పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కొండ వేంకటప్పయ్య సంగ్రహ ఆంధ్ర


శించి అచటి న్యాయవాదుల సమాజములో విరాజమాను లైరి. గుంటూరుజిల్లా కాంగ్రెసు అధ్యక్ష పదవి నలంకరించి బాలురకును, బాలికలకును పాఠశాలలందు ఉచిత విద్యను, మధ్యాహ్న భోజనమును ప్రభుత్వమువారు ఒనగూర్ప వలయునను ఆశయమును ఉద్ఘాటించిరి. పిదప గుంటూరు పురపాలక సంఘ సభ్యులై ప్రభుత్వమువారు చూపిన ఆ పణల కన్నింటికిని తగురీతి సమాధానములను వ్రాసి, పురపాలక సంఘము రద్దుకాకుండ వారించిరి. వెంకటప్పయ్యగారు చేపట్టని కార్యముగాని. చేపట్టి విజయము గాంచని కార్యముగాని లేదనుట అతియోశ క్తి కాజాలదు. వారి సంఘ సంస్కరణోద్యమ దీక్షకు వారి ఆధ్వర్యమున బందరు నందు జయప్రదముగ జరిగిన ప్రథమ వితంతూద్వాహము తార్కాణము. వారు కృష్ణాపత్రి కను స్థాపించి స్వయముగా జయప్రదముగా దానిని నడిపిరి. లంచము గై కొన్న ఒక మేజిస్ట్రేటుపై ధర్మరక్ష ణార్థము హైకోర్టు వరకు కేసును నడిపి, అందు విజయ మును సాధించిరి. స్త్రీ విద్యా వ్యాప్తి విషయమున పంతు లుగా రొనర్చిన కృషి ప్రశంసా పాత్ర మైనది. శారదా ని కేతనమును స్థాపించు తలంపున వారు వేనవేల రూపా యీలను చందాగా వేయించి, ఆ జాబితాను, ఆ యుద్యమ నిర్వహణమును ఉన్నవ లక్ష్మీనారాయణ గారికి ఒప్పగిం చిరి. ఆ సంస్థ స్థాపింప బడిన తోడనే, వారు దాని అధ్యక్ష పదవి నధిష్ఠించిరి. తత్పురోభివృద్ధి న పేక్షించి 200 ఎకర ముల భూమిని తమ ధర్మపత్ని చేత భూదానముచేయించిరి. ఆంధ్రోద్యమము : పంతులవారి స్వార్థత్యాగము సాటి లేనిది. మహాత్మగాంధీ శంఖారావ మొనర్చుటకు 15 సంవ త్సరములకు పూర్వమే (1915) వారు న్యాయవాద వృత్తిని త్యజించి దేశహితైక కార్యవ్యగ్రులైరి. ఆకా మున ప్రభుత్వము వారి కట్టడి మిక్కిలి కఠినముగ నున్నను లెక్కింపక, వారు 1907 లో తెనాలిలో జరిగిన స్వదేళో ద్యమ సభకు అగ్రాసనాధిపత్యమును నిర్భయముగ వహిం చిరి. విదేశీయ వస్త్ర బహిష్కార మందును, స్వదేశీయ వస్తుపరిగ్రహణ మందును వారు ప్రజలను ప్రోత్సహించిరి.

గుంటూరులో వింజమూరి భావనాచార్యుల వారి ఇంట ఆంధ్రోద్యమము ఆరంభ మయ్యెను. ఆ సమా వేశ మందు పంతులుగా రే అధ్యక్షులయిరి. ఆంధ్రోద్యమమును

గూర్చి ఆంధ్రము నందును, ఆంగ్లము నందును గ్రంథము లను రచించిరి. గుంటూరు జిల్లా కాంగ్రెసు సంఘము ఏర్పడి నప్పుడు దానికి పంతులుగారే అధ్యక్షులయిరి. 1913 లో బాపట్లలో జరిగిన ప్రథమాంధ్ర మహాసభకు పంతులుగారు ఆహ్వాన సంఘాధ్యక్షులుగా నుండిరి. ఆంధ్ర రాష్ట్ర తీర్మానము వాయిదా పడగా, ఉద్యమ ప్రచారమున కొక స్థాయీసంఘము నేర్పరచి, దానికి పంతులుగారు కార్యదర్శియై కార్యకలాపములను నిర్వ హించిరి. డా. భోగరాజు పట్టాభి సీతారామయ్యగారితో పాటు 1918లో రాయలసీమలో ఆంధ్రోద్యమ ప్రచార మొనర్చిరి. పెద్దిభొట్ల వీరయ్య, అయ్యదేవర కాళేశ్వర రావు, అయ్యంకి వెంకట రమణయ్యగార్ల కృషికి ఫలిత ముగా విజయవాడలో (1914) జరిగిన రెండవ ఆంధ్ర మహాసభలో పంతులుగారు ప్రచారసంఘపు పర్యట నానుభవములను నివేదించిరి. 'మహానంది' విద్యార్థి మహా సభలో ఆంధ్రరాష్ట్ర నిర్మాణమును గూర్చి వివరించిరి. మూడవ, నాలుగవ ఆంధ్ర మహాసభలు విశాఖపట్టణము (1915), కాకినాడ (1916)లలో జరిగెను. పంతులుగారు స్థాయీసంఘము యొక్క కార్యదర్శిగా, ప్రచార సంచా రక నివేదికలను సమర్పించిరి. నెల్లూరులో జరిగిన 5వ ఆంధ్రరాష్ట్ర మహాసభకు పంతులుగారే అధ్యక్షత వహిం చిరి. అందు ఆంధ్రరాష్ట్ర స్థాపనకు అనుకూలముగా తీర్మానము గావింపబడెను. 6వ ఆంధ్రరాష్ట్ర మహాసభ పంతులుగారి కృషి ఫలితముగా కడపలో జరి గెను. రాజకీయ జీవితము : మద్రాసులో విద్యార్థిగా నున్న ప్పుడు అక్కడ జరిగిన అఖిలభారత కాంగ్రెసు మహా సభలో ఐచ్ఛిక భటుడుగా పంతులుగారు ప్రారంభించిన రాజకీయ జీవితము అఖిలభారత కాంగ్రెసు అధ్యక్షు పదవికి దారి తీసినది. వారు జెయిలు కేగినపుడు మాత్రము కీ. శే. టంగుటూరి ప్రకాశం పంతులు గారు వారి స్థానమున రాష్ట్ర కాంగ్రెసు అధ్యములుగా నుండిరి. ఈ పదవిని పంతులుగారు బుద్ధిపూర్వకముగా వదలుకొనిరి నాగపూరు కాంగ్రెసు సభలో (1920) కార్యవర్గ సభ్యు డుగా పంతులుగారు ఎన్నుకొనబడిరి. బెల్గాములో (1924) జరిగిన కాంగ్రెసు సభవరకును తమ సభ్యత్వమును అక్యంత సమర్థతతో నిర్వహించిరి. వారు గాంధిజీ చెప్పిన ప్రతి A

      58