కొరియాదేశము (చరిత్ర)
సంగ్రహ ఆంధ్ర
నగరమునకు కొనిపోబడిరి. తదాదిగా కొరియనులకును, ఇతర ఐరోపాదేశములకు చెందిన పొగయోడల యజమానులకును అప్పుడప్పుడు సంబంధములు కలుగుచుండెను. క్రీ. శ. 1830 లో మువ్వురు ఫ్రెంచి మతాధికారులు కొరియాలో అడుగిడి కొరియనుల చేతిలో మడసిరి. క్రీ. శ. 1865 సం. నకు అనంతరము కొరియాతో వర్తకము నెరపదలచిన పెక్కు దేశములతో దానికి సంబంధములు మెండయ్యెను. పెక్కు పర్యాయములు ఫ్రెంచి, అమెరికా, జపాను నావికాదళములు, కొరియాతో తలపడెను. క్రీ. శ. 1876 లో తనతో ఒడంబడిక గావించుకొనుటకై కొరియాపై జపాను ఒత్తిడిగావించెను. తత్ఫలితముగ రెండుదేశముల నడుమ దౌత్యసంబంధములు (diplomatic relations) నెలకొనెను. క్రీ. శ. 1892 లో కొరియాతో ఒడంబడిక చేసికొనిన మొదటి పాశ్చాత్య రాజ్యము అమెరికాయే. వెనువెంటనే ఇతర పాశ్చాత్య రాజ్యములు కూడ కొరియాతో ఆర్థిక, రాజకీయ సంబంధము లేర్పరచుకొనెను. క్రీ. శ. 1886 వ సం. నాటికి, ఈశాన్య ఆసియాలో తమ ప్రయోజనములను సాధించు కొనియున్న అన్ని రాజ్యములతోడను కొరియాకు సంబంధ మేర్పడెను.
జపాను ప్రాబల్యము : పాశ్చాత్యనాగరికతతో సంపర్క మేర్పడిన ఫలితముగా జపాను అభివృద్ధి చెందెనని విశ్వసించిన కొరియనులు, తాముకూడ అదేమార్గమును అనుసరింపదలచిరి. ప్రాచీన సంప్రదాయికులైన కొరియనులు ఈ భావమును వ్యతిరేకింపగా, అభ్యుదయకాములైన యువకులు క్రీ. శ. 1882 వ, 1884 వ సం లలో జపాను సాయముతో కొరియా రాజరికముపై తిరుగబడిరి. ఈ సందర్భమున కొందరు జపానీయులు మరణించిరి. అంతట జపాను ప్రభుత్వము కొరియానుండి నష్ట పరిహారమును కోరెను. క్రీ. శ. 1884 వ సం.లో జరిగిన తిరుగుబాటు సందర్భమున కొరియా ప్రభుత్వము చైనా సహాయముతో జపాను అధికారులను తన దేశమునుండి తరిమివైచెను. జపానీయులు మరల కొరియాకు తిరిగివచ్చి మరొకసారి నష్ట పరిహారముకొరకై సంఘర్షించిరి. చైనీయులును, జపానీయులును ఎట్టెటో సమాధానపడి (టీంట్సిన్ ఒడంబడిక 1885), ఇరు రాజ్యములవారు తమ సైన్యములను కొరియానుండి మరలించివైచుట కంగీకరించిరి. ఈ ఒడంబడిక ప్రకారము కొరియాకు తన స్వంతసైన్యమును నిర్మించుకొను హక్కు గుర్తింపబడినది. ఆంతరంగిక కల్లోలము సంభవించునప్పుడు మాత్రమే, కొరియా కోరికపై జపానుకును, చైనాకును కొరియాలో ప్రవేశించుటకు హక్కు ఇయ్యబడినది. కాని ఈ ఒడంబడిక తొమ్మిది సంవత్సరములవరకు మాత్రమే అమలునం దుండెను. క్రీ. శ. 1894 సం.లో కొరియా యందలి ‘టోంఘుకులు' అను నొక మతవర్గము వారు విదేశీయుల జోక్యమును నిరసించి తిరుగబడిరి. ఈ మతవర్గము పేద ప్రజలనుండి ఉత్పన్నమైనది. జపాను సైన్యములు, చైనా సైన్యములు కొరియాలో ప్రవేశించకపూర్వమే కొరియా ప్రభుత్వము ఈ తిరుగుబాటును అణచివైచెను.
కొరియా ప్రభుత్వ విధానములో కొన్ని సవరణలు ప్రవేశపెట్టు విషయమున తాను సాయపడుటకై, చైనాఅంగీకారమును జపాను ప్రభుత్వము కోరగా, చైనా అందుకు నిరాకరించెను. జపాను సేనలు సియోల్నందలి రాజభవనముపై దాడి జరపి వెనువెంటనే చైనాపై యుద్ధము ప్రకటించెను. యుద్ధము స్వల్పకాలమేసాగెను. నూతనమైన కొరియా ప్రభుత్వము జపాను సహకారముతో చైనీయులను వెడల నడిపించెను. క్రీ. శ. 1895లో జరిగిన 'షిమొనోసెకీ' ఒడంబడిక ననుసరించి చైనా, జపానులు రెండును కొరియా స్వాతంత్ర్యమును గుర్తించినవి. కాని అనతికాలముననే జపాను ఈ ఒడంబడికను ఉల్లంఘించి కొరియా ప్రభుత్వమునుండి విపరీతాధికారములను సంపాదించుటకై దానిపై ప్రబలమైన ఒత్తిడి తెచ్చెను. కాని కొరియా అందులకు అంగీకరింపక నిలబడి ప్రతిఘటించెను. కొరియాలోనున్న జపాను రాయబారి కుట్రపన్ని ప్రతికూలురాలుగా నున్న కొరియారాణిని క్రీ. శ. 1895 లో చంపించి, తమ కనుకూలమగు నూతన కొరియా మంత్రివర్గమును నియమించెను. నామమాత్రమైన ఆ కొరియా మంత్రివర్గమును అడ్డమిడుకొని జపాను ప్రభుత్వము కొరియాను క్రీ. శ. 1896 వ సం. వరకు పాలించెను. కొరియారాజు తన అనుచర మంత్రివర్గముతో రష్యా రాయబార కార్యాలయమునకు పలాయితు డయ్యెను. పిదప కొంతకాలమునకు ఈ
78