పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

టకు ప్రార్థింపవలసి వచ్చుచున్నది. అట్లే మా కిదివరలో అండదండలుగ ఉండిన ఉదారులైన దాతలు, ప్రభుత్వేతర సంస్థలును మాకు ధనవిషయమైన ఆందోళన కలుగకుండ తోడ్పడగలందులకు వేడుచున్నాము. కేంద్ర ప్రభుత్వము వారు 'భౌతిక శాస్త్ర పరిశోధన - సాంస్కృతిక వ్యవహారము'ల మంత్రాంగశాఖ ద్వారా ఇదివరలో రు. 10,000 లు విరాళము సమితికి ప్రసాదించియున్నారు. దీనికి మా కృతజ్ఞతలు తెల్పుచు భవిష్యత్కార్యక్రమమునకై భారత ప్రభుత్వమువారు తమ సహజ ఔదార్య ముతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వముతో 'సరిసమాన' గ్రాంటును మంజూరుచేయ గోరు. చున్నాము. సంస్కృతి సంబంధమైన కలాపముల పేరెత్తగనే ఏ కళాప్రియుని పేరు మున్ముందు జ్ఞాపక మునకువచ్చునో అట్టి సహృదయులు డాక్టరు బెజవాడ గోపాలరెడ్డి గారు విజ్ఞానకోశ సమితి అధ్యక్షులై నడిపించుచున్నారన్నచో కార్యవిజయమునకు వేరే పూటకా పేల? శ్రీవారికి ఎన్ని విషయములలోనో మేము ఋణపడియున్నాము. మా కార్యకర్తల దీక్షాదఢిమ ప్రశంసనీయమనుట పునరుక్తి యగును. అందును నవశతమాసజీవి, తెలంగాణా చారిత్రకాగ్రేసరులు ఆది రాజు వీరభద్రరావు పంతులుగారి ఓర్పు నేర్పులకు కై మోడ్పు లర్పింపక తీరదు. హైదరాబాదు నందలి మంచి ముద్రాపకులలో కనిష్ఠి కాధిష్ఠితులైన అజంతా ముద్రణాలయము వారు ఇదివరలో వలెనే తమ పనిని చక్కగా సాగించినందుకు అభినందనములు. ఆంధ్ర భారతీదేవి కబరీభరనిర్మాల్యమైన ఈ విజ్ఞానకోశ మూడవ సంపుటమును ఆంధ్రావళి అందుకొనుగాక !


ఖండవల్లి లక్ష్మీరంజనం
కార్యదర్శి
హైదరాబాదు
10 జూలై 1962