కొలనుపాకా
సంగ్రహ ఆంధ్ర
మించుగా అప్రసిద్ధముగనే యుండెను. ఇది 14 సంవత్సరములు స్వాతంత్ర్య సమరము సలిపి 1824 లో స్పెయిన్ ఆధిపత్యమునుండి విముక్తి నొందెను. 1881 లో పెనామాతోకలిసి ఈదేశము ప్రజాస్వామిక రాజ్య (Republic) మై వెలసెను. కాని 1906 లో పెనామా, కొలంబియా నుండి విడిపోయెను.
1934-38 సంవత్సరములలో ఆల్ఫన్సోలో పెజ్ అను నాతడు ఉదారవాదులకు (Liberals) అధ్యక్షుడుగా నుండెను. ఆ సమయమందు కొన్ని కార్మిక సంస్కరణములు ప్రవేశ పెట్టబడుటయేగాక రోమన్ కాథలిక్ మతమునకు ఇదివరలోగల ప్రత్యేకమగు ప్రభుత్వ రక్షణము తొలగింపబడెను. ఈతడే మరల రెండు తడవలు అధ్యక్షుడుగా ఎన్నుకొనబడి 1945 వరకు అధికారమందుండెను. 1946 లో ప్రభుత్వము రూఢ మార్గవాదుల (conservatives) చేతులలోనికి వచ్చెను.
కొలంబియా రాజ్యాంగ చట్టము ననుసరించి ప్రతి నాలుగు సంవత్సరములకు ఒక అధ్యక్షుడు ఎన్నుకొనబడు చుండును. అతడే తన మంత్రివర్గము నేర్పాటు చేసికొనును. ఒకేవ్యక్తి వరుసగా రెండు పర్యాయములు అధ్యక్షుడుగా ఎన్నుకొనబడకూడదు. 63 మంది సభ్యులు గల సెనేటు అనబడు ఎగువసభ యొకటి నాలుగు సంవత్సరముల కొకసారి జరుగు ఎన్నికల ఫలితముగా ఏర్పడుచుండును. ఇదికాక 123 మంది సభ్యులుగల ప్రతినిధుల సభయొకటి రెండు సంవత్సరముల కొకతూరి ఎన్నికల ద్వారమున ఏర్పాటు కావింపబడును. 21 సంవత్సరములు దాటిన పురుషులందరు వోటింగు హక్కును కలిగి యుందురు. 21-30 సంవత్సరముల మధ్యనుండు పురుషు లెల్లరు సైనికవృత్తియం దుండవలెను.
1570 లో బోగోటాలో జాతీయ విద్యాలయమొకటి స్థాపింపబడెను. అదికాక, మరికొన్ని స్థానిక విశ్వవిద్యాలయములు కూడ కలవు.
ఆర్థికముగను, సాంఘికముగను శ్వేత జాతివారి ప్రాబల్యము నీగ్రోలమీదను, ఇండియనులమీదును కాన నగును. దేశమందు స్పానిష్‌భాషయే ప్రధానముగామాట్లాడబడును.
కె. వి. రె.
కొలనుపాక :
ఒకనాడు దక్షిణాపథములో రాజకీయముగను, మత విషయకముగను గొప్ప కేంద్రస్థానములుగానుండి స్వీయ పూర్వ ప్రాభవమును కోల్పోయిన పట్టణములలో ఈ కొలనుపాక అను గ్రామము ఒకటి.
కొలనుపాక అను గ్రామము శాసనములయందు, కొలిపాక, కుల్పాక, కొట్టియపాక, కొళ్ళియపాక, కొట్టిపాక, కొల్లిహకే మొదలగు నామములతో నొప్పినది. ఇది స్థలపురాణాదులయందు బింబావతీపురి, వ్యాఖ్యనగరము, సరోవర కుటీరము, సోమశేఖరపురము, కుదటిపురి, కుళుదపురము మొదలగు నామములతో వ్యవహరింపబడినది. ఇది శైవమత కేంద్రస్థానముగా నుండి “దక్షిణకాశి" యను గౌరవనామము పొందియుండెను.
కొలనుపాక సిద్దిపేట రోడ్డుపై భువనగిరికి 20 మైళ్ళ దూరములో నున్నది. ఇది నల్లగొండ జిల్లాలోనున్నది. ఈ గ్రామమునందు దాదాపు 50 శాసనములు దొరకినవి.
కల్యాణి రాజధానిగా పరిపాలించిన పశ్చిమచాళుక్య చక్రవర్తుల పాలనములో ఈ కొలనుపాక నూరు సంవత్సరములు ఉండినట్లు శాసనములవలన తెలియుచున్నది. క్రీ. శ. 1042 నుండి 1143 వరకు పశ్చిమచాళుక్యుల ప్రతినిధుల పరిపాలనలో నున్నది.
మొదటి జగదేకమల్లుడు క్రీ. శ. 1042 నాటికే ఉండెను. క్రీ. శ. 1067 లో ఈ కొలనుపాక గ్రామము త్రైలోక్యమల్ల బిరుదముగల ప్రథమ సోమేశ్వర చక్రవర్తి పాలనలో నుండినట్లు తెలుపు శాసనమొకటి కలదు. క్రీ. శ. 1076 నుండి 1126 వరకు ఆరవ విక్రమాదిత్యుడు పాలించినకాలము. ఇతడు పరిపాలించు కాలములో కందూరు తాండయ్య, వ్యాళమహారాజు, బిత్తరపాలుడు, త్రిభువనమల్లుడు, అనంతపాలయ్య అను వారలు కొలనుపాకలో రాజప్రతినిధులుగా వరలిరి.
శ్రీమన్మహామండలేశ్వర శ్రీ సోమేశ్వరదేవభూతి కొలిపాకలో రాజ్యము చేయుచుండినట్లు క్రీ. శ. 1110, 1126 సం. ల నాటి శాసనములు తెలుపుచున్నవి. గురిజాల శాసనమును బట్టి క్రీ. శ. 1143 నాటికి కూడ కొలనుపాక పశ్చిమచాళుక్య చక్రవర్తుల పరిపాలనములో నున్నట్లు తెలియుచున్నది.
90