పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము = 3 కోట గణపాంబ


యుండెననియు ఆ విహారమునకు దిజ్నాగాచార్యుడు అధి పతిగా నుండెననియు తెలియుచున్నది. దిజ్నాగాచార్యుడు కోట గణపాంబ (1241-1264) : కోట గణపాంబ, క్రీ. శ. 13వ శతాబ్దిలో యావ దాంధ్ర దేశమును తన ఏకచ్ఛత్రాధిపత్యము క్రిందికి తీసి. కొనివచ్చి ఆతివైభవో పేతముగా పరిపాలించి కీర్తి గాంచిన కాకతీయ గణపతిదేవ చక్రవర్తి పుత్రిక. ఈమె అగ్రసోదరి కాకతి సామ్రాజ్యము నేలిన మహారాణి రుద్రమదేవి. గణపతిదేవ మహారాజునకు పుత్రసంతానము లేదు. తాను కష్టపడి నిర్మించిన సామ్రాజ్యమును తరు వాతి కాలములో పాలింప నర్హుడైన కుమారుడు కలు గని లోపము గణపతి దేవునకు చాల మనస్తాపము కలి గించినది. కాని ఇందువలన హతాశుడు కాకుండ ఈ మహారాజు తన పుత్రికలకు భావిపాలకులు కాగల యువకులకు ఇయ్యదగిన శిక్షణ నొసగి పుత్రులు లేని కొరతను తీర్చుకొ నెను. వీరిలో రుద్రాంబ రుద్ర దేవుడను నామముతో పురుష వేషముతో తన తండ్రి జీవిత కాలము లోనే సామ్రాజ్య నిర్వహణమున అతనికి తోడ్పడుచు వచ్చెను. ఆమె చెల్లెలు గణపాంబకూడా గొప్ప సామర్థ్య కో కో. వే.శ. కూడిన వై వాహిక సంబంధముల మూలమున గూడ తన అధి కారమును స్థిరీకరించుకొనుచు వచ్చిన గణపతి దేవుడు మోటుపల్లి ప్రాంతములో సరియైన పర్యవేక్షణము లభించు నిమిత్తమై రాజనీతిని ప్రయోగించుచు తన రెండవ కుమా ర్తెయగు గణపాంబను ఎనమదల శాఖకు చెందిన కోట రుద్రరాజు కుమారుడగు బేత రాజునకు ఇచ్చి వివాహము చేసెను. తద్వారా ఈ ప్రాంతముమీద తన అధికారమును సుస్థిరము చేసికొ నెను. క్రీ. శ. 1241 సం.లో రుద్రరాజు మరణించిన తరు వాత బేతరాజు ఎనమదల సింహాసనమును అధిష్ఠించెను. అంతవరకు దైనందిన జీవనములో సహధర్మచారిణిగా ఉండుచువచ్చిన గణపాంబ అప్పటినుండి రాజ్య పరిపాల నలోకూడ సహభాగిని అయ్యెను. తనతండ్రి తన కిచ్చిన శిక్షణమును, రాజకీయ విజ్ఞానమును ఉపయోగించి ఎన మదల రాజ్యమునకు వన్నె తెచ్చెను. గణపాంబా బేత రాజుల సంయుక్తపరిపాలన పది సంవత్సరముల కాలము సాగెను. శ. 1251 సం లో బేతరాజు తన మామగా రైన గణపతిదేవ చక్రవర్తికి సహాయుడుగా కాంచీ రాజ్యముపై దండెత్తి, అక్కడ జరిగిన యుద్ధములో మరణించెను. వైధవ్యమువలన కలిగిన శోకముతో క్రుంగి పోవుచున్నప్పటికిని, సంతాన రహితయగుటచేత ప్రజా క్షేమముకోసము రాజ్య భారమంతయు గణపాంబయే వహించవలసి వచ్చెను. అప్పటినుండి ఈమె పరిపాలన సుమారు 13 సంవత్సరముల కాలము సాగెను. ఈ కాల ములోనే గణపతిదేవ చక్రవర్తి మరణించుట, అతని కుమా ర్తెయు, గణపాంబకు సహోదరియు అయిన రుద్రాంబ కాకతీయసామ్రాజ్యమునకు రాణి యగుటయు జరగెను. మొదట గణపతిదేవుని తోడను, తరువాత రుద్రాంబ తోడను, ఈ కాలములోనే ధరణికోటకు పరి పాలకులైన కోట గణపతిభీమరాజుల తోడను, ఇతర మును సంపాదించుకొనెను. ఈ కాలములో ఆంధ్ర దేశములోని కోస్తా ప్రాంత ములో అనేక మాండలిక రాజ్యములు ఉం డెడివి. ఇవ న్నియు కాకతీయ సామ్రాజ్యములో చేరి యున్నప్పటి కిని నేటి గుంటూరు మండలములోనున్న భాగమునకు ప్రత్యేక ప్రాముఖ్యము ఉండెడిది దీనికి కారణము అంతర్జాతీయ ఖ్యాతిగల మోటుపల్లి అను రేవు పట్టణము ఇక్కడ ఉండుటయే కావచ్చును. అందువలన గణపతి దేవుడు ఈ ప్రాంతములో తగినంత కట్టుదిట్టము చేయ వలసి వచ్చెను. ఈ ప్రాంతమంతయు అప్పుడు ధరణికోట, ఎనమదల, తాడికొండ నగరములు కేంద్రములుగా పరి పాలన చేయుచు వచ్చిన కోట వంశీయుల అధికారములో ఉం డెడిది. కేవలము యుద్ధముల వలన నేకాక రాజనీతితో ఆరవ శతాబ్దిలోనున్న ప్రసిద్ధ పండితుడు .