పుట:SamskrutaNayamulu.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
79

సంస్కృతన్యాయములు

మల్లగ్రామన్యాయము :

ఇతరజాతులుకూడ ఉండినను, మల్లురు అధికముగాఁగల యూరికి మల్లగ్రామమనియే వ్యవహారము కలుగును.

బ్రాహ్మణగ్రామన్యాయము, ఆమ్రవనన్యాయమువలె.


మహాదర్పణముఖన్యాయము :

పెద్దఅద్దములో పెద్దముఖము. (చిన్నఅద్దములో చిన్న ముఖము.)


మహానసశశన్యాయము :

వంటయింటఁ జొచ్చిన కుందేలు సులభముగఁ బట్టుపడును.

(భార. ఆది. 6-186)


మహామత్స్యతీరన్యాయము :

పెద్దచేప నదిలో ఈదరినుండి ఆదరివఱకు నెగిరిపడుచుఁ దిరుగుచుండును. కాని అది ఆఒడ్డులకంటె వేఱయి యుండి ఒడ్డులను తాకదు.

ఉదా:- జాగ్రదాద్యవస్థల నంటియుండియు నుపాధుల నంటక భిన్నముగ నుండు పరతత్త్వము.


మహార్ణవయుగచ్ఛిద్రకూర్మగ్రీవాప్రవేశన్యాయము :

రెండుతరంగములమధ్య నెటు పోలేక అలలతాఁకుడున కలసి తుద కెటులో తాఁబేలొం డొకతరంగమున గ్రీవాప్రవేశ మొనరింప నేర్చినట్లు.