కోటప్పకొండ
సంగ్రహ ఆంధ్ర
రాజ్యముల తోడను సఖ్యమును పాటించుచు సంప్రదాయ సిద్ధమైన కోటవారి బిరుదావళిని ధరించి రాజ్యములో అంతఃకలహములు, సాంఘిక వైషమ్యములు లేకుండ శాంతి భద్రతలు నెలకొల్పి 'సర్వేజనాః సుఖినోభవంతు' అను సూత్రమును ఆధారము చేసికొని క్రీ. శ. 1264 వరకు గణపాంబ పరిపాలన చేసెను.
దక్షతకలిగిన రాణిగానే కాక, దైవభక్తి కలిగిన ఉత్తమ ధర్మ పరాయణగా గూడ గణపాంబ ఖ్యాతి గడించెను. దీనికి అన్ని మతములవారిని సమాన దృష్టితో చూచుచు ఈమె స్వయముగా చేసిన దానధర్మములు, ఈమెకు పుణ్యముగా ఈమె ఆశ్రితవర్గములోనివారు చేసిన దానధర్మములు చక్కని తార్కాణములు. క్రీ. శ. 1256 లో ఉత్తరాయణ సంక్రాంతి పుణ్యకాలమున గణపాంబ, తనతండ్రి గణపతిదేవునకు పుణ్యముగా నేటి మాదల గ్రామములోని దేవాలయ పరిచారకుల వద్దనుండి ప్రభుత్వమునకు రావలసిన ఆయ సుంకమును రద్దుచేసినట్లు ఒక శాసనములో చెప్పబడియున్నది. క్రీ. శ. 1261 సం. లో ఈ మాదల గ్రామములోని సకలేశ్వర మహాదేవునిగుడిలో అఖండదీపమునకు ఏబదిఅయిదు గొఱ్ఱెలను గణపాంబకు ధర్మముగా ఈమె ఆశ్రితవర్గములోని వాడైన మన్మబోయడు దానముచేసినట్లు మరియొక శాసనములో చెప్పబడినది. ఈ సంవత్సరములోనే తన భర్త బేతరాజు ఎనమదలలో కట్టించిన గోపీనాథ దేవాలయమునకు ఒక నూనెగానుగను ఈమె దానముచేసెను. ఈ సందర్భములోనే ఈమె ఎనమదలలో పెండ్లి సుంకమువలన వచ్చు ఆదాయమును విద్యావంతులకు దానముచేయగా వారు ఆ ధనమును గణపమదేవికి పుణ్యముగా గోపినాథ దేవాలయమునకు దానమిచ్చిరి. నానా దేశములకు చెందిన అనేక వర్తక సంఘముల సభ్యులుగూడ గణపమదేవికి పుణ్యముగా గోపీనాథ దేవాలయమునకు తాము వ్యాపారముచేయు వివిధ వస్తువుల విలువలో కొంతభాగమును దానము చేసిరి.
ఈ విధముగా దక్షతతో జయప్రదముగా రాజ్య పరిపాలన సాగించి, కోట గణపాంబ శాశ్వతమైన కీర్తిని ఆర్జించెను. ఈమె పరిపాలన అన్ని విధములచే ఈమెసోదరి, కాకతీయ చక్రవర్తిని రుద్రాంబ పరిపాలనను జ్ఞప్తికి తెచ్చుచున్నది. ఆంధ్రదేశమును పరిపాలించిన స్త్రీలలో కోట గణపాంబకు ఒక మాననీయమైన స్థానము కలదని నిస్సందేహముగా చెప్పవచ్చును.
ఆర్. న. రా.
కోటప్పకొండ :
ఆంధ్రదేశమున గల ప్రసిద్ధపురాతన శైవ క్షేత్రములలో కోటప్పకొండ ఒకటి. ఇది గుంటూరుజిల్లాలోని నరసరావుపేట తాలూకాలో, నరసరావుపేట పట్టణమునకు దక్షిణపు దిక్కున 7 మైళ్ళ దూరములో ఎల్లమంద, కొండకావూరు అను గ్రామములకు మధ్యనగల ఒక పర్వతముపై నున్న పుణ్యక్షేత్రము ఇది యీ జిల్లాకు నడిబొడ్డులో నున్నది. ఈ పర్వత మెటు చూచినను మూడు కూటములు (బోళ్ళు) గా కన్పడుటచే, దీనిని త్రికూట పర్వత మనియు, ఇందు వెలసిన స్వామిని త్రికూటేశ్వరు డనియు పిలుచుచున్నారు. ఈ స్వామినే ఎల్లమంద కోటిశ్వరు డనియు, కావూరి త్రికోటీశ్వరు డనియు భక్తులు పిలుచుచుందురు.
ఈ పర్వతము చుట్టుకొలత అడుగు తక్కువ ఆమడ. దీని వైశాల్యము రమారమి 15 లేక 16 యెకరములుండును. దీని ఎత్తుగూడ సుమారు 1600 అడుగులు. ప్రస్తుతము ప్రజలందరును పూజించుచుండు కొత్త కోటీశ్వరస్వామి దేవాలయము ఆరువందల అడుగుల ఎత్తున నున్నది. దీనికి అనతిదూరములో పాతకోటీశ్వర స్వామి దేవాలయమున్నది. ఈపర్వతము పైన పెద్దఅడవియున్నది. అనేక గుహ లున్నవి. వీనిలో పూర్వకాలము నుండియు అనేకమంది ఋషులును, జంగములును తపస్సు చేసికొని ముక్తిని బొందినట్లు ప్రతీతిగలదు. ఈ పర్వతము పైన ప్రకృతిసిద్ధమైన అనేక నీటిదొన లున్నవి. అవన్నియు నిర్మల జలపూరితములు .
మ్రొక్కుబడులు గల భక్తులు ఈ పర్వతము చుట్టును ప్రదక్షిణము చేసి, దక్షిణభాగ మందున్న 'ఓంకార' లేక ఓగేరు అను నదియందు స్నానమాడి, తీర్థ శ్రాద్ధములు చేసికొని కొండపైకి పోయి మ్రొక్కుబడులు చెల్లించి స్వామిని సేవించి తరింతురు.
కొండపైకి పోవుటకు మార్గములు : ఈస్వామి సన్నిధికి పోవుటకు మూడు మార్గములు కలవు. (1) ఎల్ల మంద
96