Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

క్యూరీసతి సంగ్రహ ఆంధ్ర

సాగించెను. పరిశుద్ధమైన రేడియం క్లోరైడ్ ద్వారా రేడియము పరమాణు భారమును తిరిగి కనుగొని, దానిని 226.2 గాది దెను. 1910 లో ఆమె తన సహకారియగు దబీయర్న్ తో కలిసి రేడియం ధాతువును, రేడియం క్లోరైడ్ విద్యుత్ విశ్లేషణమునుండి వేరుచేసి, ధాతువు గుణములు కనుగొ నెను. ఆ సంవత్సరముననే ఆమె సల హా పై ఒక గ్రాము రేడియమునుండి వచ్చు రేడియో ఏక్టివిటీకి ఒక 'క్యూరి' అను సాంకేతనామము పియరీ క్యూరీ గౌరవార్థమై ఉంచబడినది. 1911 లో రసాయన శాస్త్రములో ఈమె జరిపిన పరిశోధనలకు ప్రత్యేకముగా మరియొక సారి ఈమెకు నోబెల్ బహుమానము ఈయ బడెను. ఈమెకుతప్ప రెండుసార్లు నోబెల్ బహుమానము ఎవ్వరికిని లభించలేదు. సొర్బోను విశ్వవిద్యాలయము వారు, ప్రత్యేకముగా రేడియో ఏక్టివిటీపై పరిశోధన ములు జరుపుటకు ఒక క్రొత్త భవనములో రేడియం ఇన్ స్టిట్యూటును స్థాపించి, మేరీ క్యూరీని దీనికి డై రెక్ట రుగా నియమించిరి. ఈమె ఇచట పరిశోధనలు జరుపుటే గాక ఎంతోమంది గావించు పరిశోధనములపై పర్యవేక్ష ణము కూడ చేయుచుండెను.

మొదటి ప్రపంచయుద్ధమున ఈమె పరిశోధన కార్య ములకు అంతరాయము కలిగెను. కాని ఈమె ఉత్సాహ శక్తిమాత్రము తగ్గలేదు. యుద్ధములో గాయపడిన సైనికుల ఉపయోగార్థమై ఈమె ఎక్సరే సర్వీసు నొక దానిని స్థాపించి, కారులో అవసరమున్న చోటునకు వెళ్ళి సహాయపడుచుం డెను. ఎందరో నర్సులకు' ఎక్సు రేలతో ఫొటోలు తీయుటయందును, 'రేడియం థిరపీ' యందును శిక్షణ నొసగి, ఈమె యుద్ధరంగములో అనేక కేంద్ర ములు స్థాపించెను. మేరీక్యూరీ 1921 లో అమెరికా మహిళా సమాజముల కోరికపై ఆదేశము సందర్శించి, అనేక చోట్ల ఉపన్యసించెను. అమెరికా మహిళల విరాళ మును వెచ్చించి ఒక 'గ్రాం' రేడియముకొని, అమెరికా అధ్యక్షుడు దానిని ఈమెకు బహూకరించెను. దానిని

ఈమె రేడియం ఇన్స్టిట్యూటుకు ఇచ్చివేసెను. 1928 లో తిరిగి ఇంకొక 'గ్రాం' లభించెను. పోలెండు దేశములో తన సలహాపై కట్టబడిన రేడియం ఇన్స్టిట్యూటుకు దాని నీమె బహూకరించెను.

మేరీక్యూరీయొక్క ఆరోగ్యము చాల కాలమునుంచి బాగుగా లేకుండెను. దీనికి ముఖ్యకారణము రేడియం కిరణములే అని చెప్పవలెను. చివరకు రక్తహీనతకులో వై 1934 సం॥ జూలై 6 వ తేదీన యీ మె ఒక శానిటోరి యంలో తన జీవితమును చాలించెను.

మదాం మేరీక్యూరి నిరాడంబరజీవి; ఆమె మితభాషిణి. ఎల్లప్పుడును ఆమె సాధారణమయిన దుస్తులనే ధరించు చుండెను. కీర్తినిగాని, ధనమునుగాని, ఈమె ఎన్నడును కాంక్షించలేదు. పిచ్ బ్లెండునుండి రేడియమును వేరుచేయు విధానమును పేటెంట్ (patent) చేసినచో, లక్షలార్జింప గలిగి యుండెడిది. కాని యీమె కావలసిన వారికి ఆ విధా నమును ఉచితముగా పూర్తి వివరములతో తెలియజేసెను. తాను మొదట విడదీసిన రేడియమును తనకు బహూక రింపబడిన ధాతువును (అప్పటి 'గ్రాము' ధర సుమారు నాలుగు లక్షల రూపాయలు) పరిశోధనాలయములకు ఇచ్చివై చెను. 'కీర్తి ఈ మెను చెడగొట్టలేదు' అని 'అయిన్ స్టెయిన్' ఈమెను గురించి పలికిన ప్రశంసా వాక్యము సర్వవిధముల ఈమెయందు అన్వర్థమగుచున్నది.

క్యూరీ దంపతులకు ఇద్దరు కుమార్తెలు - మొదటి కుమార్తెయగు ఇరేన్ అనునామె తలిదండ్రులతో సరి తూగగల కీర్తిని సంపాదించెను. ఈమె తన భ ర్తయగు 'ఫ్రెడెరిక్ జోలియో' (Frederick Joliot) తో కలిసి పరిశోధించి కృత్రిమ రేడియో ఏక్టివిటీని కనుగొ వెను. మదాం క్యూరీ ఊహించినటులనే వీరికికూడా నోబెల్ బహుమాన మొసగబడెను. రెండవ కుమార్తె ఈవ్ అను నామె. ఈమె తనతల్లియొక్క జీవిత చరిత్రను వ్రాసెను. అది అందరును చదువతగ్గది.

జ. జో.

a. f. 128