పుట:SamskrutaNayamulu.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
81

సంస్కృతన్యాయములు

అట్లె పురుషార్థి యవు పురుషుఁడు నిరన్తమవు సంసారచక్రమునం బడి యనేకజన్మములకావల జవనమరణోపలక్షితసుఖదుఃఖస్పర్శమున ఖిన్నుఁడై బాహ్యాంతఃకరణగణమును విషయములబారిం బడక అరికట్టి యాత్మనాత్మవివేకముగలవాఁడు కానేర్చును.


మహావాతగజన్యాయము :

మహావాయువులో నేనుఁగులె కొట్టుకొనిపోవుచుండ నింక నల్పజంతువులు లెక్కయేమి?

"మహాగజాః పలాయంతే మశకానాం తు కా గతిః?"


మహిషీప్రసవన్యాయము :

బఱ్ఱె ఈనినట్లు.

(సులభ మని భావము.)


మహిషీమహిషన్యాయము :

బఱ్ఱె ఈనుచుండఁగా దున్నపోతు దానిపై నెక్కఁ బ్రయత్నించినట్లు.

(మగఁడు చచ్చి ఏడ్చుచుండ ఱంకుమగఁడు ఱాళ్ళు వైచినట్లు.)


మక్షికాన్యాయము :

ఈఁగ ఎంత చక్కని శరీరముమీఁద వ్రాలినా రుచిచూచునది మాత్రము పుండులోని చీమే.