పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఏజ్ఞానకోశము = 3 కోటప్పకొండ


సోపానమార్గము (2) మధ్యేమార్గము. దీనినే నూరు సంవత్సరముల క్రింద నరసరావుపేట రాజావారగు శ్రీరాజా మల్రాజునరసింహరాజుగారు కట్టించిరి. యాత్రికు లందరును ప్రస్తుతము స్వామి సన్నిధికి ఈ మార్గముననే పోవుచుందురు. (8) రాధాకృష్ణ సోపానమార్గము. స్థల పురాణము : ఈ పవిత్ర స్థలము యుగాంతరముల నుండి గొప్పమహిమగలదై యున్నట్లు పెద్దలుఅ నేక కథలు చెప్పుదురు. ఈ కోటప్పకొండపైన రుద్రశిఖరము, విష్ణుశిఖ రము, బ్రహ్మశిఖరము అను మూడు బోళ్ళున్నవి. వానికి సంబంధించిన స్థలపురాణము లీ క్రింది విధముగానున్నవి. రుద్రశిఖరము పూర్వము సతీదేవి తన తండ్రి చేయు యజ్ఞమునకు అనాహూయయైపోయి తన తండ్రిచే అవ మానింపబడి యజ్ఞ గుండమున దూకి ప్రాణములను విడి చినది. తరువాత శివుడు దివ్యదృష్టిచే సంగతినంతయు గ్రహించి కోపముతో తనజడ పెరికి శిలపై గొట్టగా వీరభద్రుడు అందు జన్మించి, తండ్రి యాజ్ఞ ప్రకారము ప్రళయరౌద్ర రూపము దాల్చి యాగస్థలమునకు బోయి దానిని ద్వంసముచేసి దముని శిరమును త్రుంచెను. అంతట దముని భార్య పతిభిక్ష వేడగా వీరభద్రుడు కరుణించి దక్షుని బ్రతికించి శివునియొద్దకు రాగా స్వామి శాంతించి, దక్షిణామూర్తి రూపమున కైలాస శిఖరమున సమాధి నిష్ఠుడై యుండగా, బ్రహ్మ, విష్ణువు, సమస్త దేవతలు ఋషులును పోయి తమకు బ్రహ్మోపదేశము చేయవలసిన దాని వేడిరి. స్వామివారు వారికోరికలను మన్నించి ఆ త్రికూటాచలమునకు వచ్చి రుద్రశిఖరముపయిన అనగా పాత కోటీశ్వరస్వామి దేవాలయమున్న స్థలమున బ్రహ్మాసనాసీనుడై యుండి, యోగనిష్ఠతో మౌనముద్ర చే వారందరికిని బ్రహ్మోపదేశము చేసెను. ఈ దక్షిణా మూర్తి యే గురుమూర్తియను పేరుతో ఇచ్చట వెలసి యున్నాడు. దక్షిణామూర్తి బ్రహ్మాదులకు బ్రహ్మోప దేశముచేసిన గురువుగదా! J

విష్ణుశిఖరము : ఇది రుద్రశిఖరమునకు ప్రక్కననున్నది. దీనిని పాపవినాశనస్థల శిఖరమనియు పిలుతురు. విష్ణుమూర్తి యీ శిఖరమున శివుని గూర్చి తపస్సు చేయగా, అతనికి పరమశివుడు ప్రత్యక్షమా యెను. ఇంద్రాదిదేవులు వచ్చి దక్షయజ్ఞమున తాము స్వీకరిం

చిన హవిర్భాగమువలన వచ్చిన పాపమును పోగొట్టి తమకెల్లప్పుడును లింగరూపమున దర్శన మీయవలసిన దని వేడగా, వారల కోరిక ప్రకారము, స్వామి తన త్రిశూలముతో ఒక రాతిని పొడిచెను. అందుకు వచ్చెను. స్వామి వారినందరిని అందు స్నానమాడ వలసి నదిగా తెలిపి తాను లింగరూపమును దాల్చెను. వారంద రును అందు స్నానమాడి తమ పాపములను పోగొట్టు కొనిరి. ఆనాటినుండి ఈ లింగము పాపవినాశన లింగ మనియు, ఈ క్షేత్రమునకు పాపవినాశన క్షేత్రమనియు వ్యవహారమునకు వచ్చినది. యాత్రికులు మొట్టమొదట ఇచ్చట స్నానమాడి తరువాత కోటీశ్వరుని దర్శింతురు. విష్ణుమూర్తి యీ శిఖరముపైన తపస్సు చేయుట చే ఈ శిఖరమునకు విష్ణుశిఖర మని పేరువచ్చినది. - బ్రహ్మశిఖరము : రుద్రశిఖరమునకు నైఋతి భాగ మున దిగువగా నీ బ్రహ్మశిఖరమున్నది. దీని పైననే నూతన కోటీశ్వరస్వామి దేవాలయమున్నది. ఈ లింగ మును సాలంకయ్య అనుభ క్తుడు ప్రతిష్ఠించినట్లు అతని చరిత్రవలన తెలియుచున్నది. రుద్ర, విష్ణుశిఖరముల పై జ్యోతిర్లింగము లుండినను ఈ శిఖరముపై లేనందున ఈ బ్రహ్మ శివునిగూర్చి తపస్సు చేయగా, అతడు ప్రత్యక్ష మగుటయు, బ్రహ్మకోరిక ననుసరించి లింగరూపమును దాల్చుటయు జరిగెను. బ్రహ్మ యిచ్చట తపస్సు చేయు టచే నీ శిఖరమునకు బ్రహ్మశిఖర మని పేరువచ్చెను. ఎల్లమందక్షేత్ర మని పిలుచుటకు గల కారణము ; ప్రదేశమున బ్రహ్మాది దేవఋషులు గుంపుగా గూడి యుండుటచే ఈ క్షేత్రమునకు 'ఎల్లమంద' క్షేత్రమనియు, మునిమంద అనియు, ఈ కొండకు నుత్తరభాగముననున్న గ్రామమునకు ‘ఎల్లమంద' అనియు పేర్లు వచ్చినవి. ఇట్లు రుద్ర, విష్ణు, బ్రహ్మ మొదలగు మూడు శిఖర ములపైనను దేవపూజితములగు జ్యోతిర్మయలింగము లుండి అవి నరులకు అగోచరము అగుటచే మనుజులు శిలాలింగముల నేర్పరచి పూజించుచున్నారు, నూతన కోటీశ్వరస్వామి ప్రతిష్ఠకు సంబంధించిన కథలు : సాలంకయ్య కథ : కోరె సాలంకయ్య యను లింగ బలిజ భ క్తుడు పూర్వము ఎల్లమంద గ్రామమునందు తన 13 97