Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క్షేత్ర - యంత్రములు

సంగ్రహ ఆంధ్ర

మౌల్డ్ బోర్డు నాగలి (mould board plough) అను రెండు రకముల నాగళ్ళు కలవు.

చిత్రము - 38

దేశీయమగు కొయ్యనాగలి

పటము - 1

దేశీయమైన నాగలి కొయ్యతో చేయబడును. దీనిలో ఏడికర్ర, కర్రు, మేడి అను భాగములు అమర్చబడి యుండును. దీనిని వంకరయైన తుమ్మకర్రతో గాని, ఏపె కర్రతోగాని తయారు చేయుదురు. 'కర్రు' అను ఇనుప ముక్క సన్నగా చెక్కబడిన నాగలి చివరభాగమునకు అమర్చబడి నేలను దున్నుటకు అనుకూలముగా ఏర్పాటు చేయబడును. చిన్న నాగళ్లను పల్లపు భూముల వ్యవసాయమునందును, మధ్యరకపు నాగళ్ళను మెట్ట వ్యవసాయమందును, తోటల సాగుబడియందును ఉపయోగించెదరు.

నేలను లోతుగా కెళ్ళగించుటకును, నారుమళ్ళు తయారు చేయుటకును భూమిపై తోలబడిన యెరువు, మట్టిలో కలిసిపోవునట్లు దున్నుటకును, కంది మొదలయిన పంటపొలములలో వెడల్పుగానున్న చాళ్ళమధ్య దున్ని పైరును ఏపుగా పెంపుదల చేయుటకును, కొన్ని పైరులను పల్చనచేయుటకును, కలుపును ఏరిపారవేయుటకును నాగలి ఉపయోగపడును. అప్పుడప్పుడు నీరు పారుటకు వెడల్పయిన చాళ్ళను తయారు చేయుటకుగూడ నాగలి ఉపయోగపడును. కొన్ని ప్రాంతములందు నాగలి అడుగు భాగమున ఒక కన్నమును ఏర్పాటుచేసి, విత్తనములు చల్లుటకై నిడుపైన ఒక గొట్టమును ఈ కన్నములో అమర్చెదరు. ఈ విధముగా అమర్చబడిన నాగలిని “వెదనాగలి” (Nari Plough) అని పిలిచెదరు.

"మౌల్డ్ బోర్డు" (Mould board) అను నాగళ్లు అనేక పరిమాణములలో తయారు చేయబడును. వీటి

చిత్రము - 39

మౌల్టు బోర్డు నాగలి

పటము - 2

వెడల్పు 6 నుండి 8 అంగుళములవరకు ఉండును. ఇట్టి నాగళ్లు పశువులు లాగుటకు వీలుగా నిర్మింపబడుచున్నవి. 6 అంగుళముల వెడల్పుగల నాగళ్లు సాధారణముగా ఉత్తరప్రదేశ్, ఢిల్లీప్రాంతములందును, 7 అంగుళముల నాగళ్లు దక్షిణభారతము నందును వాడుకలో నున్నవి. ఇట్టి నాగళ్ల ప్రయోగమువలన భూమి 4 నుండి 6 అంగుళముల లోతువరకు తెగుచున్నది. ఎద్దులచే లాగబడు ఇట్టి నాగళ్లు భారతదేశములో అన్ని ప్రాంతములందు అమ్మకమునకు లభించును. ఈ నాగలివలన నాగటి 'కర్రు'కు ఒక ప్రక్కనున్న భూమిమాత్రమే కదలబారగా, దేశీయమైన కొయ్యనాగలి ఇరుప్రక్కల గల నేలను కదలబారచేయును. కొయ్యనాగలికంటె ఈ నాగలికి వలయు ఈడ్పుశక్తి (pull) తక్కువస్థాయిలో నుండును.

2. గుంటక : ఈ సాధనము మట్టిగడ్డలను మెత్తగా చితుకకొట్టి, భూమిని చదునుచేయుటకును, కలుపును ఏరివైచి విత్తనములపై మన్ను సక్రమముగా కప్పి యుంచుటకును, ఉపయోగపడును. పలురకములగు గుంటకలలో ఈ క్రిందివి సర్వసామాన్యముగా వాడుకయం దున్నవి.

150