Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

క్షేత్ర యంత్రములు

దేశీయమైన ఇనుపరేకులుగల గుంటకలు :

దేశీయమైన గుంటకలకు అడ్డముగా (horizontal) కత్తివంటి ఒక సాధనము భూమియందు లోతుగా చొచ్చుకొని పోవునట్లు అమర్చబడును. గుంటకను తోలునపుడు ఈ కత్తి లోతున నుండెడి కలుపును నరకును. గోధుమ మొదలయిన మెరక పంటల కుపయోగపడు నాగళ్ళవలె గాక ఈ గుంటక లు అప్పుడప్పుడు మాత్రమే వాడబడును. ఇనుపముక్క లమర్చిన ఇట్టి గుంటకలు వాటి పరిమాణములనుబట్టి విభిన్నములయిన వర్గములుగా, వేర్వేరు రాష్ట్రములలో, వేర్వేరు పేర్లతో వ్యవహరింపబడు చున్నవి. ఉదాహరణమునకు మరాట్వాడా, విదర్భ, ఉత్తర భారత దేశములందు ఈ సాధనమును “బాఖర్" అనియు, దక్షిణదేశమునందు "గుంటక" అనియు పిలుచు చున్నారు.

గుంటక : ఈ సాధనములో ప్రధానమైన భాగము “అడ్డ". ఇది లావైన కొయ్య చట్రము. దీనికి మేడి అమర్చబడును. ఈ మేడికి ఒక చేతి పిడి గూడా ఏర్పాటు చేయబడి యుండును. మేడిని, కాడిని కలుపు మరొక ముఖ్యమైన భాగము 'నగలు' అని పిలువబడును. భూమిలోనికి చొచ్చుకొని పోవు పదునైన యినుపబద్దె అడ్డకు అమర్చబడి యుండును. ఈ యినుపబద్దె 3 అడుగుల పొడవును, 3 అంగుళముల వెడల్పును 1/2 అంగుళము మందమును ముందు భాగములో పదునైన అంచును కలిగి యుండును. "బరాగుంటక" అనబడు 6 ఆడుగుల వెడల్పు

చిత్రము - 40

గుంటక

పటము - 3

గల గుంటకలుగూడ వ్యవసాయములో ఉపయోగింపబడు చున్నవి. 'దంతెలు' అను చిన్న గుంటకలు వెడల్పయిన చాళ్ళ యందు కలుపు తీయుటకు విరివిగా ఉపయోగపడుచున్నవి.

మేలిరకపు గుంటకలు (విద్యుచ్ఛక్తి వల్లగాని, ఎద్దుల వల్లగాని లాగబడునవి) :

(ఎ) డిస్క్ గుంటకలు (Disk harrows): ఈ గుంటకలకు అమర్చబడిన చదరపు ఇరుసులపైన ఆరు

చిత్రము - 41

డిస్క్ గుంటక

పటము - 4


అంగుళములకు ఒక్కొక్కటి చొప్పున గుండ్రని బిళ్ళలు ఏర్పాటు చేయబడును. గుంటక నడచునపుడు ఇరుసులతో పాటుగా వాటిమీద అమర్చబడిన గుండ్రని బిళ్ళలు గూడ వలయాకారములో తిరుగును. ఇరుసులను యుక్తమైన కోణములో (angle) సిద్ధముగా ఉంచినపుడు, గుండ్రని బిళ్ళలు వంపుతిరిగి నేలలోనికి చొచ్చుకొని పోవును. ఈ సాధనము, గడ్డి గాదము దట్టముగా పెరిగియున్న భూములలో కలుపును

151