Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క్షేత్ర - యంత్రములు

సంగ్రహ ఆంధ్ర

నిశ్శేషముగా నిర్మూలించుటకును, మట్టి గడ్డలను చూర్ణముగా చితుకగొట్టుటకును శ క్తిమంతముగా పనిచేయును.

ఇట్టి గుంటకలు భూమిలో లోతుగా, సులభముగా చొచ్చుకొనిపోవుటకై, వీటిమీద బరువులు పెట్టుటకు వెడల్పయిన పళ్ళెములవంటి సాధనములును, గుంటక తోలువానికి ఒక ఆసనమును అమర్చబడి యుండును.

(బి) స్పైక్ టూత్ గుంటకలు లేక దంతెలు (Spike Tooth Harrows) : ఈ గుంటకల యొక్క అడ్డలకు ఉక్కుతో తయారు కాబడిన బలమైన మేకులు అమర్చబడును. ఇట్టి మేకులు గుంటకల యొక్క పరిమాణము ననుసరించి తరగతులవారీగా ఏర్పాటు చేయబడును. అనగా గుంటకలను లాగెడి ఎద్దుల సామర్థ్యమును బట్టియు, భూమిలోనికి చొచ్చుకొని పోవలసియున్న లోతును బట్టియు ఈ తరగతులు నిర్ణయింపబడును.

(సి) స్ప్రింగ్ టూత్ గుంటకలు (Spring Tooth Harrows) : ఈ తరగతికి చెందిన గుంటకలకు స్థిరముగా అమర్చబడు ఉక్కు మేకుల స్థానములో బలమైన ఉక్కు స్ప్రింగులు చట్రములో నిర్మింపబడును. నాగలి కఱ్ఱు అమర్చబడు కోణములోనే పళ్ళవంటి ఈ స్ప్రింగులు గూడా అమర్చబడును. ఈ స్ప్రింగులు బలిష్ఠములుగా నుండుటచే గట్టి రాతి నేల లందు సహితము వీటిని ఉపయోగించ వచ్చును. ఇవి చెడిపోవు. పై ఉదహరించిన స్పైక్ గుంటకల కంటె ఇవి భూమిలోనికి ఎక్కువ లోతుగా చొరబడి, అచ్చటనున్న కలుపును వెలుపలికి పెకలించి వేయును.

బండ్ ఫార్మర్ (Bund-former) : పంట భూములలో నీరు పారుదల చేయుటకై బోదెలు తయారుచేయు సామాన్యమైన ఈ సాధనమును జోడెద్దులు లాగును. ఈ బోదెల ద్వారా మడులకు నీరు సరఫరా అగును. ప్రత్తి విత్తనములు నాటుటకును, ఇతర పంటలు పండించుటకును అవసరమగు కట్టలను (ridges) ఈ సాధనముతో నిర్మించెదరు.

విత్తనములు వెదపెట్టు - మొక్కలు నాటు యంత్రము :

(ఎ) గొర్రు : ఆంధ్ర ప్రాంతములో విత్తనములను వెదపెట్టుటకై గొర్రు అను సాధనమును ఉపయోగించెదరు. ఇటులనే వేర్వేరు రాష్ట్రములలో ఈ సాధనమును వేర్వేరు నామములతో పిలిచెదరు. విత్తనములను వెదపెట్టు ఈ సాధనమును వెదగొర్రు అని పిలుతురు. విత్తనములను భూమిలో నాటుటకై వెదగొర్రునకు 'జడ్డిగములు' అనుపొడవైన గొట్టములు అమర్చబడి యుండును.

చిత్రము - 42

దేశీయ గొఱ్ఱు

పటము - 5

అవసరమును బట్టి జడ్డిగముల సంఖ్య మారుచుండును. మధ్యప్రదేశములో రెండు జడ్డిగములుగల ఈ సాధనమును “దుప్ఫాన్" అనియు, మూడు జడిగములుండు దానిని 'తిప్ఫాన్ 'అనియు. మూడింటి కంటె ఎక్కువ జడ్డిగములు గల దానిని 'ఆర్ఘాడా' అనియు పిలిచెదరు. అడ్డముగా (horizontal) గల ఒక కొయ్య కడ్డీకి, విత్తనములు నేలలోనికి పడునట్లు కొన్ని గొట్టములు లేక జడ్డిగములు అమర్చబడును. విత్తనములు నాటుటలో గల తారతమ్యమును బట్టి జడ్డిగముల మధ్య ఉండవలసిన దూరము నిర్ణయింపబడును. విత్తనములు వెదపెట్టు నతడు అదే సమయములో తయారుకాబడు చాళ్ళలో సూటిగా పడునట్లు జడ్డిగములద్వారా విత్తనములను వదలుచుండును. ఈ కార్యక్రమము అనుభవము గల రైతుచే నైపుణ్యముతో నిర్వహింపబడును.

విత్తనములు వెదపెట్టు ఆధునిక యంత్రము (Mechanical seed drill) : ఆధునిక యుగమందు అవసరమును పురస్కరించుకొని అనేక వరుసలలో విత్తనములు వెదపెట్టు యంత్రములును, మొక్కలను నాటు యంత్రములును ఉపయోగింపబడుచున్నవి. దేశీయమైన 'గొర్రు' 'దుప్ఫాన్' 'తిప్ఫాన్ 'వంటి సాధనములకంటె ఈ ఆధునిక

152