పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము = కొలంబియా


చేరువలో బొగ్గుగనులు త్రవ్వబడును. రాగి, గంధకము . మాంగనీసు, అభ్రకము, భాస్వరము, చలువరాయి, సీసము, తుత్తునాగము, పాదరసము లభించు గనులుకూడ కలవు. కొలంబియా జాతీయ ఆర్థిక ఉపపత్తికి ఖనిజ సమృ ద్ధియు, వ్యవసాయమును తోడ్పడుచున్నవి. వ్యవసాయ మునకు ఇచ్చటి భూమి, వాతావరణము అను కూలముగా నున్నవి. చెరకు, మొక్కజొన్న, వారి ఇచ్చటి ముఖ్యము లగు పంటలు. మొ త్తము మీద కాఫీగింజల ఉత్పత్తి విషయమున బ్రెజిల్ నకు ఈ దేశము రెండవదిగా గణింపబడు చున్నది. ఇందు చాల భాగము అమెరికా సంయుక్త

రాష్ట్రములకు అమ్మ బడును. శాంతమార్టాలో అరటిపండ్లు పండును.

ప్రత్తికూడ కొంతవరకు పండును.

చిత్రము - 18

కొలంబియా దేశ ముకో నూలు, రబ్బరు వస్తువులు టైర్లు, సిగ రెట్లు, గ్లాసుసామానులు తయారుచేయు పరిశ్ర మలు మిక్కిలి ప్రధాన ము లైనవి. నూలు పరిశ్రమ ముఖ్యముగా మెడెలిన్, బరంక్విలా, సామా, మనిజేల్స్ మొదలగు వానియందు స్థాపింపబడియున్నది. తివాచీలు, రగ్గులు, బ్లాంకెట్లు, చేతితో తయారుచేయుదురు. పంది క్రొవ్వును, పండ్లను, చేపలను డబ్బాలలో భద్రముచేసి ఎగుమతి చేయుటకును, కృత్రిమసిల్కును తయారుచేయుటకును నిర్మింపబడిన కర్మాగారములు కొన్ని గలవు.

ఉత్పత్తిచేసిన వస్తువులను రవాణాచేయుట అనునది కొలంబియాకు ఒక గొప్ప సమస్య, 800 మైళ్ళ దూరము వరకు నావ ప్రయాణమునకై మగ్దలేనానది విశేషముగా ఉపయోగించుచున్నది. ఫ్యూయర్టో విల్ చెస్ (Puerto- Wilches) కును ఈనదికిని ఒక రైలుమార్గముచే సంబంధ మేర్పడియున్నది. ప్యూర్ టో బెరియోనుండి కాకాలోయ (cauca Valley) వరకు మరికొన్ని రైలుమార్గ ములు ఏర్పడియున్నవి. కా కా(680 మై), సినిల్ (210. మై), ఆట్రాటో (416 మై) అను నదులు నాలు నడచు టకు యోగ్యములై యున్నవి. క్రీ. శ. 1,900 నుండినిర్మింపబడిన రహ కుకుట టుసా' బొగోటా పెరు 89 29 70° ద్ర ము BB యా దేర్.న. కాలామార్ వాపీస్ మే జూల 70° an! 5% బ్రాజిల్ O• కొలంబియా యొక్క క్క భౌతికస్థితి వ్యాపారో దేశములకు అనుకూల ముగానున్నది. అట్లాం టిక్, పసిఫిక్ రేవుల ఉప యోగమును పొందు చున్న దక్షిణ అమెరికా లోని ప్రదేశమిది యొక్కటే. పెట్రోలియము, బంగా రము, వెండి, రాగి, సీసము, పాదరసము, మాంగనీసు, కాఫీ, తోళ్ళు, అరటిపండ్లు, ఇచటి ప్రధానమైన ఎగు మతులు. యంత్రములు, యానసాధనములు, లోహసామగ్రి, రసాయనిక ద్రవ్యములు ప్రధానమగు దిగుమతులు. చరిత్ర : ఈ దేశము 1861 వరకు 'గ్రనడా' అని పిలువ బడు చుండెడిది. స్పానిష్ వలస యుగమందు ఇది ఇంచు దారుల మూలమున రవాణా విషయకమైన చిక్కు తొలగిపోయినది. విమాన మార్గములు చాల అభివృద్ధి కూడ పొందినవి. 12 89