Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము = 8 127 క్యూరీసతి

పరిశోధనశాలలో సౌకర్యము లేదయ్యెను. అందుచే పియరీ పనిచేయు స్కూలులో నున్న ఒక పాత షెడ్డును పరిశోధనశాలక్రింద మార్చి, పిచ్ బ్లెండు రసాయన విశ్లేషణ మును ఉభయులు ప్రారంభించిరి. పిచ్ బ్లెండులోని వివిధ ధాతువులను అవక్షిప్తముగావించి (Precipitated) ఆ అవక్షేపములను రేడియో ఏక్టివిటీ కొరకు పరీక్షింపగా, బేరియం సల్ఫేటులోను, బిస్మత్ సల్ఫేటులోను ఈ గుణము కనిపించెను. అనగా పిచ్ బ్లెండులో రెండు రేడియో ఏక్టివ్ ద్రవ్యములు గలవు. మొదటిది బిస్మత్ ను పోలియుండును. దీనికి 'పొలోనియం' (మదాం క్యూరీ స్వదేశమగు పో లెండు చిహ్నముగా) అని పేరు పెట్టిరి. రెండవది బేరియమును పోలియుఁడును. దీని రేడియో ఏక్టివిటీ చాలా హెచ్చుగా నుండుటవలన, దీనిని రేడియం అనిరి. రేడియం, బేరియం, సల్ఫైటుల మిశ్రమమును, క్లోరైడ్లక్రింద మార్చి అంశ స్ఫటికీకరణ (Fractional Crystallisation) విధాన ముతో, రేడియం క్లోరైడును వేరు చేసిరి. ఒక టన్ను పిచ్ బ్లెండును విశ్లేషించినచో ఒక గ్రాము రేడియం క్లోరైడు కూడ రాదు. దీనినిబట్టి ఈపని కష్టతరమైనదనియు, దీనికి మిక్కిలి ఓర్పు అవసరమనియు గ్రహింపవచ్చును. మదాం క్యూరీ తన పరిశోధనశాల యందలి పనితోబాటు ఇంటి పనులను,కూతురి సంరక్షణమును నిర్వహింపవలసి వచ్చెను. ఈ విధముగా ఈ మె నాలు గేండ్లు నిరంతర కృషి చేసి చివరకు విజయమును సాధించెను.

పరిశుద్ధమైన రేడియం క్లోరైడు, రేడియో ఏక్టివిటీ యురేనియంకన్న మూడు వేల రెట్లు అధికముగా నుండెను. రేడియం క్లోరైడునుంచి రేడియం పరమాణుభారము 225 గా నిర్ణయించిరి. వర్ణమాలలో క్రొత్త మూల ద్రవ్యము సూచించు రేఖలు (lines) కనిపించెను. వీటిని బట్టి రేడియం నిస్సందేహముగా బేరియమును పోలు నొక క్రొత్త మూలద్రవ్యమనియు, దాని పరిమాణ సంఖ్య 88 అనియు స్పష్టమ య్యెను.

ఈ సమయములో ఈ దంపతులు రేడియో ఏక్టివిటీ యొక్క ఇతర ధర్మములపై కూడా పరిశోధనలు జరుపు చునే ఉండిరి. ముఖ్యముగా, ఈ కిరణముల ప్రభావము వలన శరీరములోని జీవకణములు ధ్వంసమగునని తెలిసి కొనగలిగిరి. రోగియొక్క కణములను రేడియం కిరణములచే నాశనము చేసినచో వాటిస్థానే ఆరోగ్యవంత మైన కణములు తిరిగి పుట్టగలవు. ఈవిధముగా కాన్సర్ మొద లగు గడ్డురోగములు రేడియం సహాయముతో ఉపశమింప వచ్చునని నిరూపించిరి. ఈ విధానమును నేడు రేడియం థెరపీ (Radium Therapy) అందురు.

ఇన్ని ముఖ్యమైన పరిశోధనలు జరిపియున్నను, వీరు ఇంకను పరిశోధనశాల వసతికొరకు ఇబ్బంది పడుచునే ఉండిరి. ఒక మంచి పరిశోధనశాలతోబాటు పరిశోధనలు జరుపుకొనుటకు తీరికనిచ్చు తగిన ఉద్యోగము ప్రియరీకు సొర్బోన్ విశ్వవిద్యాలయములో లభింపలేదు. అతనికి ఉపాధ్యాయ వృత్తివలన వచ్చు జీతము సరిపోకుండుటచే క్యూరీకూడా పాఠములు చెప్పుట ప్రారంభిం చెను.

కాని ఇతర దేశములలోని శాస్త్రజ్ఞులు వీరి పరిశోధ నల ప్రాముఖ్యమును వెంటనే గుర్తించిరి. 1903 లో బ్రిటిష్ రాయల్ సొసైటివారు వీరిని లండన్కు ఆహ్వా నించి వీరికి 'డేవి' పతకమును బహూకరించి గౌర వించిరి. అదే సంవత్సరములో రేడియో ఏక్టివిటీ కనిపెట్టి నందులకు బెకేరెల్ కును, రేడియం కనిపెట్టి నందులకు క్యూరీ దంపతులకును నోబెల్ బహుమానము చెరిసగ ముగా పంచి ఇయ్యబడినది. యావత్ప్రపంచము వీరి గొప్పతనమును గుర్తించిన తరువాత పియరీ క్యూరీకి సొర్బోన్ విశ్వవిద్యాలయములో ప్రొఫెసర్ పదవి ఇయ్య బడెను. విశ్వవిద్యాలయాధికారులు పరిశోధనాలయము కొరకు రెండు గదులు నిర్మించి, మేరీక్యూరీని పరిశోధనా లయమునందు ముఖ్య సహకారిణినిగా నియమించిరి. ఈ విధముగా వీరు రెండు సంవత్సరములు మాత్రమే కలిసి పనిచేయగలిగిరి.

1904 సంవత్సరం ఏప్రిల్ 19 తేదీన పియరీ క్యూరీ పారీస్ లో నొక వీధి దాటుచు బండి క్రింద పడి అకస్మా త్తుగా మరణించెను. ఇది మేరీ క్యూరీ జీవితములో గొప్ప విషాద సంఘటనగా పరిణమించెను. కాని ఆమె తన ఇద్దరు కూతుళ్ళను పెంచుట, తన భర్తయు తానును కలిసి మొదలు పెట్టిన పరిశోధనలు పూర్తిచేయుట, తన ముఖ్య కర్తవ్యములుగా భావించి పారిస్ లోనే ఉండిపోయెను.

పిదప పియరీ యొక్క పొఫెసర్ పదవి మేరీకి లభిం చెను. ఆమె మరల రేడియో ఏక్టివిటీపై పరిశోధనలు