Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

క్యూరీసతి

సంగ్రహ ఆంధ్ర

ఉక్కు పదార్థముల యాంత్రిక ధర్మములపై పరిశోధనలు జరుపుటకు పరిశోధన సౌకర్యము కావలసి వచ్చెను. ఈ సందర్భములో పియరీక్యూరీని కలిసికొని, అతని పరిశోధనశాలలో మేరీ పని ప్రారంభించెను. పియర్ క్యూరీకి అప్పుడు 35 సంవత్సరముల వయస్సు. అతడు గొప్ప భౌతికశాస్త్రజ్ఞుడు; మేధావి. పీజో అనునతడు ఎలక్ట్రిసిటీ (Piezo Electricity) స్ఫటికముల ధర్మములపై జరిపిన పరిశోధనములవలన అతనికి అప్పుడే విదేశ శాస్త్రజ్ఞులలో మంచి పేరు లభించెను. అయినను పారిసులోని ఒక శాస్త్ర పాఠశాలలో అతడొక సాధారణ భౌతిక శాస్త్రోపాధ్యాయుడుగా నుండెను. విజ్ఞానశాస్త్రపరిశోధనమే ముఖ్యలక్షణముగా గలది మేరీ. పియర్ మేరీలు పరస్పరము ఆకర్షితు లయిరి. మేరీ 1895లో పియరీ క్యూరీని వివాహమాడి ఫ్రాన్సులోనే ఉండిపోవుటకు నిశ్చయించుకొనెను.

చిత్రము - 28

క్యూరీసతి

ఉక్కు పై పరిశోధనములు పూర్తి చేసినతరువాత కూడా మేరీ, తన డాక్టరేటు బిరుదముకొరకు విషయమును (Subject) వెదకుచుండెను. ఆ సమయమున బెక రెల్ అనునతడు యురేనియం లవణములలో ఒక విచిత్రమైన గుణమును కనిపెట్టెను. అది యురేనియం లవణములనుండి ఎల్లప్పుడును కంటికి కనిపించక వెలువడు కిరణజాలము. ఈ కిరణముల ఉనికిని ఫొటోగ్రాఫిక్ ప్లేటుపై పడు వాటి ప్రభావమువలన తెలిసికొనకలిగెను. నల్లని కాగితముతో చుట్టబడిన ఫొటోగ్రాఫిక్ ప్లేటుపై కొంచెము సేపు యురేనియం లవణమును ఉంచి, అటు పిమ్మట ఆ ప్లేటును డెవలప్ (Develop) చేయగా లవణముంచినచోట నల్లనిమచ్చ కనిపించెను. ఈ కిరణములను గురించి తెలిసికొన్న ఇతర గుణములును కలవు. జింక్‌ సల్ఫైడ్, బేరియం సల్ఫైడ్ వంటి పదార్థములపై ఈ కిరణములు పడి, వాటిని కాంతిమంతములుగా (Luminous) చేయును. ఈ కిరణములు గాలిలోని అణువులను అయాన్లుగా మార్చి గాలిని విద్యుద్వాహకముగా (Conductor of Electricity) మార్చును. గాలిలో నెలకొల్పబడిన ఈ విద్యుప్రవాహమును ఎలక్ట్రొస్కోపుతోకాని ఎలక్ట్రొమీటరుతోగాని కొలవవచ్చును.

మేరీ తన డాక్టరేటుకొరకు, యురేనియం లవణముల నుంచి వచ్చు ఈ కిరణముల అయనీకరణ (Ionisation) శక్తిని కొలుచుటకు ప్రారంభించెను. ఆమె ఈ కిరణ ప్రసార శక్తికి రేడియో ఏక్టివిటీ అను పేరు పెట్టెను. ఈ శక్తి కేవలము యురేనియం ధాతువునకు సంబంధించిన దని ఏదైనను యురేనియం లవణము యొక్క రేడియో ఏక్టివిటీ దానిలో నున్న యురేనియంపై ఆధారపడి యుండుననియు ఆమె నిరూపించెను. యురేనియములో కనిపించిన ఈ గుణము వేరుద్రవ్యములలో కనిపించు నేమో అని పరిశోధించి, థోరియం ధాతువుకూడా రేడియో ఏక్టివిటీని ప్రదర్శించు నని ఆమె తెలిసికొనగలిగెను. యురేనియంగల వివిధ ఖనిజముల యొక్క రేడియో పక్టివిటీని పరిశీలించగా కొన్నిటిలో యురేనియం నుండి వచ్చు కిరణ ప్రసారముకన్న హెచ్చు ప్రసారమును ఆమె గుర్తించెను. పిచ్ బ్లెండ్ (pitch blende) అను ఖనిజములో ఈ గుణము చాలా ఎక్కువగా ఉండుటచే, ఈ ఖనిజములో యురేనియంగాక ఏక్టివిటీ ప్రదర్శించు మరియొక క్రొత్త మూలద్రవ్య ముండవచ్చునని నిశ్చయమునకు వచ్చి, మేరీక్యూరీ తన ఫలితములను ప్రచురించెను.

పిచ్ బ్లెండు నుంచి ఈ ద్రవ్యమును వేరుచేయుటకు మేరీ నిశ్చయించెను. ఈమె ఉత్సాహమును చూచి, అంతవరకు స్ఫటికములపై జరుపుచున్న తన పరిశోధనలను పియరీక్యూరీ ఆపి, తన భార్యచేయు పరిశోధన కార్యము నందు ఆమెకు తోడ్పడుటకు సిద్ధపడెను. యురేనియం తీసివేయగా మిగిలిన ఒక టన్ను పిచ్ బ్లెండు, ఆస్ట్రియా ప్రభుత్వముద్వారా వీరికి ఉచితముగా లభించెను. కాని

126