Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క్రైస్తవ మతము

సంగ్రహ ఆంధ్ర

వికెట్‌నుండి మరియొక వికెటునకు పరుగిడి దానిని చేరినచో అట్టిదానిని ఒక పరుగు (Run) గా నిర్ణయింతురు.

4 బంతికాని బంతి కొట్టువాని బాట్ కాని లేదా అతడేగాని 'స్టంపుల' మీదనుండు రెండు అడ్డుపుల్లలను (Bails) తొలగునట్లు చేసినను, లేదా స్టంపును భూమిపై పడునట్లుకొట్టినను, వికెట్ పడిపోయినట్లే నిర్ణయింపు బడును.

5. బంతిని కొట్టువాడు తన చేతియందలి బాట్, లేదా తన శరీరమందలి ఏ భాగముకాని 'పాపింగ్ క్రీజ్‌' (Poping Crease-నిర్ణీతపు హద్దు) లోపల లేకున్నచో, అతడు తన స్థానమును తప్పినట్లుగా (Out of the ground) నిర్ణయింపబడును.

6. బాట్స్‌మన్ యొక్క చేతిలోని బాట్‌ను గాని, లేదా అతనినేగాని తాకకుండ, బంతి వికెట్‌కు తగిలి, దానిని పడగొట్టినచో ఆ బాట్స్‌మన్ 'బౌల్డ్ అవుట్ ' (Bowled out) అయినట్లుగా నిర్ణయింతురు.

7. బాట్స్‌మన్ బంతిని కొట్టినపిదప (ఆ బంతి వాని బాట్‌కు తగిలివచ్చినదైనను, లేదా, మణిబంధము లేక ముంజేతికి తగిలి వచ్చినదై నను) ఆ బంతి భూమికి తాకక పూర్వము, ప్రత్యర్థిచే పట్టుకొనబడినచో, ఆ కొట్టినయతడు 'పట్టుబడి అవుట్' (Caught out) అయినట్లు నిర్ణయింతురు.

8. ఆటలో బాట్స్‌మన్ బంతిని కొట్టబోయి తన బాట్ తోగాని, లేదా తన శరీరమందలి ఏ అవయవముతో గాని, తన వికెట్‌నే కొట్టుకొనినచో అతడు 'అవుట్' (Out) అయినట్లుగా నిర్ణయింపబడును.

9. బంతిని కొట్టువాడు, ప్రత్యర్థి బంతిని పట్టబోవు సమయమున వానికి ఉద్దేశపూర్వకముగా అడ్డుతగిలినచో, ఆ బంతిని కొట్టినయతడు 'అవుట్ 'అయినట్లునిర్ణయంతురు.

10. నిర్ణయాధికారి దృష్టిలో, బంతి కొట్టువాడు వికెట్ ను తనకాళ్లతో కప్పియుంచగా, బంతి వానికాలికి తగిలినచో అతడు 'లెగ్ బిఫోర్ ది వికెట్' (Leg before the Wicket) అయి, 'అవుటు' అయినట్లుగా నిర్ణయించబడును.

11. బంతి : క్రికెట్ బంతి 51/2 నుండి 53/4 ఔన్సులవరకు బరువు కలిగియుండును. ఆట సమయమున బంతి పోయినను, లేదా అది ఆడుటకు పనికిరాకపోయిన దయినను, నిర్ణయాధికారి క్రొత్తబంతిని ఉపయోగించుటకు అనుమతించును.

12. బాట్ : క్రికెట్ బాట్ 41/4 అంగుళములకు మించని వెడల్పును, 38 అంగుళములకు మించని పొడవును కలిగి యుండును.

13. క్రికెట్ రంగస్థలము (Pitch) : ఇది 5 అడుగుల వెడల్పున రెండు వికెట్లనడుమ ఏర్పరుపబడి యుండును.

14. వికెట్లు : ఇవి ఒకదాని కొకటి ఎదురెదురుగా 22 గజముల దూరమున పాతి యుంచబడును. ప్రతివికెట్టు మూడు నిలువుపుల్లలు (Stumps) కలిగి, తొమ్మిదిఅంగుళముల వెడల్పున నుండును. ఆ నిలువుపుల్లలపై రెండు అడ్డు పుల్లలు (Bails) ఉండును. నిలువుపుల్లలు వాటినడునుండి బంతి దూరిపోకుండునంతటి దగ్గరగా పుష్టితో నుండును.

15. ఓవర్ (Over); బంతిని విసరు వాడు (Bowler) వరుసగా ఆరుపర్యాయములు బంతిని విసరినచో, అది 'ఓవర్ ' అనబడును. అట్లు రెండువికెట్ల నుండియు ఒకదాని పిదప మరియొకటి (Alternatively) చొప్పునవిసరుదురు. అట్లు ఆరుబంతులు విసరబడిన పిమ్మట, నిర్ణయాధి కారి 'ఓవర్' అని తన నిర్ణయము నిచ్చును.

16. తుది నిర్ణయము : ఉభయపక్షములలో, ఒకరిని మించి ఎక్కువ పరుగులు చేసిన రెండవపక్షమువారు గెలుపొందినట్లు తుది నిర్ణయము చేయబడును.

ప్ర, సీ.


క్రైస్తవ మతము :

ఈ మతము యేసుక్రీస్తుచే స్థాపింపబడి, ఆయనయే మూలపురుషుడుగా కలిగియున్నది. దీని ముఖ్యమత గ్రంథము “పవిత్ర బైబిలు" అనునది. ఇది ప్రాచీననిబంధనము (Old Testament), నవీన నిబంధనము (New Testament) అని రెండుభాగములుగా నున్నది. ప్రాచీన నిబంధనములోనున్న భవిష్యత్పూచన నవీన నిబంధనములో పరిణతి పొందినదని క్రైస్తవులందురు. జాన్ ది బాప్టిస్టు, క్రీస్తునకు పూర్వమే జనించి, తనకంటె మహాత్ము డొకడు వచ్చి మానవుని ఉద్దరించునని భవిష్యత్సూచనను తెల్పెను. ఆ మహాత్ముడే యేసుక్రీస్తు అని క్రైస్తవుల నమ్మకము. ఈ రెండు నిబంధనములలోను పరమేశ్వరుడు ప్రపంచ

134