పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కొరియాదేశము (చరిత్ర) సంగ్రహ ఆంధ్ర


ద్వితీయ ప్రపంచయుద్ధము (1939 - 45) తో జపాను చైనా, పాలనము కొరియాలో అంత మొం దెను. ఇంగ్లండు, అమెరికా ప్రభుత్వములు శీఘ్రకాలములో కొరియాకు స్వాతంత్ర్య మొసగ గలమని 1943 లో ప్రక టన గావించెను. కొరియా 'తాత్కాలిక ప్రభుత్వము' ‘చుంకింగ్ ' (దక్షిణ చైనా నుంచి చైనా నాయక త్వమున 1944 సం.లో జపానుపై పోరాటము నారంభించెను. మిత్రమండలివారు 1948లో సమావేశమై 1943 లో తాము చేసిన ప్రకటనమును అమలుజరి పెదమని వాగ్దాన మొనర్చిరి. 1945 లో జపానుపై యుద్ధమునకు దిగిన సోవియట్ రష్యా కూడ కొరియా స్వాతంత్ర్య ప్రతిపాద నమును సంపూర్ణముగ బలపరచెను. సోవియట్ సైన్య ములు ఉత్తర దిశనుండి కొరియాలో ప్రవేశింపగా, దక్షిణమునుండి అమెరికా సైన్యములు గూడ ప్రవేశించి నవి. సైనిక వ్యూహ సౌలభ్యమునకై కొరియా దేశము ఉత్తర, దక్షిణ మండలములుగా విభజింపబడెను. ఈ విభ జనము 38వ అక్షాంశ రేఖ (38 th Parallel) వద్ద జరిగెను. ౨ కొరియాను ఒకే కేంద్రప్రభుత్వము క్రింద ఐక్య మొన రించుటకై ప్రప్రథమమున రష్యాచే సూచన చేయబడెను. కొరియాలోనున్న అమెరికా సైనిక నాయకులును, రష్యా సైనిక నాయకులును సంయుక్త సంఘముగా నేర్పడి కొరియా ప్రజానాయకులతో సంప్రతించిన ఫలిత ముగా కొరియాదేశ మంతటికిని ఒకే ప్రభుత్వము నేర్పాటు చేయుట సమంజసమని అమెరికా, ఇంగ్లండు, రష్యా, చైనా ప్రభుత్వములు అంగీకరించెను. కా అందులకై చేసిన ప్రయత్నములు విఫలములయ్యెను. అంతట అమెరికా ఈ ఏకీకరణ సమస్యను ఐక్యరాజ్య సమితి ముందుంచెను. ఐక్యరాజ్య సమితి ఈ సమస్యను చర్చించి, కొరియాయందు అంతటను ఐక్యరాజ్య సమితి తాత్కాలిక సంఘముయొక్క అధ్వర్యమున ఎన్నికలు జరుపవలెనను తీర్మానమును ఆమోదించెను. ఈ తీర్మా నము ప్రకారము ఎన్నికలను జరుపుటకు ఏతెంచిన తాత్కాలిక సంఘము ఉత్తరమండలములో ప్రవేశించు టకు ఉత్తర కొరియాలోని రష్యను అధికారులు అంగీక రింపలేదు. కాని దక్షిణ కొరియాలో ఎన్నికలు జరిగి

1948 మేనెలలో జాతీయమహాసభ సమావేశమయ్యెను. సింగ్మన్ రీ దక్షిణ 'కొరియన్ రిపబ్లిక్' నకు అధ్యక్షుడుగా ఎన్నిక యయ్యెను. దక్షిణ కొరియాకు ప్రత్యేక ముగా 1948 జులై నెలలో నూతన రాజ్యాంగ మేర్పడి అమలు జరుపబడెను. ఉత్తరకొరియా ప్రజాపరిషత్తు 1948 జులై నెలలో సమావేశమై ఉత్తరకొరియాకు ఉత్తరకొరియాకు ప్రత్యేకముగా ఒక రాజ్యాంగమును ఆమోదించెను. దీనిననుసరించి ఉత్తర కొరియా ప్రభుత్వమునకు 'డెమాక్రటిక్ పీపుల్సు రిపబ్లిక్ ' అని నామకరణ మొనర్పబడెను. కిమ్ ఇల్ సుంగ్ అను నతడు మొట్టమొదటి ప్రధానిగా ఉత్తరకొరియా ప్రభుత్వ మునకు ఎన్నికయయ్యెను (1948). ఇది జరిగిన వెంటనే సోవియట్ రష్యా తన సైన్యములను ఉత్తరకొరియానుండి స్వదేశమునకు మరలించివేయగలనని ప్రకటించెను. కొరియా యుద్ధానంతర పరిస్థితి దక్షిణ ఉత్తరకొరి యాలలో వేర్వేరు ప్రభుత్వములు స్థాపింపబడిన కొంత కాలమున కే (1950 జూన్) వాటి నడుమ సంఘర్ష ణము ప్రారంభమై తుట్టతుదకు 1953 జులైలో అంత మయ్యెను. ఇరుపక్షములును ఒండొరులపై ఆరోపణ ములు, ప్రత్యారోపణములు చేసికొనిన ఫలితముగా, దీర్ఘకాలము రాయబారములు సాగినవి. తుదకు సమా ధానము కుదిరెను. కాని కొరియాయొక్క ఏకీకరణము, దేశమంతటికిని ఒకే ప్రభుత్వము, ఒకే రాజ్యాంగము ఏర్పడుట అను సమస్యలు నేటికిని అపరిష్కృతములుగ నే నిలిచిపోయినవి. కొరియా సంధి ఒడంబడిక (Peace treaty) మీద సంతకములు పెట్టకమునుపే (1958 జూన్) దక్షిణకొరియాకు అవసరమైన ఆర్థిక సైనిక సహాయ మొనర్తు నని అమెరికా అధ్యక్షుడు ఐసెన్ హోవర్ వాగ్దాన మొన ర్చేను. అనంతరమీ వాగ్దానమును అతడు చెల్లించుకొ నెను. దక్షిణకొరియాకును, అమెరికా కును నడుమ అన్యోన్య సైనికసంధి 1953 అక్టోబరులో జరిగిన ఫలితముగా, 1956 జూన్ తో అంతమైన ఆర్థిక సంవత్సరములో అమెరికా, దక్షిణ కొరియా ప్రభుత్వ మునకు 80,00,00,000 డాలర్ల మేరకు సహాయమిచ్చెను, అమెరికా ఇంతగా ఆర్థికసహాయ మొనర్చినను, దక్షిణ కొరియాయొక్క ఆర్థిక విధానము, సహజముగా లోప 80