Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
      1. కోడి రామమూర్తి నాయుడు
  • కోడి రామమూర్తి నాయుడు* నిపుణులయిన యువతీ యువకులు ఇతని సర్కసులో పాల్గొని వాసికెక్కిరి. ఇతని సర్కసును ఒక సంచార వ్యాయామ విద్యాసంస్థ యని వర్ణించుట సమంజసముగా నుండును.
  • ప్రాణాయామ విధానం మరియు హనుమదుపాసనాపద్ధతి*: పునహాపట్టణములో రామమూర్తి పెక్కు ప్రదర్శన ములు కావించెను. కీ. శే. లోకమాన్య బాలగంగాధర తిలకు రామమూర్తి ప్రదర్శనములచే ఆకర్షింపబడి ప్రోత్సాహకరముగా బహిరంగసభయందు ఇతనికి “మల్లమార్తాండ" అను బిరుదమొసగెను.
  • అవధూతస్వామి సీతారాంబాబా*: ఒక రోజున తటాకమున కావలి యొడ్డున ఒక పాక యందు నివసించుచున్న 200 సంవత్సరముల వయస్సు గల సీతారాంబాబా అను అవధూతస్వామి దృష్టిపథమందీ రామమూర్తి పడెను. అదృష్టవశమున ఆ స్వామి రామమూర్తి నిదగ్గరకు రావించి, ప్రాణాయామ విధానమును హనుమదుపాసనాపద్ధతిని నేర్పెను. నేర్పి “నీవు దీనిని నేను చెప్పిన చొప్పున చక్కగా అభ్యసించిన యెడల త్వరలో సిద్ధికలిగి జగద్విఖ్యాతి గాంచెదవు" అని ఆశీర్వదించెను.
  • 1903లో ప్రారంభం*: ఉత్సాహపూరితుడును, పట్టుదల కలవాడును అగు రామమూర్తి త్వరలోనే తన వ్యాయామాధ్యాపక పదవికి స్వస్తిచెప్పి తుని రాజాగారి ధనసహాయముతో 1903వ సంవత్సరములో చిన్న సర్కసు ప్రదర్శనమును ఆరంభించెను. ఊరూర ప్రదర్శనములు కావించుచు శరీరసౌష్ఠవము, ఆరోగ్యము, బలము చేకూరుటకై వ్యాయామము చేయుట ప్రధానకర్తవ్యమని యువతీ యువకులకు ఇతడు ఉద్బోధింపసాగెను.
  • సర్కసు ప్రదర్శనలు*: రామమూర్తి యే సరసులో అన్ని విధములైన కసరతులు చేసెడివాడు. ఇతడే మన దేశములో మొదటి సర్కసు ప్రదర్శనమును ఆరంభించినవాడు. క్రమముగా దేశమంతటను సంచారము కావించుచు ఇతడు ప్రసిద్ధినొందెను. పలురకములగు కసరతులలో ప్రవీణులగు వారు ఇతని సంస్థచే ఆకర్షింపబడిరి. ఖండఖండాంతరములలో సగి బహూకరించెను. వంగదేశములో ఇతనికి “మల్లరాజ" అను బిరుదము లభించెను. ఆంధ్రులైతనిని "ఆంధ్ర వీరకంఠీరవ”, “కలియుగ భీమ" అను బిరుదములతో గౌరవించిరి. హైదరాబాదులోని శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్రభాషానిలయాధికారులు రామమూర్తికి "జగదేకవీర" అను బిరుదము 1923వ సంవత్సరంలో సన్మానించిరి.
  • మల్లయుద్ధంలో ప్రావీణ్యం*: మల్లయుద్ధములో రామమూర్తికి తుల్యుడెవ్వడును లేక, ఎంత పేరొందిన జెట్టినయినను 1-2 నిమిషములలో రామమూర్తి చిత్తుచేసెడివాడు. ఇతడు కుస్తీ పట్టురీతి చాల విచిత్రముగనుండెడిది. ప్రేక్షకులకుగాని, జయింపబడిన వానికిగాని ఇతడు పట్టు పట్టురీతిగాని, ఓడించు విధముగాని గోచరింపకుండెడిది. ఇతడు పారిస్ నగరమందున్నపుడు పాశ్చాత్య మల్లులు పలువురు ఇతనితో చేతులు కలిపి ఓడిపోయిరి. తదాదిగా ఇతడు వ్యాయామ కళయందు అప్రతిమాన వీరుడుగా ప్రసిద్ధిగాంచెను.
  • బిరుదములు*: భారతదేశమున పేరొందిన జట్టీలలో గామా, కల్లూ రామమూర్తి నిపుణులయిన యువతీ యువకులు ఇతని సర్కసులో పాల్గొని వాసికెక్కిరి. ఇతని సర్కసును ఒక సంచార వ్యాయామ విద్యాసంస్థ యని వర్ణించుట సమంజసముగా నుండును.