పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

లై నను వర్ధిల్లనేర వనుట తథ్యము. ఉత్సాహ సంయమనము మనకిపుడు క ర్తవ్యమై యున్నది. ఒక్కొక్క మహాకార్యమునకు కొందరు అంకితమైనప్పుడే దేశమునందలి సదుద్యమములు ఫలాంత సంవృద్ధములు కాగలవు. కావున ఈ కావున ఈ యుద్యమ జలము లలో తేలియాడుటకు ఆరంభము నుండియు కలశములై, తెప్పలై, నావలై మహా నౌకలై మాకు తోడ్పడుచున్న విద్యా ధురీణులకు కృతజ్ఞతలు సమర్పించు చున్నాము. ఈ సారస్వత సముద్రము 'దరియంగ నీదుటకు' వారి ప్రాపు ప్రోపులే మాకు పెన్నిధి యని మనవిచేసికొనుచున్నాము. మూడు సంపుటములు వెలువరించితిమిగదా, నడువ వలసిన బాటలో సగము నడచి వచ్చితి మని ధీమాతో సింహావలోకనము చేసికొనగా, కొంత చకితులమైతిమి. మొదట వేసికొన్న ప్రణాళిక పూర్తిచేయుటకు మరియైదు సంపుటములైన పట్టునట్లు పర్యాలోచనపై తేలినది. నిండా మునిగిన వానికి చలియేమి? కార్యమును త్వరలో ముగించవలె నను ఆతురతతో విషయ క్లుప్తీకరణము చేయబూనుట భాషా సేవ కాజాలదు. అగాధ జలములు లభించువరకును ఈ విజ్ఞాన కూపమును త్రవ్వుచు తీరదు. సంధ శ్రామికులను చూచినప్పుడు మానవునకు కొంత యూరట కలుగుట సహజము. మైసూరు ప్రభుత్వము వారి పర్యవేక్షణక్రింద అకారాదిగ కన్నడ భాషలో విజ్ఞాన సర్వస్వము ప్రకటించుటకు గొప్ప యుద్యమము ప్రారంభింపబడినదని తెలిసి కొని సంతసించుచున్నాము. కన్నడ సోదరుల యీ సత్సంకల్పమును అభినందించుచు విజయలక్ష్మి వారిని వరించుగాక యని కోరుచున్నాము. తెలుగు భాషాసమితి వారు ద్విగుణీకృతశ్రమతో మరి మూడు సంపుటముల నేక కాలమున వెలువరించుట ప్రశంసా పాత్రముగా నున్నది. వీరి కార్యవేగ మిశ్లే నిరంతరాయముగా కొనసాగు గాక యని కోరుచున్నాము. ఎకరాలకు ఆర్థిక స్థితియందు ఈ విజ్ఞానకోశ సమితి, మధ్యతరగతి కుటుంబీకునివంటిది. ఇక ఆర్థిక పుష్టి అంత తృప్తికరముగా లేదని వేరుగ చెప్పనవసరము లేదు. ఆంధ్రప్రదేశ ప్రభుత్వము వారు సమితికి ఇయ్యనుద్దేశించిన ఒక లక్షరూపాయల గ్రాంటును సమితి సంపాదించుకొన్నది. కడపటి వాయిదా మొత్తమును షరతులతో సంబంధము లేకుండ ఉదారముగ ఇప్పించిన విద్యాశాఖామాత్యులు మాన్యశ్రీ పి. వి. జి. రాజు గారును, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారును, మా హార్దిక కృతజ్ఞతలకు పాత్రులు. స్రణాళికా ప్రారంభమునం దుండిన పరిస్థితులను బట్టి ఈ గ్రాంటుతో విజ్ఞానకోశ ప్రకరణము పూర్తిగ నెర వేరగల దని ఆశింపబడినది. కాని అన్ని విషయములందువ లె నే నిర్మాణవ్యయము పెరిగిపోవుటచేతను, ప్రణాళికా స్వరూపమునందు కూడ పెంపుదల అని వాళ్ళ మగుటచేతను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమువారి సహాయ కాలమును పొడిగించు