కొండాపురం
సంగ్రహ ఆంధ్ర
వచ్చుననుటకు అవకాశము కలదు. ప్రాచీన కాలములో విదర్భ అను దేశము ఉండెడిది. దానికి కుండిన పురము రాజధానియై యుండెను. విదర్భయే ఇప్పటి బీదరు
చిత్రము - 9
అయి యుండవచ్చును. ఆకుండినపురమే కొండాపురముగా నేడు మారి యుండవచ్చును. కుండినపురము శ్రీకృష్ణుని భార్య యగు రుక్మిణీదేవికిని, నలమహారాజు భార్య యగు దమయంతీ దేవికిని జన్మస్థానమని పురాణములు చెప్పుచున్నవి. దీనిని బట్టి కొండాపురపు చరిత్ర అత్యంత ప్రాచీనకాలమునకు చెందినదని చెప్పవచ్చును.
ప్రాచీననగర ప్రదేశము సముద్రమట్టమునకు 1788 అడుగుల ఎత్తున ఉన్నది. ఇప్పుడది 80 ఎకరముల జొన్న చేనుగా మారినది. ఈ చేనిలో అచ్చటచ్చట మంటిదిబ్బలు కనబడుచున్నవి. ఈ దిబ్బలు నేలమట్టమునకు సుమారు 20-30 అడుగుల ఎత్తున్నవి. మంటిదిబ్బలకును, కొండాపుర గ్రామమునకును మధ్యగా ఒక ఏరు ప్రవహించు చున్నది. ఈ ఏటియొక్క ప్రవాహమును అరికట్టుచు గొప్పతటాకము నిర్మింపబడినది. జల సమృద్ధిగల ఈ నదీతీరముననే పూర్వోక్తమయిన పురాతన పట్టణమును కట్టి యుందురు.
చిత్రము - 10
చిత్రము - 11
60