పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము = 3 కొరియాదేశము (చరిత్ర)


గురిలో నొకరు కార్యదర్శిగా నెన్నుకొనబడుదురు. దేవాలయమునకు చెందిన సర్వవిషయములను ఈకమి టీయే నిర్వహించుచున్నది. వచ్చిన ఆదాయములో మూడింట నొకవంతు పూజారులు కీయబడును. వ్యయ మంతయు కాగా మిగిలిన ధనము కమిటీ స్వాధీనములో నుండును. ఇట్టి ధనముతో క్రొత్తగదులు, దేవాలయము ముందున్న కో నేరు బావికి రాతికట్టడము, యాత్రార్థమై వచ్చిన స్త్రీలకు స్నానార్థము మరుగుగా నుండుటకు గదికివలె నిలువెత్తు గోడలు, వాటిమధ్య విశాలమయిన 'హవుజు' (తొట్టి) మొదలయినవి కట్టబడినవి. అద్దాల మండపనిర్మాణము, దేవాలయావరణ విస్తరణము, ముందు ముందొక సంస్కృత పాఠశాల నిర్మాణము, గ్రంథాలయ నిర్మితి మొదలయిన ప్రజోపయోగకరమైన కార్యములను చేయుతలంపు ఈ కమిటీవారికి కలదు. ఇక్కడ శివరాత్రి మొదలుకొని వారమురోజులవరకు జాతర యొకటి జరుగును. కళ్యాణోత్సవములు, ఇతరోత్స వములు ఉగాదిదాక సాగుచునే యుండును. ఈ వీరభద్ర స్వామివద్దకు ఎక్కువగా రోగములుపోగొట్టుకొనుట కొర కును, సంతానము పొందుటకొరకును యాత్రికులు వచ్చు చుందురు. ఈ కోర్కెలుగల స్త్రీలు, పురుషులు స్నానము చేసి, దేవాలయమునందలి ధ్వజస్తంభమునకు ముంగిట ప్రాణాచారములు పడియుందురు. ఇది నిత్యకృత్యము. భక్తులకు స్వప్నదర్శనమువలన కాని, ఆవేశితులయిన వారి వలన కాని, స్వామి ఆజ్ఞ లభించును. ఆజ్ఞ లభించు వరకు భక్తులు తమ తమ ఇండ్లకు వెళ్ళు నాచారము లేదు. జాతర దినములలో ఆదాయము ఎనిమిది వేలకు తక్కువ కాకుండ నుండును. ఈ ఆదాయము వస్తురూప మున, పశురూపమున, ధనరూపమునకూడ నుండును. దేవునికి మ్రొక్కుల రూపమున కోడె లెక్కువగా లభిం చుట ఇక్కడి ప్రత్యేకత. సంతానము పొందిన వారును, దేవునికి విశేషముగా కోడెలను సమర్పింతురు. కోడెలను విక్రయించుటచే వచ్చిన ధనము, 'డబ్బీ'లో పడు ధనము, హారతి పళ్ళెములో లభించుధనము చేరి పైని పేర్కొన బడిన ఆదాయము ఏర్పడుచున్నది. ఇతర దినములలో భక్తుల వలనను, ఏటేటా భూములమీదను వచ్చు ఆదా యము దాదాపు నాలుగైదువేల రూప్యముల పరిమితి

కలదిగా నున్నది. అనగా సాలునకు ఈ దేవాలయాదా యము పన్నెండువేలనుండి పదిహేనువేల పరిమితిగలదై యుండును. జాతరజరుగు దినములలో సువిశాలములును, సుదీర్ఘ ములును అయిన పందిళ్ళు వేయబడును. యాత్రికుల కొరకు కొన్ని దడులు, చలివేంద్రలును కూర్చబడును. దేవాలయమునకు ముందున్న విశాలమయిన మైదానము జాతర జరుగు సమయమున బండ్లతో నిండియుండును. ప్రకృతి సిద్ధమైన పందిళ్ళవలె పెద్ద పెద్ద వృక్షములు గూడ అచట నున్నవి. దేవాలయము మొదలుకొని దాదాపు రెండు మూడు ఫర్లాంగుల దూరమువరకు దారికి ఇరువై పులను వివిధములైన 'దుకాణములు' వ్యాపించి యుండును. కొండపల్లి నుండియు, తదితర ప్రదేశములనుండియు బొమ్మలసామగ్రి ప్రచురముగా ఇచ్చటికి దిగుమతి యగును. ఆలయమునకు కొద్ది ముననే ఉన్న పెద్ద చెరువు యాత్రీకుల స్నానపానములకు నీటి సమృద్ధిని కల్పించుచున్నది. తియ్యని నీటి బావులు గూడ చుట్టుప్రక్కల నున్నవి. జాతర జరుగునాడు రథో త్సవము జరుగును. ఆనాడు కొరవియంతయు జన సము దాయముతో పిక్కటిల్లిపోవును. ఆనాటి జనసంఖ్య పది వేలకు మించును. జాతరలలో రథోత్సవమునాడే అధికా దాయము లభించును. ప్రభలు కూడ ఇక్కడకు విరివిగా వచ్చును. జాతరలు జరుగునపుడు హరికథలు, బుఱ్ఱ కథలు మొదలయిన వినోదక్రియలు సాగుచుండును. కవి సమ్మేళనాది సాహిత్య సమావేశములును సాగును. దూర ఈ జాతర జరుగు కాలమున మహబూబాబాదునుండి బస్సులు అధికముగా నడుపబడును. బండ్ల సందడికూడ అపరిమితముగనుండును. మహబూబాబాదులోని జనులెల్ల జాతర దినములలో కొరవిలోనే వసింతురు. ఇంత భవ్య మైన జాతర తెలంగాణములో మరెక్కడను జరుగదు. ఈ ఆలయాదాయ మింకను ముందు ముందు పెరిగి నచో తిరుపతివలె ఇదికూడా ఒక విద్యాపోషక సంస్థగా మారగలదని తోచును. కె. సం. ఆ. కొరియాదేశము (చరిత్ర) : ప్రాచీన చరిత్ర : కొరియా దేశము యొక్క ప్రాదు ర్భావమును గూర్చి క్రీ. పూ. 2333వ సం॥ నుండియు 75