Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము = 3 131 క్రికెట్

ment)వలనను, క్రికెట్ ఆటకు ఇతోధికమయిన ప్రోత్సాహ మేర్పడెను. 'రెస్ట్' అను అయిదవజట్టు (Pehtangular) 1938 వ సంవత్సరమునుండి పై ఉదాహరించిన నాలుగు జట్టులతో కలసి ఆటలలో పాల్గొనెను. కాని ఈ టూర్న మెంటు సంస్థవారు 1944 వ సంవత్సరములో తమ కార్య కలాపములకు స్వస్తిచెప్పిరి. అయినను వీరు సాధింప దలచిన ప్రయోజనములను అప్పటికే సాధించిరి.

క్రికెట్ ఆట ఇంగ్లీషువారి వెనువెంటనే మన దేశమున ప్రవేశించుటచే, దక్షిణభారతమునకు తరలివచ్చిన ఇంగ్లీషు యువకులు 1848 సం. లో మద్రాసు క్రికెట్ క్లబ్బును స్థాపించిరి. మద్రాసునందలి 'ఐలెండ్ గ్రౌండ్స్'లో ప్రప్రథమముగ క్రికెట్ 'బాట్', 'బంతి'యు ప్రత్యక్ష మయ్యెను. 1865 వ సం. లో ఈ క్లబ్బు చేపాక్ ప్రాంత మునకు మార్చబడెను. 1864 వ సంవత్సరములో మద్రాసు క్రికెట్ క్లబ్బువారు మొట్టమొదటిసారిగా కలకత్తాజట్టుతో పం దెమున పాల్గొనిరి. స్థానిక ముగనున్న కొందరు భారత యువకులు ఈ ఆటచే ఆకర్షింపబడి అనతి కాలములో దీని యందు ప్రావీణ్యము సాధించిరి. యూరపియన్ - భారత జట్టుల నడుమ ఏటేటా క్రికెట్ పం దెములు జరుగునట్లుగ ఒడంబడిక జరిగి, 1908 సం. లో ప్రారంభోత్సవము గావింపబడెను. అర్ధశతాబ్ది కాలములో పటిష్ఠమైన కృషి జరిగినఫలిత ముగ, క్రికెట్ ఆటకు దక్షిణ భారత దేశములో సుస్థిరత్వ మేర్పడెను.

క్రికెట్ ఆట యొక్క అభివృద్ధి కేవలము కలకత్తా, బొంబాయి, మద్రాసువంటి నగరములవరకే పరిమితమై యుండక, మహారాజులయొకయు, నవాబుల యొక్కయు పోషణము మూలమున స్వదేశీయ సంస్థానములయందు గూడ వ్యాపించెను. ఇట్టి షోషకులలో పాటియాలా మహారాజు ప్రథములు. భారతీయ క్రికెట్ ఆటగాండ్రను తర్ఫీదు చేయించుటకై, ఇతడు ప్రఖ్యాతినందిన ఇంగ్లీషు ఆటగాండ్రను మనదేశమునకు తోడి తెచ్చెను. ఇట్లెందరో ఉత్సాహవంతులు ఈ ఆటను భారత దేశమున అభివృద్ధికి తెచ్చిరి. అయినను 'రంజి' అని పిలువబడెడి నవనగర్ 'జామాహెబ్' ఇంగ్లండునందలి క్రికెట్ క్రీడారంగ ములో ప్రదర్శించిన అపూర్వ నైపుణ్యమువలన ఈ యాటకు అఖండమయిన విశిష్టత, ప్రోత్సాహము చేకూరెను. కాకున్నచో, క్రికెట్ ఆట భారత దేశమున ఇంత గాఢముగ వ్రేళ్లూనియుం డెడిది కాదు.

1911 సం.లో పాటియాలా మహారాజు యొక్క నాయకత్వమున అఖిలభారత క్రికెటు జట్టు ఇంగ్లండు దేశ మంతట సంచారము గావించెను. ఈ జట్టులో పార్శీలు, హిందువులు, సిక్కులు, మహమ్మదీయులు పాల్గొనిరి. మొత్తముమీద భారతజట్టు జరిపిన సంచారము ఆశా భంగకరముగా పరిణమించినను, బాలూ, మిస్ట్రీ, కంగా, మెహరోంజీ అను ఆటగాండ్రు వ్యక్తిగతముగ ఇంగ్లీషు వారి మన్ననలనందుకొని క్రికెట్ ఆటలో మేటిమగలని పేర్గాంచిరి.

1889వ సం॥లో ఇంగ్లండునందలి జి. యఫ్. వర్నర్ జట్టు, పిమ్మట 1893 లో లార్డ్ హాక్స్ జట్టు, అనంతరము 1902 లో ఆక్స్ఫర్డ్ అథెంటిక్స్ జట్టు భారత దేశమును దర్శించిన ఫలితముగ, మన దేశములో క్రికెట్ ఆట చిరస్థాయిగా పాదుకొనెను. అయినను, 1926 సం. లో శ క్తిమంతమయిన 'జిల్లిగన్' నాయకత్వమున భారత దేశమునకు వచ్చిన యం. సి. సి. జట్టు వలననే ఇచ్చట నిర్మాణాత్మక మైన క్రికెట్ ఆట అభివృద్ధికి వచ్చెను. జిల్లి గన్ సూచనపై భారత దేశములో “క్రికెట్ కంట్రోలు బోర్డు" 1927 లో ఏర్పడెను.

1932 జూన్ 25వ తేదీ భారతదేశము యొక్క క్రికెట్ చరిత్రలో మహత్తరమయిన పర్వదినముగా పరిగణింప బడుచున్నది. ఆ దినమున ప్రప్రథమముగ భారతజట్టు ' టెస్ట్ పందెము'లో ఇంగ్లండును ఎదుర్కొనెను. మన జట్టుకు శ్రీ సి.కె. నాయడు నాయకత్వము వహించెను. ఇంగ్లండు జట్టును జార్డిన్ నడిపిం చెను. ఈ పందెములో మన జట్టు ఓటమి చెందినను, ఇట్టి పందెములలో పాల్గొనుటకు మన ఆటగాండ్రు అన్ని విధముల అర్హులని ఇంగ్లీషువారిచే ప్రశంసలనందుకొనిరి. ఈ టెస్ట్పం దెములో నిస్సార్, అమరసింగ్ లు జరిపిన 'బౌలింగ్' (Bowling), సి. కె. నాయడు ప్రదర్శించిన 'డాటింగ్' (Batting) ప్రతిభా విలసితములని పేరు కాంచెను.

ఆనాటినుండి భారతదేశము అంతర్జాతీయ క్రికెట్ రంగములో ఘనవిజయములు సాధింప నారంభించెను. మొట్టమొదటిసారిగా 1950-51 లో జరిగిన టెస్టం దె