పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము = 3 కొండాపురము


వానకాలములో వాన వలన మంటిదిబ్బలమీది మన్ను కొట్టుకొనిపోగా విచిత్రాకారముగల ఇటికలు కనబడినవి. ఇచ్చట ఏదో చరిత్రకు సంబంధించిన గని కలదని పురా వస్తుశాఖవారు గ్రహించి త్రవ్వకము లారంభించిరి. ఈ

చిత్రము - 13

మట్టితో చేయబడిన జంతువిగ్రహము - కొండాపురము చిత్రము - 12


- మృణ్మయపాత్రల పైనున్న బౌద్ధ మత చిహ్నములు - కొండాపురము కొండాపురము మంటిదిబ్బలకు కొంచెము దూరములో బ్రహ్మాండమయిన ఆకారముగల గండశిలలు, మరికొంత దూరమున చుట్టును చిత్రము - 14


మట్టి తాయెతులు కొండాపురము పెట్టని కోటలవలె గుట్టల వరుసలు ఉన్నవి. జలసౌక ర్యము, స్వాభావిక రక్షణ సౌకర్యము ఉండుట రాజధాని యైన నగరమునకు ఆవశ్యకముకదా! అట్టి సౌకర్యములు గమనించియే ఆ పట్టణనిర్మాణము కావించియుందురు. పురావస్తు శాఖవారు 1941 లో త్రవ్వకముల నారం భించిరి. ఇండ్ల శిథిలములు, ఇటికలతోను, మట్టితోను కట్టిన గోడలు, రాతి కాలువలు, కమ్మరి కొలుములు, పెద్ద పెద్ద మట్టిగాబులు, స్తూపములు, చైత్యములు, విహారములు కనబడినవి. ఇంకను భాండములు, విగ్రహములు, పూసలు, సొమ్ములు, నాణెములు దొరకినవి. పట్టణములకు ఉండ వలసిన లక్షణము లన్నియు కనబడెను. అచట కర్మకారు లుండిరి. పరిశ్రమలుండెను. టంకసాలయుండెను. జనులు బౌద్ధమతావలంబులుగా నుండిరి. ఇట్టి అద్భుత వృత్తాం తము బయల్పడుట యేగాక, నూతన చారిత్రకాంశములు కూడ లభించినవి.

ఇచ్చట దొరికిన వస్తువులను మత దృష్టితోను, శిల్ప దృష్టితోను చూచినచో రెండువేల సంవత్సరముల క్రిందట ఆంధ్రజనుల సభ్యత ఎట్లుండెనో వెల్లడి కాగలదు. వారు ఇండ్లను ఇటికతోను, సున్నముతోను కట్టుచుండిరి, ఈ ఇటికలను దగ్గర నున్న తటాకములోని మట్టితోనే చేయు చుండిరి. ఇంటియొక్క ప్రాకారకుడ్యమునకు వాడిన 61