పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కొప్పులింగేశ్వర క్షేత్రము సంగ్రహ ఆంధ్ర


బిల్వేశ్వరీయ ప్రబంధము, కుమార నృసింహము, ధనం జయ విజయ వ్యాయోగము, నరకాసుర విజయ వ్యాయోగము, మంగళగిరి మహత్వము, గోవిందమంజరి, దీక్షిత చరిత్రము, శంకరాచార్య చరిత్ర, కోరుకొండ మాహాత్మ్యము" అనునవి. ఈ గ్రంథములలో కొన్ని అనువాదములును, కొన్ని స్వతంత్ర రచనలును గలవు. వేంకటరత్న కవిగారి కవితారచన సంస్కృత సమాస నిబిడమై యుండును. రసవత్తరమైన ఘట్టములు స్వల్ప ముగా గోచరించుచుండును. వీరు వెండి, బంగారము మొదలగు క్రొత్త పేళ్లతో వృత్తములు రచించిరి. మొత్తము కవిత్వములో ప్రతిభకంటే వైదుష్యమే ముందు నడచునట్లు కనబడును. నాడు పెక్కు తడవలు కందుకూరి వీరేశలింగము, వేదము వేంకటరాయ శాస్త్రి ప్రభృతులతో వేంకట రత్నము పంతులుగారు పత్రికా వాదమును నెరపిరి. ఆనాటి పండితులలో వీరు గ్రాంథిక వాదులుగా పేరు మోసిరి. గృహ వ్యవహార సందర్భములలో గూడ గ్రాంథిక భాషలో నే మాటాడుచుండు నభ్యాసము వేంకట రత్నక విగారు కలిగియుండిరి. “పలుకు దయ్యమా! యిది పాయసమమ్మా! ! బమ్మదయ్యపు టిల్లాలా! యిది పానక మమ్మా!" అను ధోరణిలో సంభాషణము సాగించువారని ప్రసిద్ధి. సలక్షణ భాష పై వీరికిగల అభినివేశ మంతటిది. వేంకటరత్నము పంతులుగారు తెనుగున నే కాక సంస్కృత భాషలో కూడ గ్రంథరచన సాగించిన వారు. జయదేవుని 'గీత గోవిందములను పోలిన వీరి 'గీత మహా నటము' అను గ్రంథము నాడు పండితశ్లాఘా పాత్రమై తన రారినది. ఇట్లు సంస్కృతాంధ్రముల యందు బహు గ్రంథ రచన సాగించి, అధ్యాపక వృత్తిలో ప్రసిద్ధి గడించి, తెనుగువారిలో మున్ముంగల 'మహామహోపాధ్యాయ' మహాబిరుదమును ఆర్జించుకొన్న కొక్కొండ వేంకట రత్నము పంతులుగారు డెబ్బది వత్సరముల పైగా జీవ యాత్ర గడపి 1915వ సంవత్సరమున బిల్వనా థేశ్వరు నిలో ఐక్యమందిరి. మ. స. శా. కొప్పులింగేశ్వర క్షేత్రము : తూర్పు గోదావరి జిల్లాలో రాజమహేంద్రవరమునకు

కొంచె మాగ్నేయముగ పది క్రోసుల మేరలో 'పలి వెల ’ యు గ్రామము కలదు. అచట కౌసికీ నది తీరమున వెలసి యుండినవాడు అగస్త్యోపాస్యుడు, అగస్త్య ప్రతి ష్ఠితుడు నగు కొప్పు లింగేశ్వరుడు. ఈ యీశ్వరుని మొదటి పేరు అగస్త్యేశ్వరుడు ; తరువాతి పేరు కొప్పు లింగేశ్వరుడు. అగస్త్యేశ్వరుడు కొప్పు లింగేశ్వరుడగు టను గూర్చి యొక యైతిహ్యము కలదు. చాళుక్య భీముడను రాజు (క్రీ.శ 888-918) ఆంధ్ర దేశమును పాలించు కాలమున, ఒక పూజరి అగస్త్యేశ్వరు నకు విశేషమైన భక్తి తాత్పర్యములతో పూజలు నేర పుచు, పలివెల గ్రామములో కాపుర ముం డెడి వాడు . ఇట్లుండ అతని కచట ఒక వేశ్యతో సాంగత్య మేర్పడెను. ఆమె తోడి చెలికారమున, ఆతడా వేశ్య యింట నే తరచు వసించు చుండెడివాడు. కాని అతని హృదయమున పర మేశ్వర భక్తి కేపాటియు కొఱత లేక యుండెడిది. పూజరి వేశ్యాలోలుడై యుండుట సహింపజాలని గ్రామస్థులు ఆతని వ ర్తనమును రహస్యముగ తమ ప్రభు వున కెరిగించిరి. ఆ వార్త చేరిన పిదప కొంత కాలమునకు ప్రభువు ఒక నా డాకస్మికముగ పూజరి వర్తనమును పరీ క్షించుటకై పరిమిత పరివారముతో పలివెలకు వచ్చి చేరెను. ప్రభువు పలివెల మధ్యాహ్న మయ్యెను. చేయవలసిన పూజాది విధులను పురమును ప్రవేశించు నప్పటికి అప్పటికా పూజరి ఈశ్వరునకు నిర్వర్తించి, తాను భుజించి, వేశ్య యింటిలో సరస సల్లాపములు నెరపు చుండెను. అచట నుండగనే, ప్రభువు గ్రామములో ప్రవే శించి ఈశ్వరుని దర్శింపగోరు చుండెనను వార్త ఆ పూజ రికి వినవచ్చెను. ఆ నాటి యాచారమును బట్టి, ప్రభువు పర మేశ్వరుని దర్శనమునకై వచ్చినపుడు, శివనిర్మాల్య మైన మాలికను ఆతనికి ప్రసాదముగా నిచ్చుట యొక పరిపాటిగా నుండెను. కాని అట్లు నిర్మాల్యముగా నీయ దగిన మాలిక ఏదియు ఆ సమయ మందు గుడిలో లేదు. ఏమి చేయుటయా అని పూజరి ఆలోచించు చుండ, ఎదురుగా వేశ్య జడలో ముడుచుకొనిన దండ యాతని కంటి కగపడెను. వెంటనే ఆతడా దండ తీసికొని, ఎవ్వరి కంట బడకుండ, పదిలముగా గుడి లోపలకు తెచ్చి 64