పుట:SamskrutaNayamulu.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
80

సంస్కృతన్యాయములు

"చలార్ణవయుగచ్ఛిద్రకూర్మగ్రీవా ప్రవేశవత్‌,
అనేకజన్మనా మన్తే వివేకీ జాయతే పుమాన్‌"
                     (యోగవాసిష్ఠము.)

చలేతి:- చలార్ణవయుగచ్ఛిద్రకూర్మ గ్రీవాప్రవేశవత్‌! చలౌ చంచలౌ యా వర్ణవౌ తా వర్ణవౌ తరంగౌ తయోర్యుగం యుగ్మం తస్య ఛిద్రం మధ్యవర్త్యాకాశం తత్రస్థితో యః కూర్మః కమఠ స్తస్యకచ్ఛప స్యోభయ పార్శ్వే బహుకాలం నిరన్తరం తరంగకృతతాడనేన విహ్వలత్వే గ్రీవాప్రవేశో గ్రీవా కణ్ఠ స్తదుపలక్షిత తదాద్యంగప్రవేశో యథా జాయతే తద్వ త్పుమాన్ పురుషార్థ్యనేకజన్మనా మనన్తజన్మమరణోపలక్షితసుఖదుఃఖానాం స్పర్శేన ఖిన్న స్తదంతఃకరణబాహ్యకరణాని స్వస్వవిషయేభ్యో వ్యావర్త్య వివేక్యాత్మానాత్మవివేకవా ఞ్జాయతే భవతి||

తాళప్రమాణమున నెగసిపడుచు భయంకరధ్వనులతో బాటు రెండుకెరటముల నడుమఁ జిక్కికొనిన తాఁబే లటు నిటు పోలేక యిరువంకలఁ గొండలంబోలిని తరంగ యుగాఘాతముల నెంతయు నొచ్చి విహ్వలించి బహుకాలం మట్లయ్యెడన పడియుండి తుద కెన్నఁడొ సమయము దొఱకినపు డల్లన మెడదూర్చి పిదప తక్కినయవయవములను గూడ జొప్పించుచు నొకతరంగమునఁ బ్రవేశించి యథేచ్ఛం జనును.