పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము - 8 కొరవి వీరభద్రుడు


యుండవలెను. అదియుగాక ఈ యున్నది. ఇది యాచార విరుద్ధముగా కనిపించుచున్నది. కాన దీని కేంద్ర శివాలయము ఈ చుట్టుప్రక్కల నుండి ప్రక్కల శివ లింగములు పెక్కులు దొరకినవి. (ప్రస్తుతము వీరభద్రా లయములో గర్భాలయమునకు రెండు ప్రక్కల రెండు లింగములు చేర్చబడి యున్నవి.) ఈ విషయములను బట్టి ఈ త్రిశంకు దిబ్బ అనునది ఒక శివాలయమై యుండు నని తోచును. ఇక్కడి ఈశ్వరున కి పేరుండియుండవచ్చును. ఇక్కడ ఒక గాథయు నున్నది. పూర్వము వీరభద్రుడు ప్రాఙ్ముఖుడుగా నుండియుండెనట. ఒకసారి ఒక హరి జనుడు ఆ గుడిముందునకు రాగా, వీరభద్రుడు ప్రతీచీ ముఖుడై నాడట. ఈ గాథలో సత్య మెట్లున్నను, వీర భద్రుడు పూర్వము ప్రాఙ్ముఖుడుగను, ప్రస్తుతము ప్రతీచీ ముఖుడుగను ఉన్నట్లు విదితము. అనగా పూర్వము త్రిశంకుస్వామి కెదురుగా నున్న వీరభద్ర విగ్రహము తరువాతి కాలమున త్రిప్పివేయబడినట్లు తెలియుచున్నది. కావున ఆ త్రిశంకునిదిబ్బ శివుని ఆలయమునకు సంబంధించి యుండె ననియు, అనుబంధముగా ఈ వీరభద్రుడు, గ్రామ రక్షకుడుగ స్థాపింపబడి యుండెననియు భావింపబడు చున్నది. అయితే కాలక్రమమున శివాలయము మిక్కిలి శిథిలమై, దిబ్బగా నేర్పడగా వీరభద్ర భక్తులెవరో ఈ దేవునికి ప్రాముఖ్యము నిచ్చి ఈ ఆలయమును ఉన్నత స్థితికి తెచ్చియుందురు. ఈ దృష్టిని బలపరచు మరియొక విషయము కలదు. పూర్వము ప్రతి గ్రామములోను, వివిధ మతముల వారుండుటచే ఆ యా మతస్థులకు తగిన గుళ్ళు, గోపుర ములు ఉండెడివి. ఇక్కడకూడ నృసింహాలయ మొకటి అత్యంతము శిథిలమైనది కలదు. దీనిని యెనుములపల్లి పెద్దనయొక్క పూర్వు లెవరో నిర్మించినట్లు చిత్ర భారతము చెప్పుచున్నది. (ఈ ఆలయము లోని నృసింహస్వామి విగ్రహము మహబూబాబాదుకు తరలించబడినది.)అయి తే ఈ ఆలయమందు కాకతీయుల కాలపు శిల్పరీతి గోచరించు చున్నది. గర్భద్వారమున కిరుప్రక్కల సమర్పబడిన వరంధ్రక శిలా ఫలకమునందు, వరంగల్లు నందలి వేయి స్తంభాల గుడిలోని ఫలక చ్ఛాయలున్నవి. ఈ యాలయము కామప్పలోని చిన్ని చిన్ని గుళ్ళను పోలియున్నది. శిల్ప

కృత్యమంతయు నల్ల రాతిపైననే చేయబడి యున్నది. ప్రస్తుతము ఈ ఆలయము దాదాపు మూడడుగులు భూమిలోనికి కృంగియున్నది. దీనిని బట్టి చూడగా అంత ప్రాచీనుడయిన వీరభద్రస్వామి ఆలయమందును శిల్ప మావిధముగ నే ప్రాచీనమై యుండి యుండవలసినది. కాని వీరభద్ర విగ్రహమం వీరభద్ర విగ్రహమందు తప్ప ఆనాటి శిల్పమీ యాలయ మున మచ్చునకుగూడ కానరాదు. అనగా ప్రస్తుతమున్న యాలయ మర్వాచీన మైనదని తేలుచున్నది. కాగా ఇది అనుబంధాలయమే కానీ, దీనియందంత ప్రాచీన మైన శిల్పరచన లేక యొక గర్భగుడి మాత్రమే ఆనాడు నిర్మితమైనదై యుండవచ్చును. అయితే శివాలయమని భావింపబడుచున్న ఆత్రిశంకుస్వామి ఆలయనిర్మాణములో కొంత విశిష్టత యున్నదనవలెను. ఎందుకనగా అందు ఇటికల గోడలు కన్పించుచున్నవి. ఇచ్చటి ఇటికల నిర్మాణ పద్ధతి రామప్పలోను, మరికొన్ని స్థలములలోను అనుస రింపబడిన ఇటికల నిర్మాణ విధానమునకు చెందియున్నది. అట్లుకాక ఈ దిబ్బలో శిలాకుడ్యము లేవయిన నున్న వేమో తెలియదు. ఇక్కడ ధన ని శేపములున్నవనెడి ప్రథయు కలదు. సామాన్యముగా పూర్వులు ఆలయములందు ధనములు నిక్షేపించెడి వారు.

ఇక్కడి వీరభద్రుని రూపము భయంకరమైనది. ఎనిమిది చేతులతో, వివిధాస్త్ర శస్త్రములతో ఇతని మూర్తి అలంకృత మైయున్నది. కాకతీయులకు పూర్వము శివ, విష్ణు, సూర్య, గణపతి పూజలే విరివిగా నుండినవి. కాని కాకతీయుల నాటికి కాకతమ్మ, ఏక వీర, మైలారు దేవుడు మున్నగు అనుబంధ దేవతల పూజ అధిక మైనది. ఆ కాలమున నే వీరభద్ర పూజయు విజృంభించియుండును. బలమునకును, శౌర్యమునకును వీరభద్రుడు పెట్టిన పేరు. ఆ కాలము నుండియే వీరశైవుల యొక్క వీరావేశ సూచకమయిన 'వీరభద్ర పళ్ళెము' లేర్పడియుండును. శివుడు భయంకరుడు గాడు. సౌమ్యుడు, సుందరుడు, శుభంకరుడు. వీరభద్రుడు మాత్ర మట్లు కాదు. తాంత్రి కులకు, శాక్తేయులకు మాత్రమే వీరభద్రుడు అభయం కరుడు. అదిగాక వీరశబ్ద వాచ్యులు మరుత్తులు; వారే రుద్రులు కూడ. వీరభద్ర అనుదాని యందు 'భద్ర' అను పదము మంగళత్వమునే సూచించుచున్నను, తాంత్రికుల 73