పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము = 8 కొండాపురము


మాటకు తలయూపువారు కారు. తనకు అసమ్మత మైన విషయమును ధైర్యముతో వ్యక్త పరచెడివారు. హోంరూలు సమితి సభ్యులుగా పంతులుగారు డా. అనిబిసెంటుతో ఢిల్లీకి వెళ్ళి మాంటేగు - చెమ్స్ ఫర్డులను దర్శించిరి. ఉన్నవ లక్ష్మీనారాయణగారి నిర్బంధమునకు అసమ్మతిగా వర్తకులచే వారము దినములు జయప్రద ముగా సమ్మెచేయించిరి. ఇది యొక అపూర్వసంఘటనము. ఆబ్కారీ పాటలను పాడవలదని గుంటూరు మేజి స్ట్రేటు గారి ఎదుట వర్తకులకు ప్రబోధించిరి. కాంగ్రెసు ఎన్నిక లను బహిష్కరించిన సందర్భమున పంతులుగారు రాష్ట్ర మంతటను ప్రచార మొనరించిరి. పంతులుగారి సహాయ నిరాకరణ ప్రచారము మూలముననే బులుసు సాంబ మూర్తి వంటి వా రెందరో తమ న్యాయవాద వృత్తులను విసర్జించిరి. పన్నుల నిరాకరణోద్యమమును (1920), బార్డోలీ ఉద్యమమునకు దీటుగా పెదనందిపాడులో జరి పించిరి. ఆ యుద్యమమును విరమింపుడని గాంధిజీ వ్రాసి నను, పంతులుగారు అది బహుదూరము సాగినదనియు, అట్టి దశయందు దానిని ఆపివేయుటయే సంభవించు నెడల, ఆంధ్రదేశము కాంగ్రెసునుండి తొలగవలసి వచ్చుననియు ఖండితముగా చెప్పిరి. వారి ధైర్య సాహసము అట్టివి ! కాంగ్రెసు కార్య నిర్వాహక సభ అమృతసర్ లో జరిగి నపుడు పంతులుగా రచటికి అఖిల భారత కాంగ్రెసు అధ్యక్షులుగా వెళ్ళిరి. నాడు అకాలీల శాసనోల్లంఘ నపు టూరేగింపులో కాంగ్రెసు కార్యవర్గమువారు కూడ పాల్గొనిరి. గాంధీజీ దండిగ్రామములో ఉప్పు సత్యాగ్రహము జరిపినపుడు పంతులుగారు నూరుమంది కాంగ్రెసు కార్యకర్తలచే తమ ఆవరణములో ఉప్పు తయారుచేయించి అమ్మించిరి. అఖిలభారత చరఖాసంఘపు శాశ్వత సభ్యుడుగా. ఆంధ్రరాష్ట్ర చరఖాసంఘపు అధ్యక్షు డుగా, ఆంధ్ర రాష్ట్ర హిందీ ప్రచార సంఘపు అధ్యక్షు డుగా పంతులుగారి సేవ ఎంతయు ప్రశంసాపాత్రము. బాపుజీ ఖద్దరు నిధి కొరకు ఆంధ్రరాష్ట్రమున సంచారము చేసినపుడు పంతులుగారు వారికి కంటి రెప్పవలె వర్తించిరి. వీరు పెక్కుసారులు కారాగారశిక్ష ననుభవించిరి.

శాసన సభ్యత్వము : పంతులుగారు గుంటూరు, కృష్ణా, గోదావరిజిల్లాల ప్రతినిధిగా శాసనసభకు ఎన్నుకొనబడిరి.

వీరు శాసనసభలో చాల కృషిసల్పి విషయములను సమ గ్రముగ తెలిసికొని, ఆవశ్యకమగు అంశముల నన్నిటిని పూస గ్రుచ్చినట్లు శ్రుతపరచెడువారు. శాసనసభ యందు ప్రభుత్వ బలమే హెచ్చయ్యెను. అయినను వారు త్రికరణ శుద్ధితో, దేశ సేవా దీక్షతో గ్రంథాలయముల కొరకు ప్రభుత్వ సహాయ మర్థించుచు, ప్రతిపాదించిన బిల్లును ఆమోదించియు, స్త్రీలు విద్యాలయములందు చదువ కయే పరీక్షలలో వ్రాయవచ్చునని ప్రతిపాదించిన బిల్లును మొదట వ్యతి రేకించినను, తుదకు ఆమోదించియు పంతులు గారిని బ్రిటిష్ ప్రభుత్వమువారు గౌరవించిరి. 1936 లో శాసనసభ్యులై గుంటూరు నియోజక వర్గము నకు సేవచేసిరి. కాంగ్రెసులోని అక్రమములను గాంధీ, నెహ్రూ మున్నగు ప్రముఖ నాయకులకు తెలియజేసి, కాంగ్రెసును పరిశుద్ధ మొనర్ప ప్రయత్నించిరి. వారు అట్టి మహనీయులు, వినయధనులు, ప్రతిభావిలసితులు, మానవ సేవా ధురంధరులు, ధైర్యోత్సాహ, ఉదారాది ప్రశస్త గుణగణ విరాజితులు, దేశ హితైకతత్పరులు, ఆంధ్రోద్యమ జనకులు, 'దేశభక్త' బిరుద శోభితులుఅయిన శ్రీ వెంకటప్పయ్యగారు 1949వ సంవత్సరమున ఆగస్టు 15 వ తేదీయందు దేశ ప్రజలకు స్వాతంత్ర్యదిన సందేశ మొసగి,

ఆ పర్వదినముననే దేశీయులను అపారశోక వారిధియందు ముంచి భౌతిక దేహమును త్యజించి నిరు పమ కీర్తి కాయముతో పరమపదమందిరి. చి. దా. శా.
కొండాపురము :

మెదకు జిల్లా, కలబగూరు తాలూకాలో బిదరు ప్రాంత మున కొండాపురమను చిన్న గ్రామము కలదు. దాని ప్రాంతమునందు అత్యంత ప్రాచీన కాలములో, అనగా 2000 సంవత్సరముల క్రిందట వై భవో పేతమైన యొక నగరము ఆంధ్ర రాజధానిగా విలసిల్లి యుండెనని చరిత్ర కారులు నిర్ధారణ చేసిరి. ప్రాచీన కాలములో ఆ మహానగరము నకు ఎట్టి పేరు ఉండెనో తెలియదు. కాని నగరశిథిలములు దొరకిన ప్రాంతము కొండాపుర గ్రామమునకు సుమారు అర మైలు దూరమున మాత్రమే ఉండుటచేత ఈ పురాతన నగరమును కూడ సౌకర్యార్థము కొండాపురమనియే వ్యవహరించుచున్నారు. ఈ పూర్వపు పట్టణము పేరు కూడ కొండాపుర మో అట్టిదే వేరొక పేరో అయి యుండ 59