పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కొమత్దాజు వేంకట లక్మణరావు సంగ్రహ ఆంధ్ర


వీథిని నిర్మించుకొనుచు ఉవ్విళ్ళూరు చిత్తవృత్తి లక్ష్మణ రావు గారికి లేకుండెను. మహారాష్ట్ర దేశమున విద్యాసంపాదన కృషి పూర్తి యయి, ఎం. ఏ. పరీక్షయందు కృతార్థులయినతోడ నే లక్ష్మణరావుగారు తమ కార్యరంగమును ఆంధ్రదేశము నకు మార్చిరి. కృష్ణా జిల్లాలోని మునగాల జమీందారికి లక్ష్మణరావు గారి జనకులగు వేంకటప్పయ్యగారు దివానుగానుండి కార్యదక్షతతో జమీందారీ వ్యవహారములను నిర్వహించి యుండిరి. తండ్రిగారి మరణానంతరము కొంత కాలము నకు లక్ష్మణరావుగారు తమ కార్యరంగమును మహా రాష్ట్రమునుండి ఆంధ్ర దేశమునకు మార్చినప్పుడు మున గాల పరగణా జమీందారులగు రాజా నాయని రాజా వేంకటరంగారావు బహద్దరు వారు శ్రీ లక్ష్మణరావు గారిని ఆహ్వానించి తమ సంస్థానమునకు దివానుగా నియ మించుకొనిరి. రాజు వివేకశాలి; నూత్న భావ సమన్వి తుడు. మంత్రి విద్యాధికుడు; నూత్నవిజ్ఞాన శోభితుడు. వీరిద్దరును రాజు, మంత్రివలె గాక కృష్ణుడు, అర్జునుడు వలె గాఢమైన మైత్రి కలవారుగా నుండిరి. వారు లక్ష్మణరావుగారి ఆంధ్ర వాఙ్మయ వికాసోద్య మమునకు సంబంధించిన ప్రయత్నారంభములకు విశ్రాంతి స్వేచ్ఛల నొసగుట యేగాక మానసిక ముగను, ఆర్థికము గను సంపూర్ణమైన సహకార మొనర్చిరి. లక్ష్మణ రావు సాహచర్యమున శ్రీ రాజావారు ఆంధ్ర భోజుడుగా వర్తించి కీ ర్తిసముద్రులై 8. శ్రీ రాజావారికిని లక్ష్మణ రావు గారికిని నిజాం రాష్ట్రము లోని తెలంగాణముతో పెక్కు సంబంధము లుండెను. హైదరాబాదునకు వచ్చినపుడు వీరిద్దరికిని శ్రీ రావిచెట్టు రంగారావుగారితో పరిచయము కలిగెను. ఈ త్రిమూర్తు లును తెలంగాణములోని ఆంధ్ర భాషాస్థితిని బాగుపరచు టకు మంతనములు సలిపిరి. తత్ఫలితముగా శ్రీకృష్ణ దేవరా యాంధ్రభాషా నిలయము హైదరాబాదులో 1_9_1901 లో స్థాపితమయ్యెను. అఖిలాంధ్ర దేశములో అధునాతన పద్దతులమీద స్థాపితమయిన మొట్టమొదటి ప్రజా గ్రంధాలయ మిదియే. ఈ గ్రంథాలయ స్థాపనకు స్ఫూర్తి నిచ్చినవారు లక్ష్మణరావుగారు ; ధనమునిచ్చిన

వారు శ్రీ రాజావారు; కార్య నిర్వాహకులు శ్రీ రావి చెట్టు రంగారావుగారు. శ్రీ లక్ష్మణరావుగారు ఆంధ్ర దేశ మందు అడుగిడగనే మొట్టమొదట చేసిన మహాకార్య మీ ఆంధ్ర భాషా నిలయ స్థాపనమే. ఈ ఆంధ్ర భాషా నిలయము ఈ అరువది సంవత్సరములలో క్రమాభివృద్ధి చెంది దివ్యమై, తేజోవంతమై ప్రఖ్యాతి కెక్కియున్నది. తెలంగాణము నందలి ఆంధ్రులకు కనువిప్పు చేసి విజ్ఞానభిక్ష పెట్టి మహోద్యమములకు దారి తీసినది. ఇప్పటికిని ఈ ఆంధ్ర భాషానిలయము ఆంధ్ర భారతికి ప్రధాన నర్తనశాలగా ప్రకాశించుచున్నది. ఆంధ్రభాషా నిలయ స్థాపనతో తృప్తిపడక లక్ష్మణ రావుగారు విజ్ఞాన చంద్రికా గ్రంథమాలను కూడ హైద్రా బాదునందే ప్రారంభించిరి (1905). తరువాత హైద రాబాదులోని రాజకీయ పరిస్థితుల మూలమున మద్రాసు నకు మార్చిరి (1908). ఈ తొలి రెండు సంస్థలు చేసిన ఆంధ్రభాషా ప్రచారము నిరుపమానమైనట్టిది. లక్ష్మణ రావుగారి దూరదృష్టి ఎంత గొప్పదో చూడుడు ! ఆంధ్రులకు ఆంధ్ర బాషలో రచనా కౌశల్యము లేదను భ్రాంతిని, నిస్పృహను లక్ష్మణరావుగారు పటాపంచలు చేయ సమకట్టిరి. విజ్ఞాన చంద్రికా గ్రంథమాలను స్థాపిం చిరి. గ్రంథక ర్తలను సృష్టించిరి. ఆంగ్లేయ భాషా కోవిదు లకు ధైర్యము కల్పించిరి. గ్రంథరచనలు చేయసాగిరి. దేశ చరిత్రములు, జీవిత చరిత్రలు, పదార్థ విజ్ఞాన శాస్త్రము, రసాయనశాస్త్రము, అర్థశాస్త్రము, జంతు శాస్త్రము, భూగర్భ శాస్త్రము మున్నగు వాటిపై అపూర్వ గ్రంథములు విజ్ఞాన చంద్రికా గ్రంథమాల యందు వెలువడెను. శ్రీ లక్ష్మణరావు గారికి ఆంగ్ల విద్యా వ్యాసంగ సంద ర్భమున “త త్త్వ శాస్త్రము” పరీక్షా విషయముగా ఉండి యున్నను, వీరికి అభిమాన విషయముమాత్రము చరిత్రయే. వీరు మొట్టమొదట 'శివాజీ చరిత్రము' ను రచించి ఆ మహారాష్ట్ర వీరునకు జోహారు లర్పించిరి. విజ్ఞానచంద్రికా గ్రంథమాలలో హిందూ మహాయుగము, మహమ్మదీయ మహాయుగము అను రెండు చరిత్ర గ్రంథములను రచిం చిరి. విజ్ఞాన చంద్రికా గ్రంథమాలకు సంపాదకు లగుటచే అందు ప్రచురితమయిన ప్రకృతిశాస్త్రముల యందును, 68