Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క్రికెట్

సంగ్రహ ఆంధ్ర

ప్రాచీనమైన ఒకఆట ఇప్పటికిని వాడుకయందున్నది. గ్రీసుదేశములో లభ్యమయిన పురాతత్త్వ శిథిలముల ఆధారమున, ప్రాచీనకాలమందు హాకీ - క్రికెట్ మిశ్రితమగు ఒక విచిత్రమైన ఆట ఆడబడుచుండెడిదని తెలియు చున్నది. ఆనాడు ప్రపంచము ఇంత అభివృద్ధికిరాక, ప్రాథమికదశయందే యుండెను. కర్రకు (Bat) బంతికి (Ball) సంబంధించిన ఇట్టి ఆటలను గ్రీసుదేశమునుండి అలెగ్జాండర్ తనవెంట భారతదేశమునకు కొని వచ్చి నటుల మన మూహింపవచ్చును. ఇందుల కాధారములు గూడ కొన్నిగలవు.

బ్రిటిష్‌వారు భారతభూమి మీద అడుగిడిన వెంటనే, క్రికెట్‌కూడ వారితో ఇచట ప్రవేశమొనర్చిరి. బ్రిటిష్ యువసైనికులు తాము ప్రవేశించిన ప్రతి దేశమునకు తమ క్రీడా పరికరములను తమవెంట తీసుకొని వెళ్ళుట వారికి పరిపాటియయ్యెను. ఏ దెట్లయినను క్రికెట్ ఆట మొట్టమొదటిసారిగా భారత దేశమున 1751 వ సం॥ననే ప్రారంభమయినది. గ్రేట్‌బ్రిటన్ వెలుపలనున్న దేశము లన్నిటిలో కలకత్తాలో స్థాపింపబడిన క్రికెట్‌క్లబ్ అత్యంత ప్రాచీనమైనదని తెలియుచున్నది. ఈ క్లబ్బు 1792 లో నెలకొల్పబడినది. కలకత్తాక్రికెట్ క్లబ్బు, బారక్ పూర్ క్లబ్బుల మధ్య నొక ఆటయు, కలకత్తాక్రికెట్ క్లబ్, డండం క్లబ్బుల మధ్య మరియొక ఆటయు జరిగినది. కలకత్తా క్రికెట్ క్లబ్బును టి. సి. లాంగ్ ఫీల్డ్ అను నాతడు అభివృద్ధిపరచెను. ఈస్ట్ ఇండియా కంపెనీయందు పనిచేసిన ఉద్యోగులే ఈ క్లబ్బులయందును పాల్గొనెడివారు.

అయినను క్రికెట్ ఆటకు బొంబాయి నగరము పుట్టి నిల్లని విశిష్టమయిన ప్రఖ్యాతికలదు. ఇందుకు కారణములు రెండు : ఈ ఆట బొంబాయినగరములో అత్యంతమైన ప్రజాదరణ గడించుట; మరి ఏ ఇతర నగరము నందునులేని ఉద్దండులయిన క్రికెట్ ఆటగాండ్రు ఈ నగరమందే వన్నె కెక్కియుండుట. క్రికెట్ ఆటను చేపట్టి, దానిని అభివృద్ధిపరచి ప్రథమస్థాన మాక్రమించుటలో ఇతర జాతులవారికంటె పార్శీజాతివారు అత్యంత గౌరవస్థాన మలంకరించియున్నారు. వారు 'ఓరియంటల్ క్రికెట్ క్లబ్బు'ను 1848 లో మొట్టమొదటిసారిగా స్థాపించిరి. ఆ దినములలో క్రికెట్ 'ను 'బాట్‌బాల్' (Bat ball) ఆట యని సామాన్యులు పిలిచెడివారు. అటుపిమ్మట 1850లో 'జొరాష్ట్రియన్ క్రికెట్ క్లబ్బు' ఏర్పడెను.

1867 సం॥ ప్రాంతములో 'రౌండ్ ఆరమ్ బౌలింగ్' (Round arm bowling) అను సాంకేతిక విధానము క్రికెట్ ఆటలో అమలునందుండెను. ఇంగ్లండులోని 'సర్రే' (Surrey) నగరము నుండి రాబర్ట్ హెండర్సన్ అను నతడు బొంబాయికివచ్చి, పార్శీ క్రికెట్ ఆటగాండ్రకు శిక్షణ నిచ్చెను. క్రికెట్ అటగాండ్రు ఇప్పటికిని అతని నామమును స్మరించుచు, అతనియెడల కృతజ్ఞతాభిమానములు వెలిబుచ్చుచుందురు. ఈ సంఘటనమువలననే ప్రథమముగా పార్శీ ఆటగాండ్ర జట్టు 1886లో ఇంగ్లండునకు ప్రయాణమై వెళ్ళుట సంభవించెను. ఇంగ్లండులో వీరు కొన్ని క్రికెట్ పందెములలో గెల్చుటయు, కొన్నిటియందోడుటయు, మరికొన్నిటియందు ప్రత్యర్థులతో సమ ఉజ్జీలగుటయు సంభవించినది. విక్టోరియా రాణి ఆహ్వానముపై 'కంబర్ లాండ్ లాడ్జి' వద్ద 'క్రిస్టియన్ విక్టర్స్' అను పదునొకండు మందిగల ఆటజట్టుతో పందెమాడు భాగ్యము వీరి కబ్బినది. రెండేండ్ల అనంతరము, ఈ పార్శీ జట్టువారు రెండవసారి ఇంగ్లండునందు సంచారముచేసి కొన్ని పందెములలో ఘనమైన విజయములు సాధించిరి. ఈ క్రికెట్ ఆటలయాత్రలను ఏర్పాటు చేయుటయందును, వీటిని నిర్వహించుటయందును ఎ. బి. పటేల్, బారియా, ప్రేమ్‌జి పటేల్ ప్రభృతులు ప్రధానమయిన పాత్రము వహించిరి.

హిందూయువకులుగూడ ఈ యాటయందు అభిరుచిని, అభినివేశమును సంపాదించి 1878 వ సం॥లో హిందూ క్రికెట్ క్లబ్బును స్థాపించుకొనిరి. అట్లే మహమ్మదీయులుగూడ తమ క్లబ్బును 1883 సం॥లో ఏర్పరచుకొనిరి. తరువాత కొలది సంవత్సరములలో వేర్వేరు 'జింఖానాలు' (క్రీడాసంస్థలు) వెలసినవి. 20వ శతాబ్ది ప్రారంభమున క్రికెట్ ఆట చెన్నరాష్ట్రములో గణనీయమైన ప్రజాదరము పొందెను. ఐరోపియనులు, పార్శీలు, హిందువులు అను త్రివర్గములమధ్య(Triangular Tournaments) జరిగిన ఆట పందెములవలనను, అటుపిమ్మట వీరిని మహమ్మదీయుల జట్టు కలియగా అప్పుడు చతుర్వర్గములమధ్య జరిగిన ఆటల (Quadrangular Tourna-

130