పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము = 3 కొలంబసు క్రిస్టాఫర్


టంగ్ స్టెన్ (తుంగస్థము) నల్ల సీసపురాయి (graphite) గనుల నుండి తీయబడుచున్నవి. అల్యూమినియం, నాన్ ఫెఱ్ఱస్ లోహములు, యుద్ధసామగ్రులుగూడ దక్షిణ ఉత్తర కొరియా ప్రాంతములలో అభివద్ధి చెందెను. జల విద్యుత్తునకు సంబంధించిన ప్రాజెక్టులుగూడ నూతన ముగా వెలసినవి. వీటిలో ఆసియా ఖండములో పేరెన్నిక గన్న ఒక ఆనకట్ట యొక్క నిర్మాణ ఫలితముగా ఆరు లక్షల కిలో వాట్ల విద్యుచ్ఛక్తి ఉత్పత్తి జేయబడుచున్నది. ఉత్తర కొరియాలో పారిశ్రామికాభివృద్ధి జరిగినను అచ్చటికంటె దక్షిణ కొరియా విభాగములో బ్యాంకింగ్ విధానము ఎక్కువగా అభివృద్ధి యయ్యెను. దక్షిణ కొరియాలో వర్తక వ్యాపారములు అధికముగా కేంద్రీ కృతములై నూరింట 80 వంతులు అర్థ సంబంధ మైన లావాదేవీలు జరుగుటయే ఇందులకు కారణము. రవాణా సౌకర్యములు : కొరియాలో రైల్వే రహ దారులు ప్రముఖములైన రవాణామార్గములయ్యెను. జపాను ప్రభుత్వమువారు తమ పాలనకాలములో ఆర్థిక సైనికావసరములకై రైలు మార్గములను విస్తృత మొనర్చిరి. ప్రధానమయిన రైల్వే మార్గము ఆగ్నేయ దిశాగ్రమున నున్న 'పూసాన్' అను నగరమును, మంచూ రియా సరిహద్దున నున్న 'నినయ్ జ్' అను నగరమును కలుపుచున్నది. సియోల్ నుండి మరియొక రైల్వేశాఖ ఈశాన్యదిశ యందున్న సముద్రపు రేవు వరకు నిర్మింప బడి యున్నది. మరియొక శాఖ అచ్చటినుండి యే బయలు' దేరి నైరృతి దిశకు చేరుచున్నది. రెండవ ప్రపంచ యు కాలములో రైల్వే నిర్మాణము అలక్ష్యము చేయ బడినను, అనంతర కాలమున దాని అభివృద్ధి కొనసాగు చునే యున్నది. రెండవ యుద్ధము ముగియునప్పటికి సగటున ॥ మైలునకు 0.17 మైలు నిడివిగల మామూలు రహదారీ రోడ్డు మాత్రమే నిర్మింపబడి యుండెను. 1952 వ సంవ త్సరము నాటికి 21,000 మైళ్ళ పొడవున రోడ్లు నిర్మింప బడి ముఖ్యమైన రైల్వే మార్గములతో కలుపబ డెను. కొరియా దేశము పర్వతమయమయి ఉండుట చేతను, తూర్పు పడమరలుగా రోడ్డు మార్గములు గాని, రైలు మార్గములుగాని లేకుండుట చేతను, రేవు ప్రాంతములో

జనసమ్మర్దముగల ప్రధాన నగరములు అభివృద్ధి చెందుట చేతను, అచ్చట ఓడ రవాణా మార్గములు ప్రాముఖ్యము నొందజొచ్చెను. 1955వ సంవత్సరము యొక్క అంత మున కొరియాలో వేయేసి టన్నుల శక్తిగల పొగ యోడలు 28 వరకుండెను. చేపలుపట్టు పడవలతో కలిసి మొత్తము 2,65,931 టన్నుల శక్తిగల 8096 ఓడలు అచ్చటనుం డెను. బి. ఎన్. చ. కొలంబసు క్రిస్టాఫర్ : పదునై దవ శతాబ్దమువరకు అమెరికాఖండ మొకటి యున్నదను విషయము యూరపుఖండ వాసులకు గాని తదితర దేశముల ప్రజలకుగాని తెలియదు. మొదటి సారిగా అమెరికాఖండమును కనుగొన్న వాడు క్రిస్టొఫర్ కొలంబసు. ఇతడు జినోవా నావికుడు. జినోవా ఉత్తగ ఇటలీలోని ఒక రేవుస్థలము. కొలంబసు 1447 లో జినోవాలో జన్మించెను. ఈతని తల్లిదండ్రులు నేత పని వారు. ఇతడు బాల్యములో ఇటలీలోని పావియా అను పట్టణములో క్షేత్ర గణితము, భూగోళ శాస్త్రము, ఖగోళ శాస్త్రము, జ్యోతిశ్శాస్త్రము, నౌకాయాన శాస్త్రము నభ్యసించి పదునాల్గవయేట జన్మస్థలమునకు తిరిగివచ్చెను. త్వరలోనే ఈతనికి మధ్యధరా సముద్రతీర ప్రాంతములకు పోవు ఒకానొక వాణిజ్య నౌకలో పని కుది నెను. ఈ కొలువులో నుండి అతడు నౌకాయాన విద్యను ప్రత్యక్షముగా నేర్చుకొనెను. బాల్యమునుండియు సముద్రతీరమున దిరుగాడుచు, వచ్చు పోవు నౌకలను జూచుచు, నావికులను గూర్చియు, వారి ప్రయాణములను గూర్చియు చెప్పుకొను సంగతులను వినుచు తానుకూడ నౌకాయానమును వృత్తిగా పెట్టు కొని, దూరతీరములకు పోయి ప్రపంచ రహస్యములను, శోధించి, క్రొత్త దేశములను, దీవులను కనుగొనవలెనని కొలంబసు కలలు గనుచుండెను. సరిగా ఈ కాలమునకు పూర్వమే భూమి చదునుగా గాక గుండ్రముగా నున్నదని నిరూపితమయ్యెను. ఈ హిందూ దేశమునందు చక్కని నూలు వస్త్రములు, పట్టు వస్త్రములు తయారగుచుం డెను. యూరపుఖండ దేశములలో ఈపాటి వస్త్రములను 85