పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

విజ్ఞానకోశము - 3 కొండ వేంకటప్పయ్య


తమకు పంపదొడగిన విద్యార్థి వేతనమును సహపాఠియగు చంద్ర శేఖరమున కొసగుచు, అఖండమైన ఔదార్యమును ప్రకటించిరి. అచటి విద్యార్థిదశయందే వారు తెనుగున కవిత్వము వ్రాయదొడగిరి. బి. ఏ. పరీక్షలో కృతార్థులు కాకముందే వారు లింగమగుంట కోదండ రామయ్య గారి కన్యారత్నము, వేంకట సుబ్బమ్మగారిని ధర్మపత్నిగా స్వీకరించుట తటస్థించెను. బి. ఏ. తరగతిలో చదువుచున్న కాలముననే వేంక టప్పయ్యగారు కళాశాల విద్యార్థి సంఘ చర్చలలో అగ్ర గణ్యులుగ పేరొందిరి. ఉపన్యాసకరణమున లబ్ధవర్ణులై 8. షేక్స్పియరు నాటక ప్రదర్శనావసరములలో తాము స్వీక రించిన పాత్రకు అనుగుణముగ ఉచ్చారణ మొనర్చుచు, హావభావాదిక ముల ప్రదర్శిం చుచు, నిరుపమానమైన ప్రజ్ఞా కాలమును ఆవిష్కరించిరి. అత్తరి వారు అలవరచుకొనిన సుగుణగణమే ఉత్తరకాలమున ఉ త్తమన్యాయవాదిగ నిర్మించుకొనిన కీర్తిసౌధ మునకు పునాదియై వరలెను. ఒక నాడు ప్రొఫెసరు లాయిడ్ అనునాతడు బైబిల్ పాఠము చెప్పుచు హిందూమతమును దూరిన కార వారు ణముగా విద్యార్థుల చే గొప్పస మై జరుపబడెను. ఆ సమ్మెయందు అత్యుత్సాహ ధైర్యములతో ప్రధాననాయకత్వమును వహిం చిన వారు పంతులుగా రే. 1887 సంవత్సరము డిసెం బరులో అచట జరిగిన

భారత కాంగ్రెసు తృతీయ సమావేశ సందర్భమున పంతులుగారు ఐచ్ఛికభటులుగా స్వీయకృత్య నిర్వహణమున అత్యంత సామర్థ్యమును వ్యక్తీకరించిరి. పై సందర్భములలో పంతులుగారు అల వరచుకొనిన గుణములే, నిరుపమానమైన వారి భావి దేశ నాయకత్వమునకు రాచబాట పై చినవి.

బి.యల్. పరీmఫలితములు తెలియకమున్నే పంతులు గారు సబ్ రిజిస్ట్రారుగా నియమింపబడిరి. కాని వారు దానిని స్వీకరింపక, న్యాయశాస్త్ర పట్టభద్రులయిన వెంటనే బందరులో తమ న్యాయవాద వృత్తికి విఘ్నే శ్వరపూజ గావించిరి. పంతులుగారి హస్తము పరుస వేదియై వారు పట్టిన దెల్ల బంగారమగు చుండెను. ప్రప్రథ మమున వారొక ఖూనీ కేసునందు ముద్దాయి పక్షమున ప్రచండముగ వాదించి గడించిన అఖండ విజయమే పిదప న్యాయవాదిగా వారికి చేకూరిన కీర్తి ప్రతిష్ఠలకు జయ పతాక యయ్యెను. చిత్రము - 8

న్యాయవాద వృత్తి నవలంబించిన మూడు సంవత్సర ములకు పిదప వెంకటప్పయ్యగారు కృష్ణాజిల్లా కాంగ్రె సుకు సభ్యులుగను, కార్యదర్శి గను పనిచేయుచుండిరి. 1896లో కృష్ణానది వరదలు కారణముగా అవనిగడ్డ తాలూకా గ్రామములు నీటిలో మునిగి పోయెను. ఐన నేమి ! పంతులుగారు అకుంఠిత ధైర్య స్థైర్య సమయస్ఫూర్తులతో వలసిన ద్రవ్యమును భూరివిరాళ రూపమున ప్రోగుచేసి, బాధిత గ్రామజనులకు పడవల పై నెత్తిం చిన సరకులను స్వయముగా సరఫరా చేయించి తమ దయా మయత్వమును, అప్రతిహతో త్సాహమును, కర్తవ్యదీక్షను, మానవ సేవాతత్పరతను ఆవిష రించిరి. అట్లే ఒకతూరి రాయల సీమలో కరువు సంభవించగా, అచటికి వారు స్వయముగా వెళ్ళి పర్యటించి, చవుక బియ్యపు దుకాణములను ఏర్పాటు గావించి, నూతులు, వలు త్రవ్వించు నిర్మాణ కార్యకలాపములందు పరిశ్ర మించి తమ ప్రజాహితైక తత్పరతను వెల్లడించిరి. కృష్ణాజిల్లానుండి గుంటూరుజిల్లా కొత్తగా ఏర్పడిన పిదప పంతులుగారు గుంటూరునందే న్యాయవాదిగా ప్రవే 57