పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కోటప్పకోండ సంగ్రహ ఆంధ్ర


నలుగురు తమ్ములతో నివసించుచు ప్రతినిత్యము కొండకు బోయి కట్టెలు తెచ్చి అమ్ముకొనుచు, తనకు లభించిన ధనముతో నిత్యము జంగమారాధనచేయుచు భక్తి మార్గ మున జీవించుచుండెడివాడు. ఒకనాడు ఆతనికి ఒక ధనపు బిందె దొరికెను. దానితో విరివిగా దానధర్మములు చేయుచు, పుణ్యక థాశ్రవణములతో కాలము గడుపు చుండెను. ఒక నాడు రుద్రశిఖరమునకు బోయి శివుని పూజించుచుండగా ఆతని కొక జంగమమూర్తి ప్రత్యక్షు మయ్యెను. సాలంకయ్య ఆతనిని తన యింటికి రావలసిన దని ఆహ్వానించెను. దాని కాత డంగీకరించి సాలంకయ్య యింటికి వెడలి, క్షీరమును మాత్రము స్వీకరించువాడు. అపుడాజంగమదేవరను సాలంకయ్య భక్తితో పూజించు చుండువాడు. ఒక నాడు జంగమయ్య హఠాత్తుగా ఇంటినుండి అదృశ్యుడై పోయెను. సాలంకయ్య అతని · కొరకు వెతకివెతకి వేసారి చివరకు దిగులుతో నిద్రాహార ములు మాని కాలము వెళ్ళబుచ్చుచుండెను.

గొల్లభామకథ : కొండకు దక్షిణ భాగమునగల ‘కొండ కావూరు' గ్రామమునందు 'సునందుడను' గొల్లవానికి 'కుందరి' యను భార్యయందు 'ఆనందవల్లి' అను కూతురు జన్మించినది. ఆ బాలిక బాల్యమునుండియు శివభక్తు రాలై, ఎల్ల వేళలయందు ఆ పరమశివుని ధ్యానించుచు విభూతి, రుద్రాక్షమాలికలను ధరించుచు, రుద్ర శిఖ రమునకుబోయి త్రికోటీశ్వరుని ధ్యానించుచు పై రాగ్య శీలయై యుండగా, తల్లిదండ్రులు మిక్కిలి చింతించి తమ కుమారితను వైరాగ్య మార్గమునుండి మరల్చు టకు వేయి విధములుగా ప్రయత్నించిరి. కాని ఆ పరమ సాధ్వి వారి మాటల నాలకించక యథాప్రకారము తన పూజాదికములను నిర్వర్తించుచు యోగినియై సంచ రించు చుండెను. ఆమె ఒక శివరాత్రినాడు ఓగేటియందు స్నానమాడి రుద్రశిఖరమున కేగి నిమీలిత నేత్రయై తపో నిష్ఠతో స్వామిని పూజించెను. అప్పుడు ఆమెకు స్వామి జంగమ రూపమున ప్రత్యక్షమాయెను. ఆమె మిక్కిలి సంతోషించి ప్రతి నిత్యము పాపనాశన తీర్థముతో అభి షేకము చేయుచు, శ్రీరములను నైవేద్యమిడుచుండెను. ఈ సంగతి తెలిసిన సాలంకయ్య ఆమె యొద్దకుబో తన సంగతిని ఆ జంగమయ్యకు తెలుపవలసినదిగా ఆమెను

వేడెను. ఆమె దాని కంగీకరించినది. కాని జంగమయ్య మౌనముద్రతో నుండుటచే ఈ సంగతి చెప్పుటకు ఆమెకు వీలు కలుగలేదు. మాయచే ప్రతినిత్యము శ్రద్ధగా గొల్లభామ సేవలు చేయు చుండగా జంగమయ్య ఆమెతో "నీవిచ్చటికి ప్రతినిత్యము వచ్చి నన్ను పూజించుటవలన పొందు లాభమేమియులే” దని తెలి పెను. అయినను, ఆమె ఆమాటలను సరకు గొనక పూర్వముకంటే అధికముగా స్వామిని సేవింప సాగెను. స్వామి ఆమె శ్రమను మాన్పుటకై తన యోగ బ్రహ్మచారిణి యగు నా కన్యకకు మాయా గర్భమును కల్పించెను. అయినను ఆమె లెక్క చేయక స్వామిని పూర్వము వలెనే సేవించుచుండెను. క్రమ ముగా ఆమెకు నవమాసములునిండి, కొండ యెక్కుట కష్టముకాగా స్వామి కరుణించి ఆమెతో “నీవు ఇంత దూరము శ్రమపడి రానేల? నేనే నీయింటికి వచ్చెదను గనుక నీవు వెనుదిరిగి చూడకుండ కొండ దిగిపోవలసినది. ఎచ్చట నీవు వెనుదిరిగి చూచెదవో నేనచ్చటనే ఆగి పోయెదను సుమా" అని తెలిపెను. అందుకు ఆమె అంగీకరించి క్రిందికి దిగసాగినది. స్వామి ఆమె వెనుక ప్రళ యధ్వనులు చేయుచు వచ్చుచుండెను. కొంత దూరము నడచిన తరువాత చిత్తచాపల్యముచేత ఆ మె వెనుదిరిగి చూచేను. స్వామి అచ్చటనే నిలిచిపోయెను. అంతలో గొల్ల భామ ప్రసవించెను. మగపిల్లవాడు పుట్టెను. తవవెంట స్వామి రాకుండుటయు, తనకు పిల్లవాడు కలుగుటయు చూచిన గొల్ల భామ మిక్కిలి విచారముతో కనులు మూసికొని కొద్దిసేపటి తరువాత కనులు తెరిచి చూడగా పిల్లవాడు లేకుండుటయు, తాను వెనుకటి వలె కన్యాత్వమును వహించియుండుటయు కనుగొని ఆమె అచట సమాధిబూని శివైక్యమందినది. సాలంకయ్య దేవాలయములను ప్రతిష్ఠించుట : గొల్ల భామ రాక కై ప్రతినిత్యమువలె క్రింద వేచియుండిన సాలంకయ్య ఆమె యెంత సేపటికిని తిరిగి రాకుండుట వలన ఆమెను వెదకుచు కొండపైకి పోయెను, అచ్చట, తనకు పూర్వము గనుపించిన యతీంద్రుడు కనుపించగా నమస్కరించెను. ఆ యతీంద్రుడు సాలంకయ్యతో “తాను శివుడ ననియు, నీ యింటినుండి అదృశ్యుడనై వచ్చిన 98 98