పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కొల్లేరుసరస్సు సంగ్రహ ఆంధ్ర

కుల నవలీలఁ దోలి (మ)రి “గోగులనాడు"ను, 'గొల్ని వీడు' నా వెలసిన దుర్గము లొనుచు వేగమె గౌతమి దాఁటి యిమ్ములన్. “మాడియు రెండుంగొని యూ డాడెడి పన్నెండు మన్నియములు నొడిచి తా నాడె కళింగయ సీమకుఁ గూడిన భువిఁగొనియె సోమకుల ముఖ్యుఁ డొగిన్. "లీలఁగొలని మండలీకుల వెసదోలి ‘కొలనివీడు' దాను గొనుటఁ జేసి కాకతీశుడైన గణపతి యండను కొలను సోముఁడనగ వెలసె జగతి" అను పద్యములు వాకొనుచున్నవి. ఇంతియగాక సోమయ్య సకల వేదశాస్త్ర సంపన్నుడనియు, బంధు సుజనహితు డనియు, అమిత యశోధనుడనియు ఏకశిలాపురీ ప్రాగ్భా గమున గల రిపుభూముల నెల్ల గొని 'కొలనువీడు’ మండ లీకుల నవలీల బారదోలి కొల్ని వీడునా వెలసిన దుర్గముల గొనుచు కళింగసీమకు చెందిన ప్రదేశములను కొన్నింటిని కై కొనుటచే కొలనిసోముడని ప్రసిద్ధి చెందెననియు అవ గత మగుచున్నది. కాబట్టి ఈతనినాటినుండి యిందులూరి వారన బరగుచుండిరి. ఈ సోమయ్య మనుమడే రుద్ర దేవుడు. రుద్ర దేవుని తండ్రియే మన్మగన్నయ. శివయోగ సార అవతరణిక యందలి “సులతాను దగ నోరుగలు చుట్టుముట్ట నె క్కువ లీలఁ దానె కల్కోటగాచె." అను పద్యపాదమునుబట్టి ఓరుగల్లును సులతానుడు ముట్ట డించినపుడు కొలని రుద్రదేవుడు - ఒక్కరుడే ఆ కలుకోట దుర్గమును కాపాడినందున _ "కాక తేశుఁడు మెచ్చఁ గలుగోట వెసఁగాచి యవనేశులను దున్మినట్టి యితఁడు" - అని “శివయోగసారము" న ప్రశంసింపబడెను. ప్రతాప రుద్రావనీశుని సచివో త్తములలో - ప్రచండ విక్రమాదిత్యు లలో—నొక్కరుడయి పేరెన్నికగన్న రుద్రదేవుడు ఓరు గంటి తూర్పుగవని మొదలు తూర్పున సింహాచల పర్యంత భూభాగమున కంతకును రాజప్రతినిధియై పరిపాలన మొన ర్చినవాడు. వీనినే కొలను ప్రతాపరుద్రుడని యందురు.

దండిమహాకవి తన “దశకుమార చరిత్రము” న వేంగి దేశమును పరిపాలించుచున్న చలుక్య నృపాలుండగు జయసింహుని “అంధ్రనాథేన జయసిం హేన" అని అభి వర్ణించుటయేగాక, ఆంధ్ర దేశము నభివర్ణించుచు జయసిం హుని రాజధాని యగు వేంగీనగరమును “ఆయాసిషం చ దినైః కైశ్చిదంధ్ర నగరం తస్యనా త్యాసన్న సలిల రాశి సదృశస్య కలహంసగణ దళిత నళినదళ సంహతి గళిత కింజల్క శకల శారస్యసారసశ్రేణి! శేఖరస్య సర స్తీర కాననేకృత నికేతనస్థితః" ఇట అని వర్ణించినాడు. ఇందొక సరస్సు గలదనియు, అది సారస నిలయమనియు, సలిలరాశి సదృశమనియు, ఆంధ్ర నగరమునకు దాపున నుండె ననియు, చెప్పుటవలన ఆ వర్ణన కొల్లేటి వర్ణన యగుటచే తత్సమీప మందలి వేంగియే యంధ్రనగరమై యున్నదని తెలియనగుచున్నది. పేర్కొనబడ్డ జయసింహుడు కుబ్జ విష్ణువర్ధనుని కుమా రుడు. ఈ జయసింహుడు క్రీ. శ. 633 మొదలు 663 వరకు అనగా ముప్పదేండ్లు వేంగిని రాజధానిగా చేసికొని వేంగీమండలమును పరిపాలించినవాడు. ఇతని పరిపాలనా భాగమును ఆంధ్ర దేశముగను, ఇతనిని ఆంధ్రవల్లభునిగను, · ఇతని రాజధానిని ఆంధ్రనగరముగను దండిమహాకవి క్రీ.శ. ఏడవ శతాబ్దియందే అభివర్ణించుట గమనింపదగియున్నది. ఈ జయసింహుడు నౌకాయుద్ధమున ఆరి తేరిన వాడు. కళింగ నృపుని నౌకాయుద్ధమున నోటమిబుచ్చి ఆ రేని కొమా ర్తెయైన 'కనక లేఖ’ను వివాహము చేసికొనినట్లు దండిమహాకవి వ్రాసినాడు. నౌకలు విహరించు ఈయన కాలమునందే హియానా త్సాంగ్ తెలుగు దేశమున పర్యటన మొనర్చుచు వేంగి నగరమును తత్స మీపస్థమగు కొల్లేటిని సందర్శించినట్లు కనుపించుచున్నది. ఈ సరస్సునకూడ జయసింహుని చుండెననియు, బౌద్ధమతము రూపరి హిందూమతము, హిందూసంస్కృతి విలసిల్లినవనియు, ఎక్కడ జూచినను హిందూ దేవాలయములే అగుపించుచున్నవనియు అతని వ్రాతలు దెలుపుచున్నవి. కొల్లేటి సర స్తీరమున తూర్పుగా గొప్ప బౌద్ధవిహార ముండె ననియు, ఆ విహారమునందు 5 అంతస్థుల మేడ 94