పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నివేదన
సంగ్రహాంధ్ర విజ్ఞానకోశవల్లి కుసుమించిన మూడవపుష్పమును ఆంధ్రసరస్వతి కెందమ్మి చరణముల నర్పించి భక్తివినమ్రుల మగుచున్నాము. "ఎటుల మెప్పించెదో మమ్ము నింక మీద" అని యడుగడుగునకు మేము భయానునయములతో ఆ తల్లిని వేడుకొనుచునే యుందుము. కార్యసిద్ధి ఉత్సాహమూలక మైనను దైవీసంపదలేక మహోద్యమములు తీగసాగ వని మా దృఢవిశ్వాసము. సాధుసజ్జనుల సౌహార్ధ మే దై వీసంపద యొక్క భౌతిక రూపము. దైవము హస్తకల్ప జనాంతరము గదా. విజ్ఞానకోశము రెండవ సంపుటమును 24 సెప్టెంబరు 1960 నాడు ఆవిష్కరించి మాకు ముదముగూర్చిన వారు మాన్యశ్రీ డాక్టరు కె. ఎల్. శ్రీ మాలిగారు (విద్యా శాఖమంత్రి, భారతప్రభుత్వము). కొంచెము వెలితిగా రెండు సంవత్సరములు పట్టినదీ మూడవ పూవు విరియుటకు. విజ్ఞానకోశ నిర్మాణమునందు కార్యకర్తల నెదుర్కొను కష్టనిష్ఠురములను, సమస్యలను, రెండవసంపుటము నివేదనలో మనవిచేసియున్నాము. కష్టమేఘముల వంక చూచుచు కూర్చున్నచో విజయయాత్రాకాలము కడు దవ్వనిపించును. అయితే మనము నెమళ్ళమేల కారాదు? అవి కార్మొగుళ్ళను గాంచియే పురి విప్పునుగదా! ఈ కష్టములలో ముఖ్యాతిముఖ్యమైనది, మాకు ఎక్కువ వేదన కలిగించినది- ఉద్దేశించిన కొన్ని ప్రముఖ వ్యాసములు రాక పోవుట, వాటిని మేము ప్రకటింపలేకపోవుట. దేశమునం దింతయో, అంతయో ఆర్థిక సహా యము లభించుచునే యున్నది. ప్రజలయందు చైతన్యమును, విజ్ఞానవిషయములయం దాసక్తియు స్ఫుటముగనే కన్పించుచున్నది. వారి యాసక్తి - ఆలవాలములను చల్లని విజ్ఞానజలములతో నింపుట విద్యాధికుల కర్తవ్యమైయున్నది. విద్యావంతుల నిరంతర సహకారము ధనసాధ్య మని కొందరు చెప్పజూతురు. కాని మేమది పూర్ణసత్యమని భావింపము. క్రొత్తగా స్వాతంత్ర్యమును పొందిన మన దేశమునందలి పదుద్యమములు సంఖ్యాతీతములై యున్నవి. అవి నవ చైతన్యము యొక్క శుభ చిహ్నములే. అయినను ఒకే పొలములో, ఒకేకాలమున వందలాది మంచి మొక్క vii