పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కొలంబియా సంగ్రహ ఆంధ్ర


జాతిజీవిత నిర్మాణమందు అత్యంత ప్రాముఖ్యము వహించి యున్నవి. కొలంబియాకు పశ్చిమమునందును, వాయవ్య మునందును “ఆండీసు" మహా పర్వత పంక్త్యగ్రములు వ్యాపిం చియున్నవి. ఈక్వెడారు సరిహద్దు ప్రాంతమున ఆండీసు పర్వతములు ప్రాక్పశ్చిమ మధ్య పంక్తులుగా సమానాంతరముగా చీలియున్నవి. తూర్పు శ్రేణి ఈశాన్య దిశయందు దేశమునకు అడ్డముగా వ్యాపించియున్నది. దాని ప్రాక్సీమ పర్వతమయమగు కొలంబియా యొక్క వాయవ్య మండలములను, దాదాపు సగముకన్న హెచ్చు ప్రాంతము నాక్రమించుచున్న లోపలి మైదాన ప్రాంత మును విడదీయు నొక నిశిత రేఖవలె నేర్పడుచున్నది. ఇందలి విశాలమైన మైదానములందు అమెజాన్ ఉప నదులు పారుచున్నవి. మధ్యమ పర్వత శ్రేణియందు ఉన్నతమైన అగ్నిపర్వతముల వరుస యొకటి కలదు. ఆ అగ్నిపర్వతములలో కొన్ని అనవరతము మంచుతో కప్పబడియుండును. తూర్పుశ్రేణి అత్యధిక మైన జనాభా కల ప్రాంతము. సమశీతోష్ణ కటిబంధపు సరిహద్దులలో నున్న విశాలమైన పీఠభూమి మూలమునను, ఎత్తయిన కనుమల మూలమునను ఇది విలక్షణమై యున్నది. కరిబ్బియన్, పసిఫిక్ సముద్రములకు ఎదురుగా సుమారు 2000 మైళ్ల పొడవున వ్యాపించియున్న తీర రేఖ యొకటి కలదు. కాని అందు స్వాభావిక నౌకా కేంద్రములు చాలతక్కువ. కార్టగెనా; బర్రాక్విలా; శాంతమార్టా; రియోహచా అనునవి కరిబ్బియన్ రేవు పట్టణములు. పశ్చిమతీరము అనారోగ్యకరమైనది. ఆతీర భాగమువకును, జనాకీర్ణమయిన ప్రజాస్వామిక [రాజ్య] ప్రజాస్వామిక [రాజ్య] భాగమునకును మధ్య పర్వతశ్రేణుల ఆటంకము కలదు. అందుచే ఆ పశ్చిమతీర భాగము దేశాభివృద్ధికి ఉపయోగ పడుట లేదు. ఈదేశమందు తూర్పు భాగమునను, లోపలనుగల లోయలు వేడిమికలిగి మలేరియాకు ఆవాసము లై యుండును. పసిఫిక్ సముద్రతీరమునందలి అడవులలో సాలునకు 182 అం. వర్షము పడును. ఇది అమెరికా ఖండమునం దెల్ల గరిష్ఠమైన వర్షపాతము. కరిబ్బియన్ తీరమునందలి శీతోష్ణస్థితి నిలకడలేనిది. అచ్చటి అరణ్య భూములు నడుమనడుమ ఎండి కా కాలినట్టులు. కనిపించు

చుండును. సముద్ర మట్టముపై 8,000 అడుగుల ఎత్తు వరకు సాయం కాలమున చల్లగా నుండును. మొత్తము మీద శీతోష్ణస్థితి (climate) వేడిగానుండును. లోయల యందును పోపయను, కలి, మెడెలిన్, మొదలగు పట్టణ ములయందును శీతోష్ణస్థితి climate) సౌమ్యముగను, మందోష్ణముగను, ఆహ్లాదకరముగను ఉండును. ముఖ్య పట్టణమగు బగోటాలో సాలునకు కనిష్టోష్ణోగ్రత సుమారు పాతము 40 అంగుళములు. ఉన్నత 57. సాలుకు భూభాగములందు సామాన్యముగా మూడు నెలల కొక సారి శీతోష్ణఋతువులు మారుచు ఒకటి తరువాత మరొకటి వచ్చుచుండును. ఈసంఘటన నిత్యము నియమబద్దము వర్ష కాదు. ఈ దేశమునందలి వృక్షవర్గము సమృద్ధముగాను మిక్కిలి ముచ్చటగాను ఉండును. కారణమేమన, ఇందు ఉష్ణమండల వృక్షజాతి మొదలుకొని ఆల్పైను వృక్షజాతి వరకు గల అన్ని వృక్షజాతులును ఉండును. ఇచటి ఉష్ణ ప్రాంతపు పంటలలో అనంత భేదములు కాననగును. రబ్బరు, సింకోనా, మైకము, తాటిచెట్లు, రంగు కట్టెలు (Dye wood), దేవదారు వృక్షములు మొదలయిన వన్నియు లభించును. ఉష్ణమండల జంతువర్గ మచట ఎక్కువగా కనిపించును. ఉదా: నక్క, దుప్పి, చిరుత పులి, ఎలుగుబంటి, స్కంకు మున్నగునవి. ఖనిజ సమృద్ధి మూలమున కొలంబియాకు గొప్ప ఆదాయము లభించును. దీనికి ముఖ్యాధారము బంగా రము, తరువాత చెప్పదగినది పెట్రోలియము. మధ్యమ పర్వతపంక్తులతో ముఖ్యముగా ఆంటిక్వా, కాంకా మొదలగు ప్రాంతములందు బంగారు నిక్షేపములు (గనులు) కలవు. క్రీ. శ. 1930 తరువాత ఎగుదల మగ్దలీనా రాష్ట్రమునందు, నీవా ప్రాంతమున క్రొత్తగా బంగారపు గనులు కల మండలములు కనుగొనబడుటతో ఆ ఖనిజోత్పత్తి అధిక మైనది. కొలంబియా, ప్రపంచములో ప్లాటినము విశేషముగా లభ్యమగు దేశములలో నొకటి. దానిని ప్రధానముగా అమెరికా సంయుక్త రాష్ట్రములు స్వలాభమునకై ఉపయోగించుకొనుచున్నది. బొగ్గు, వెండి, ఉప్పు ఈ దేశమున ఇతర ప్రధాన ఖనిజోత్పత్తు లలో పేర్కొన దగినవి. కలి, బగోటా, మాడలిన్ లకు 88 88