, వేరు వెల్లంకి ... ఇత్యాదులు

ప్రకృతమునకు ఉదాహరణములు.

శృంగారరసము అసభ్యముగ పరిణమించిన తావులునుగలవు. ఎడనెడ విప్రలంభము భక్తి రసముచే ఉప బృంహితమైనది కూడ — ఇట్టి రసముల మేలికలయికలో అశ్లీలమునకు గాని, సిగ్గునకు గాని తావే లేదనవచ్చును. మొత్తముమీద క్షేత్రయ్య పదములలో మోక్ష కామోపేతమైన ఉజ్జ్వల శృంగారముయొక్క ఛాయలు తక్కువ. స్త్రీపుంసయోగ హేతువగు లౌకిక శృంగారమే అతి నిపుణముగను, హృద్యముగను అభివర్ణితమైనది;

క్షేత్రయ్య పదములందు భాషకును, భావమునకును సామరస్యము స్ఫుటముగ గోచరించుచున్నది. అనగా భాషయు, భావములును తుల్యమైన సౌకుమార్యము కలవై శోభించుచున్నవి. ఉదా :


"అయ్యయ్యో! వెగటాయెనే...
“తరుణిరో! న న్నాడుదాని జేసిన విధి...
"ఎవతె తాళునమ్మా యీ నడతల ...
"వాడిచ్చిన సొమ్ము లేల వద్దంటివి...
"తెలియవచ్చెనురా, వగలెల్ల ...
“ఎందులకు వచ్చెనో కోపము ...
“నోరెత్త నైతినమ్మా...
"నీకే దయరావలె కాక దిక్కెవ్వరు...
“నిదురవచ్చున కంటికి స్వామి...

ఇత్యాది పదములందు పరిపుష్టమైన భావ సౌకుమార్యము అనితరతుల్యము. క్షేత్రయ్య పదములందు ఆయా నాయికలకు ఆయా దశలందు ఏర్పడు ఆయా భావములను ప్రతిపాదించు వాటిలో కొన్నింటికి ఉదాహరణములు :

నాయిక - స్వీయ - తృప్త :


                              మోహన - జంపె
మగువ తన కేళికా-మందిరము వెడలెన్
వగకాడా మాకంచి_వరద! తెల్లవారె ననుచు. ॥మ॥
విడజారు గొజ్జంగి–విరిదండజడతోను
కడు చిక్కు పడి పెనగు-కంటసరితోను
నిడుదకన్నులదేరు- నిదుర మబ్బుతోను
తొడరి పదయుగమున దడబడెడు నడతోను. ॥మ॥
సొగసి సొగయని వలపు-సొలపు జూపులతోను
వగవగల ఘనసార - వాసనలతోను
జిగిమించు కెమ్మోవి చిగురు కెంపులతోను
సగము కుచముల విదియ చందురులతోను. ॥మ॥
తరితీపు సేయు సమ - సురతి బడలిక తోను
జిరుతపావడ బెరగు-జార్పైటతోను
ఇరుగడలకై దండ - లిచ్చు తరుణులతోను
పరమాత్మ ! మువ్వగోపాల ! తెల్లవారె ననుచు. ॥మ॥

ఈ నాయిక స్వీయ. రతితృప్త, రతిశ్రమాలన, నిదుర బద్ధకముతోను, రేయి ప్రవర్తిల్లిన క్రీడా చిహ్నములతోను, కూటమి యందలి వివిధ విభాగములు. వాటి యందలి రసము చిప్పిలుచుండు భావములతోను, ఆమె కేళీమందిరమును వీడి వచ్చు సొగసు, శృంగార విభావముగా ఇట ప్రస్తావింపబడినది. ఈ నాయిక పరకీయ కాదు. పరకీయకు ఉపపతితోడి కేళీమందిరము, ఇరుగడల కైదండ లిచ్చు సఖులు నుండుట సహజోచితము కాదు. ఈమె తెనుగు ఆడది. కనుకనే సగము కుచముల

159