పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము = 3 కొరియాదేశము (చరిత్ర)


వికసించెను ; సాహిత్యము, వివిధశాస్త్రములు త్వరిత గతిని వృద్ధిచెం దెను. కొరియాయందు భాషగూడ దాదాపు ఏకీకరణ మొనరింపబడెను. కోర్యో : 'సిల్లా' ప్రభుత్వ సేనానులలో నొకడగు 'వాంగన్' తిరుగబడగా, 'సిల్లా' రాజ్యాధినేత అతని బలాధిక్యతను గుర్తించి, క్రీ. శ. 918 సం. లో అతనికొక ప్రత్యేక స్వతంత్ర రాజ్యమును ఏర్పరుపవలసి వచ్చెను. ఇప్పుడు 'సియోల్' నగర సమీపముననున్న 'కేసాంగ్' అను తావుననే ఈ స్వతంత్ర రాజ్యము యొక్క రాజధాని వెలసి యుండెను. క్రీ. శ. 935వ సం. లో 'సిల్లా' ప్రభు త్వమునకు చెందిన తుదిరాజన్యుడు తన అధికారమును పరిత్యజించగా, వాంగన్ ఆ రాజ్యస్థానములో 'కోర్యో' అను మరియొక నూతన రాజ్యమును నెలకొల్పెను. ఈ రాజ్యము క్రీ. శ. 1392 వ సం. వరకు నిలిచి యుండెను. 'కొరియా' యని పాశ్చాత్యులు గావించిన నామకరణము 'కోర్యో' నుండియే ఉత్పన్న మయ్యెను. 'వాంగ్' రాజ వంశ కాలమున కోర్యోలో బౌద్ధమతము ప్రబలముగా ప్రచారమం దుండెను. ఆ కాలమున చైనా దేశముతో కొరియా సత్సంబంధములనే నెరపుచుండెను. ఇట్లుండగా క్రీ. శ. 1231 లో మంగోలులు కోర్యోపై దండెత్తివచ్చి, దేశమంతయు ఆక్రమించి, 1364 వ సం. వరకు తమ అధీనమున ఉంచుకొనిరి. అదే సంవత్సరమున జనరల్ 'ఇ-టెయిజో' అను నాతని నాయకత్వమున కొరియా సైన్యములు మంగోలు మూకలను ఓడించి దేశమునుండి తరిమి పై చెను. రాజును , చోసన్ జనరల్ ఇ-టెయిజో, వాంగ్ వంశపు తుది శ. 1892 లో పదభ్రష్టుని గావించి, తన వంశమును రాజ్యాధికారమున నెలకొల్పెను. క్రీ. శ. 1910వ సం. లో కొరియాను జపాను ప్రభుత్వము తన రాజ్యములో కలిపివేసికొనువరకు ఈ వంశమే కొరి యాలో అధికారమును నెర పెను. చైనా యొక్క 'మింగ్ ' వంశసార్వభౌముడు 'ఇ' అను పై పేర్కొన్న రాజ వంశమును గుర్తించి కొరియాకు 'చోసన్' అను నూతన నామమిడెను. ఈ చోసన్ రాజ్యమునకు హాంగ్యాంగ్ (ప్రస్తుతము సియోల్) రాజధాని యయ్యెను. ఈ నూతన వంశ పాలనమున కొరియా వైజ్ఞానిక ముగను, సాంస్కృతి

కముగను, అత్యంత వైభవము అనుభవించెను. ఈ కాల మున బౌద్ధమతము అణగ ద్రొక్కబడి, బౌద్ధమ తాధి కారుల క్రిందనున్న భూములు ప్రజలకు పంచి ఇయ్య బడెను. క్రీ. శ. 1403 సం. లో శ. 1403 సం. లో ప్రప్రథమముగా చైనా భాషకు సంబంధించిన అక్షరములను అచ్చొత్తించుట సంభవించెను. క్రీ. శ. 1420 లో ప్రభుత్వక ళాశాల స్థాపింప బడెను. 'ఇ' రాజవంశము అధికారమును హస్తగత 150 సంవత్సరములలో కొరియాయందు విద్యావ్యాప్తి బహుళముగ వైద్యశాస్త్రమందును, ఖగోళశాస్త్రమందును, భూగర్భ శాస్త్రమందును, వ్యవసాయశాస్త్ర మందును, చారిత్రక విషయములందును పెక్కురు విద్వాంసులు వెలసిరి. మొనరించుకొనిన మొదటి జరగి, క్రీ. శ. 18వ శతాబ్దాంతమున ప్రప్రథమముగా కొరియా జపాను దండయాత్రకు గురియయ్యెను. శ. 1592 లో హిడెయోషి అను జపానీయుడు కొరి యాను ఆక్రమించెను. ఏడుసంవత్సరముల సంఘర్షణ అనంతరము జపాను కొరియాను విడిచి వెళ్ళవలసివచ్చెను. క్రీ. శ. 1627 వ సంవత్సరములో మంచూ జాతీయులు, చై నాయందలి 'మింగ్' వంశమునకు ప్రమాదము తెచ్చి పెట్టిరి. వీరు కొరియా నాక్రమించి, కొరియా ప్రభువుచే, తమ సార్వభౌ మాధికారమును గుర్తింప జేసికొని కొంత కాలము రాజ్యమేలినపిమ్మట ఆదేశమును వీడి వెడలిరి. ఇట్లుండగా క్రీ. శ. 1644 వ సంవత్సరములో మంచూ జాతీయమైన 'చింగ్' వంశమువారు చైనా పాలితులుగ స్థిరపడిరి. వీరి సార్వభౌమాధికారమునకు లోబడి, కొరియా సామంత రాజ్యముగ మనవలసివచ్చెను. అయి నను కొరియాయొక్క ఆంతరంగిక స్వేచ్ఛా స్వాతంత్య్ర ములలో చై నాప్రభుత్వము జోక్యము కలుగజేసుకొన కుండెను. 77 శా పాశ్చాత్యులతోడి సంపర్కము: క్రీ.శ.1880 సం. వరకు కొరియా బాహ్యప్రపంచములో సంబంధము లేక ఏకాకిగా జీవితమును గడుపుచుండెను. కొరియాకు పాశ్చాత్యులతో క్రీ. శ. 1653వ సం. లో ప్రప్రథమ ముగా సంపర్కము కలిగెను. ఆ సంవత్సరమున ఒక డచ్చి పొగయోడ 'చెజు' ద్వీపమువద్ద భగ్నమయ్యెను. అందు బ్రతికి బయటపడిన 30 మంది ప్రయాణీకులు సియోల్ 77