పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కొమఱ్ఱాజు వేంకట లక్ష్మణరావు సంగ్రహ ఆంధ్ర


లక్ష్మణరావుగారికి తెలంగాణమునందు అభిమానము మెండు. ఇచ్చటి ఆంధ్ర చారిత్రక సంపద ఘనమైనదని మొట్టమొదట గ్రహించినవారు లక్ష్మణరావు గారే. శ్రీవారి ఆదేశ సహకారములతో హైదరాబాదులో ఆంధ్ర పరిశోధక సంఘము స్థాపిత మయ్యెను. శ్రీవారి మరణానంతరము ఆ పరిశోధక సంఘము “లక్ష్మణరాయ పరిశోధక మండలి” గా రూపొందినది. చరిత్ర పరిశోధన మొనర్చుట, శాసన గ్రంథములను ప్రకటించుట, అము ద్రిత గ్రంథము లను గూర్చియు, విస్మృత కవులను గూర్చియు వివరించుట మున్నగు విస్తృత కార్యకలాప ములను నెరపి పేరొంది యున్నది. ఈ మండలి లక్ష్మణ రావుగారికి ప్రియమైన మూడవ సంస్థ. తెలంగాణము నందలి O ధ్రులను గూర్చియు, కవు లను గూర్చియు, ప్రదేశములను గూర్చియు ఉత్తర సర్కారు లందలి ఆంధ్రసోదరులకు ఆ కాలమున అపో హలు మెండుగా నుండెను. చరిత్రకును, భూగోళము నకును సంబంధించిన విషయములను మనవారు తారు మారు చేసిరి. లక్ష్మణరావుగారి రచనలందు అట్టి పొర పాట్లు కనబడవు. శ్రీవారు సోదరాంధ్రుల అపోహలను విమర్శించి సత్యమును నిరూపించియున్నారు. ఉదాహర ణార్థమై కొన్ని వాక్యరత్నము లొసగబడుచున్నవి. (1) అర్థమువ్రాసిన వారు సగరపుర మనగా అయోధ్య యని వ్రాసియున్నారు. ఇది పూర్వము బహమనీ రాజ్య మునకు రాజధాని. సగరపట్టణ మనునది ఇప్పుడు భీమా నదికి అనతి దూరమున “సస్యతాబాద్ సాగర్" అను పేరిట గుల్బర్గాజిల్లాలో నున్నది. (2) " కెంబావి" అనగా "కెండా” పట్టణమని టీకా కారులు వ్రాసియున్నారు. కెంబావి అను గ్రామము గుల్బర్గా జిల్లాలో గానవచ్చినది. ఇది గుల్బర్గాకు నైరృతి మూలను 50 మైళ్ల మీద నున్నది. షోరాపురము, సాగర్ అనునవి దీనికి సమీపముననే యున్నవి. పైని సురపుర మని చెప్పబడిన షోరాపురమునకు కెంబావి తూర్పున 16, 17 మైళ్ల మీద నున్నది. ఈ కెంబావి విజయనగరము నకు సూటిగ ఉత్తరమున 90 మైళ్ల దూరమున నున్నది. కావున ఆముక్తమాల్యదలోని కెంబావి యిది యనియే తలంచుట న్యాయము. ఈ శోధన తోడ కెంబావి యనగా

"క్వాంబే" యగునేమో యన్న యూహ పూర్వ పక్ష మగుచున్నది. (8) “ఏకశిలా నగర మోరుగల్లే" (ఈ చర్చ విపులము గను, వినోదకరముగను ఒనర్చియున్నారు.) 46 (4) ఓరుగంటికి ముప్పది మైళ్ల దూరమున బొమ్మెర యను గ్రామము కలదు. ఇట్టి పేరుగల యూరు తెలుగు దేశమందు నెచ్చటను మరియొకటి యున్నట్లు... ప్రమాణ ములు చూపియుండ లేదు. (5) పోతన యోరుగంటివా డనియు, బొమ్మెరను బట్టియే యాతని వంశమునకు బమ్మెరవారన్న యింటి పేరు వచ్చెననియు నూహించుట సకల న్యాయ శాస్త్ర ముల సంప్రదాయము ననుసరించిన సిద్ధాంతము. (6) వెలిగందల, ఏర్చూరు అను పరిశుద్ధమైన పెళ్ళుగల గ్రామములు ఓరుగంటికి, బమ్మెరకు, ఖమ్మం మెట్టుకు సమీప మందుండగా వానిని వదలి ఏ సంబంధము లేనివియు ఏర్చూరు వెలిగందల మేనమామ పోలికగలవియు నగు ఏల్చూరు, వెలిగండ్ల గ్రామముల నెవ్వరు గ్రహింతురు? (7) త్రిలింగ సంబంధములయిన మూడు లింగములును కాకతీయ రాజ్యమునకు సంబంధించినవని స్పష్టముగ తెలియవచ్చు చున్నది. ఇచ్చట కాళేశ్వరమును గూర్చి మనవారు పడుచున్న పొరపాటు చూపవలసియున్నది. కాళేశ్వర మనగా శ్రీ కాళహస్తి యని కొందరు వ్రాసి యున్నారు. అట్లు వ్రాయుటకు భూగోళ జ్ఞానము లేమి యే కారణము. ఈ త్రిలింగ సంబంధమయిన కాళేశ్వరము నైజాము రాజ్యములో మంథెన గ్రామమునొద్ద నున్నది. దిగ్దర్శనముగా జూపుట కివి చాలును. లక్ష్మణరావుగారు మహారాష్ట్ర భాషలో అపార వై దు ష్యము కలిగి రచనాధురీణులయి యున్నారు. కావున వారు మహారాష్ట్ర భాషనుండి కొన్ని క్రొత్త పదములు తెలుగుభాషలోనికి తీసుకొనివచ్చినారు. అవి తెలుగు భాషలో స్థిరపడిపోయినవి. అట్టి పదములలో యూని వర్సిటీ (University) అను పదమునకు సర్వకళాశాల యని గాక విశ్వవిద్యాలయ మనుట; ఎడ్యుకేషన్ (Education) అను పదమునకు విద్యయని గాక శిక్షణము అనుట; ఎడిటర్ (Editor) అను పదమునకు పత్రికాధిపతి యని గాక సంపాదకుడు అనుట; ఫలాని సంవత్సరము 70