పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము = 3 కోటప్పకొండ


తరువాత రుద్రశిఖరమున నివసించుచు, గొల్ల భామకు మోక్షమిచ్చితి ననియు, ప్రస్తుతము తానున్నచోట నే నివసింప నెంచితిననియు అచ్చట తనకొక దేవాలయము గట్టింపవలసినదనియు, అట్లే గొల్లభామ సిద్ధిపొందినచోట గూడ ఒక దేవాలయము గట్టింపవలసినదనియు, శివరాత్రి నాడుభ క్తులందరును ఉపవాస, జాగరణాదులు చేసి ముందు తన భ క్తురాలైన గొల్లభామను పూజించి ఆ తరువాత తనను పూజింపవలసినదనియు తెలిపి అదృశ్యుడాయెను. సాలంకయ్య స్వామి ఆజ్ఞ ననుసరించి గొల్ల భామ కును, స్వామికిని దేవాలయములు కట్టించి మోక్షమును పొందెను. ఇదియే నూతన కోటీశ్వర దేవాలయము. ఇది తూర్పు ముఖముగా నుండును. ఇది బ్రహ్మచారి యగు దక్షిణామూర్తి క్షేత్రము. ఇచ్చట స్వామికి కల్యాణోత్సవములు జరుగవు. ధ్వజ స్తంభము లేదు. కొండపైనున్న దేవాలయములు :
పాతకోటప్పగుడి : రుద్రశిఖరము పైన నీ పాతకోటప్ప గుడి యున్నది. అందులో ఒక లింగము, దాని కెదురుగా ఒక శిథిలావస్థలోనున్న స్తంభమును ఉన్నవి. దీని నిర్మాణ కాలము తెలియదు.
కొత్త కోటప్పగుడి ! ఇది బ్రహ్మశిఖరముపై నున్నది. దీనినే నూతన కోటీశ్వరస్వామి దేవాలయమని పిలుతురు. ఈ దేవాలయమునే సాలంకయ్య నిర్మించినట్లు అతని కథ వలన మనకు తెలియుచున్నది. ఈతనికాలము మనకు తెలియదు కాని యిచ్చటనున్న శాసనములనుబట్టి యిది దాదాపు తొమ్మిదివందల సంవత్సరములక్రిందగూడ వర్ధిల్లి యున్నట్లు ఆధారములు లభించుచున్నని. దక్షిణ ఇండియా నున్న శాసనములలోను, వెలనాటి గొంకరాజు మొదలైన వారి దీపదాన శాసనముల (మెకంజి మాన్యూస్క్రిప్టు) వాల్యుం XVIII పుట 256 వలనను మనకు తెలియు చున్నది. అంతేగాక ఈ దేవాలయమును పల్లవరాజుల తరువాతవచ్చిన చాళుక్యరాజులు నిర్మించినట్లు గుంటూరు జిల్లా భూగోళము తెలుపుచున్నది. ఈ భూగోళము 1929 సంవత్సరమున ప్రకటితమయినది.
శాసనములు పాపవినాశనస్వామి దేవాలయము: ఈ దేవాలయము విష్ణుశిఖరము పైన నున్నది. దేవాలయమునకు దగ్గరలో ఒక నీటిదొన యున్నది. యాత్రికు లా దొనయందు స్నాన మాడుదురు. ఇచ్చట కా ర్తీక మాఘమాసములలో స్నాన మాడిన గొప్ప పుణ్యము వచ్చునని భక్తులు తలంతురు. గణనాథుని దేవాలయము: ఇది నూతన కోటీశ్వర దేవాలయమునకు దక్షిణమున నున్నది. సాలంకేశ్వర దేవాలయము ఇది నూతన కోటీశ్వర దేవాలయమునకు పశ్చిమభాగమున నున్నది.
సంతాన కోటీశ్వర దేవాలయము: ఇది నూతనకోటీశ్వర దేవాలయమునకు ఉత్తరభాగమున నున్నది. నార్థు లీ లింగమును పూజింతురు. వారు కొండ నెక్కుచు; “చేదుకో కోటయ్య చేదుకోవయ్యా- ఈ యేటి కిద్దరం నీసేవ కొచ్చాము - ముందునాటికి మేము ముగ్గురము కావాలి...” అని భక్త్యావేశములతో పాడుచుందురు. బొచ్చుకోటీశ్వరస్వామి దేవాలయము : ఈదేవాలయము మధ్యసోపానమార్గమునకు ప్రక్కన నున్నది. మ్రొక్కు బడులున్న భక్తులు ఈ స్వామి సన్నిధిని తిరుపతికొండలో వలె తల నీలాలు సమర్పించేదరు.
గొల్లభామగుడి : నూతన కోటీశ్వరస్వామి దేవాలయ మునకు పోవు మార్గమున దక్షిణదిళ యందు ఈ గుడి గలదు. కోటప్పకొండ క్షేత్రమునకు బోవు భక్తులంద రును, ముందు గొల్ల భామను పూజించి, తరువాత కోటీ శ్వరుని పూజించెదరు.
కొండ దిగువలోనున్న దేవాలయములు : కొండపై మాత్రమే గాక కొండక్రింద గూడ ఇటీవల కొందరు భ క్తులు కొన్ని దేవాలయములను గట్టించినారు.
ప్రసన్న కోటీశ్వర దేవాలయము: ఈ దేవాలయమును గుడిపల్ల అయ్యంభొట్లుగా రను భక్తుడు కట్టించి ప్రసన్న కోటీశ్వరస్వామిని, భువనేశ్వరీ అమ్మవారిని 1924 సంవత్స రము ఫిబ్రవరి 29 వ తేదీన ప్రతిష్ఠించెను.
నీలకంఠేశ్వరస్వామి దేవాలయము ; ఈ దేవాలయ మును ప్రసన్న కోటీశ్వరస్వామి ఆలయమునకు సమీప మున బెజవాడ వాస్తవ్యులు, అప్పన రామమ్మగారు, వారి కుమారుడు సూర్యనారాయణమూర్తి గార్లు 1929వ సంవత్సరము మార్చి 7వ తేదీన నిర్మించి నీలకం ఠేశ్వర స్వామిని ప్రతిష్ఠ చేయించిరి.
99