పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము - 3 కొరియాదేశము (చరిత్ర)


భూయిష్ఠ మగుటచే, అది తనకాళ్లపై తానునిలబడ లేక దివాలా స్థితికి దిగజా రెను. ఇప్పటివరకును దక్షిణకొరియా అమెరికా పైననో, మరియొక ధనిక దేశము పైననో ఆధార పడుచునే యున్నది. దక్షిణకొరియా ప్రభుత్వము ప్రకటించిన 1952-53 సం. బడ్జెటు లెక్కలే ఇందుకు నిదర్శనము. పై కారణములచే దక్షిణ కొరియాలో ద్రవ్యోల్బణము (inflation) అధిక ముగనున్నది. - రూపురేఖలు : కొరియాలో లభ్యమైన పురాతత్త్వ శిథిలములనుబట్టి క్రీ పూ. 2000 సం. క్రిందట 'హాన్' అను మంగోలు జాతికి చెందిన మూకలు మధ్య ఆసియా నుండి కొరియాలో ప్రవేశించినట్లు తెలియు చున్నది. కొరియా ద్వీపకల్పమును నివాసముగా చేసికొనిన వేర్వేరు తెగలన్నిటిలో ఈ 'హాన్' జాతీయులే అత్యధిక సంఖ్యా కులు. కొరియాభాషకు మూల పురుషులును, సృష్టి కర్తలుగూడ వీరే. చైనీయులకును, జపానీయులకును వలె వీరికిని ఒకే లక్షణము కలిగిన పూర్వజాతీయ చరిత్ర కలదు. అయితే వారికంటే భిన్నమైన కొన్ని విలక్షణ ములు మాత్రము కొరియనులకు కలవు. కొరియనుల శిరోజములు నల్లగా - నిక్కపొడుచుకొని యుండును. వీరి బుగ్గలు ఉబ్బెత్తుగా నుండును. దవడ ఎముకలు ముందునకు పొడుచుకొని వచ్చినట్లుండును. ఎత్తులో వారు ఉత్తర చైనీయులకును, జపానీయులకును మధ్య స్థముగా నుందురు. కొరియన్ భాష యూరల్-ఆబ్జెయిక్ భాషాకుటుంబమునకు చెందినది. ఈ యూరల్ –ఆల్టో యిక్ భాషాకుటుంబములోనే మంగోలు, టర్కిక్, జపాను భాషలుగూడ లీనమై యున్నవి. కాని చైనా భాష అట్టిది కాదు. కొరియా ప్రజల వ్యావహారిక (వాడుక) భాషకును, దేశీయమైన శబ్దసముదాయమున కును, పైన పేర్కొనిన యూరల్- ఆక్టెయిక్ భాషా కుటుంబములోని ఇతర భాషలకును నడుమ ఎట్టి పోలి కయు లేదు. కొరియా భాష యొక్క యు, జపాను భాష యొక్కయు వ్యాకరణ నిర్మాణవిధానము ఒకే విధ ముగ నున్నది. ఐనను ఇతర విషయములలో మాత్రము ఆ రెండు భాషలును భిన్నమైనవి. విద్య : పాలనముక్రింద విద్యాభివృద్ధి ముందంజె వేసెను. పాఠశాలల యొక్కయు, విద్యార్ధుల


యొక్కయు సంఖ్య పెరిగెను. జపాను ప్రభుత్వము తన ప్రభుత్వ యంత్రాంగములో చిల్లర ఉద్యోగములకు అవసరమైన మేరకు మాత్రమే కొరియా యువకులకు విద్యావిధానమును నిర్ణయించెడివారు. 1939 సం. లో కొరియాలో ప్రాథమిక పాఠశాలలయందు 1,200,000 మంది బాలబాలికలు విద్య నభ్యసించెడివారు. ఉన్నత పాఠశాలలయందును, వృత్తిపాఠశాలలయందును, కళా శాలలయందును, సియోల్ నగరమందుగల ఇంపీరియల్ విశ్వవిద్యాలయమునందును కలిసి మొత్తముగా 84,000 మంది జపాను విద్యార్థులును, 62,000 మంది కొరియా విద్యార్థులును ఉండిరి. ప్రభుత్వ పాఠశాలలు కాక, క్రైస్తవ మిషనరీలచే నిర్వహింపబడు పాఠశాలలును, కళాశాలలును కలవు. ఈ విదేశీయ మిషనరీ విద్యాసంస్థల యొక్క పలుకుబడి కొరియాలో పెరుగకుండ జపాను ప్రభుత్వము కఠినమైన నిబంధనలు అమలు జరి పెను. 1945 వ సం. లో జపాను పరిపాలనము అంత మగుటతో, కొరియా విద్యావిధానము పూర్తిగా సంస్క రింపబడెను. ఈ సంస్కరణోద్యమములో కొరియా విద్యా వేత్తలు ఉత్సాహముతో పాల్గొని, బాధ్యతతో, తమ కార్యక్రమమును కొనసాగించిరి. ప్రజాస్వామ్య పద్ధతి పై దేశభక్త్యుత్సాహములు ఉద్దీపించునట్లు విద్యావిధానము మార్చబడినది. పాఠ్యగ్రంథములు కొరియను భాషలో పునర్లి భింపబడినవి. శాస్త్రీయ సాంకేతిక విద్యాశిక్షణమున ప్రత్యేకమైన శ్రద్ధాసక్తులు గైకొనబడెను. ప్రాథమిక విద్య నిర్బంధము చేయబడినది. 1954 డిసెంబరు నాటికి 4,043 ప్రాథమిక పాఠశాలలలో 27,34,726 మందియు, 788 మాధ్యమిక పాఠ శాలలయందు 4,07,893 మందియు, 466 ఉన్నత పాఠశాలలలో 2,10,862 మందియు, 213 వృత్తి విద్యాలయములలో 98,281 మందియు, 71 కళా శాలలలో 98,281 మందియు, 18 నార్మల్ పాఠశాలలలో 13,217 మందియు 3,548 వయోజన పౌర విద్యాలయ ములలో 2,97,792 మందియు, విద్య నభ్యసించుచుండిరి. 1948 వ సం. లో కొరియాలో అక్షరాస్యత 70 శాత ముండెను. మతము : మత విషయమున విదేశీయుల ప్రభావము కొరియా ప్రజలపై అధికముగ ప్రసరించెను. షామియా 11 81