కొరియాదేశము (భూగోళము)
సంగ్రహ ఆంధ్ర
విస్తృతము చేయుటకును, నీటిపారుదల వసతులను అభివృద్ధి చేయుటకును జపాను ప్రభుత్వమువారు, కొరియాలో పెద్ద మొత్తముల ధనమును వ్యయపరచిరి. రెండవ ప్రపంచ యుద్ధానంతరము ఏర్పడ్డ రసాయనపు టెరువుల కొరత వలనను, 1950 వ సంవత్సరము తరువాత జరిగిన యుద్ధ విధ్వంసమువలనను, దక్షిణ కొరియాలో వ్యవసాయము నష్టపడెను. కాని యుద్ధవిరామ సంధి జరగిన పిమ్మట వ్యవసాయము పుంజుకొనెను. సుమారు 48,00,000 ల యెకరముల విస్తీర్ణముగల భూమి కొరియాలో సాగుచేయబడుచున్నది. 28,50,000ల యెకరములలో మాగాణి పంటలును, 19,50,000ల యెకరములలో మెరక పంటలును పండింపబడుచున్నవి సగటున కుటుంబమునకు 21/2 యెకరములును, ఒక్కొక్క వ్యక్తికి అరయెకరమును పడునని లెక్కలవలన అంచనా వేయబడినది.
పర్వతములు, అరణ్యములు : కొరియాదేశము పర్వతమయమై యున్నది. పర్వతములనడుమ చిన్న చిన్న మైదానములు కలవు. పర్వతముల ఎత్తుకంటె వాటి విశేషసంఖ్యయే ఎక్కువ ఆశ్చర్యకరముగ నుండును. దేశముయొక్క మొత్తము విస్తీర్ణములో అయిదవవంతు ఆక్రమించియున్న మైదానముల యందును తీర ప్రదేశములయందును మూడుకోట్ల ప్రజలు కిక్కిరిసి నివసించుచున్నారు. కొరియా దేశమునకును మంచూరియా దేశమునకును నడుమనున్న రెండు నదులును, ఒక కొండ వరుసయు ఉభయ దేశములకును సరిహద్దుగా నున్నది. దేశమునకు ఈశాన్యదిశగా ప్రవహించు ట్యుమెన్ అను నది మీదుగా కొరియాప్రజలు శతాబ్దములక్రితము నుండియు వలసపోయిరి. ఈ నదియొక్క 'హెడ్ వాటర్స్' నడుమ 9,000 అడుగుల ఎత్తుగల 'పాయ్‌టన్' అనుపేరుతో ఒక అగ్నిపర్వతము కలదు. ఉత్తర సరిహద్దు ప్రాంతములో అధిక భాగము నిర్జనప్రదేశమై యున్నది.
కొరియా భూభాగములో, నూటికి 73 వంతులు అరణ్యప్రాంతమై యున్నది. 1953 వ సంవత్సరము నాటికి 1,57,25,000 ల యెకరములమేరకు ఈఅరణ్యము లాక్రమించి యుండెను. కాని 1943-50 సంవత్సరములనడుమ జరిగిన యుద్ధ విధ్వంసమువలనను, విచక్షణ లేకుండా అడవులను నరకివేయుటవలనను, సమర్థమైన పర్యవేక్షణము లేకుండుటవలనను, అటవీసంపద నూటికి సగము వరకు క్షీణించెను. అడవులలో వంటచెరకును, గృహనిర్మాణమునకు ఉపయోగపడు కలపసామగ్రియు లభ్యమగును. ఇవికాక దేవదారువు, స్ర్పూస్, లార్చ్ అను రమణీయమైన వృక్ష సంతతులును కాననగును.
కొరియాలో చేపలపరిశ్రమ విరివిగా నున్నది. 10 లక్షలకుపైగా ప్రజలు ఈపరిశ్రమపై ఆధారపడి జీవించుచున్నారు. కొరియనులు తమ ఆహార విషయమున జంతు మాంసముపైకంటె చేపలపైననే అధికముగా ఆధారపడి యున్నారు.
భౌగోళికముగను, జాతీయముగను కొరియనులు ఆసియాదేశ ప్రజలలో పెక్కురకంటె భిన్నులు. వారి ఆచార వ్యవహారములును, సంప్రదాయములును, వస్త్రధారణమును, భిన్నములుగనే ఉండును. వారిగృహములు మట్టి గోడలతో దృఢముగ నిర్మింపబడును. వంటశాలల నుండి బయలుదేరు పొగ, భూమి అడుగు భాగమున ఏర్పరచబడిన గొట్టముల ద్వారమున వ్యాపించి ఇల్లంతటికిని వేడిమిని కలుగ జేయును కొరియా ప్రజలు అన్నిటను వ్యక్తిత్వముగల విశిష్ట జాతీయులుగా పరిగణింపబడి యున్నారు.
పరిశ్రమలు: జపాను ప్రభుత్వమువారు తమ పరిపాలన కాలములో, కొరియాయందు పరిశ్రమలను అభివృద్ధి చెందనీయక అచ్చటినుండి ముడి సరకులను, తమ దేశమునకు దిగుమతి చేసికొనిరి. 1930 వరకు గృహోప కరణములు ఆహార పదార్థములు, గుడ్డలు మున్నగునవి మాత్రమే కొరియాలో ఉత్పత్తి అగుచుండెడివి. అనంతరము జపాను ప్రభుత్వమువారు కొరియా ప్రజల కోరికను అనుసరించి ఉత్తర భాగమున ముఖ్యముగా భారీపరిశ్రమలను నెలకొల్పి తమ స్వంత పారిశ్రామిక నిర్మాణమునకు దోహద మొనరించుకొనిరి. ఈభారీపరిశ్రమలలో రాసాయనిక పదార్థములు, సిమెంటు, ఇనుము, ఉక్కు, విద్యుచ్ఛక్తి యంత్రముల ఉత్పత్తి ఉత్తర కొరియాలో అభివృద్ధి చెందుచుండగా, గుడ్డల పరిశ్రమ, ఆహార పదార్థముల పరిశ్రమ మాత్రమే దక్షిణ కొరియాలో స్థాపింపబడెను. కొరియా దేశములో బంగారము, రాగి, వెండి,
84