పుట:SamskrutaNayamulu.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
76

సంస్కృతన్యాయములు

వేదాంతు లీన్యాయమును సాధారణముగ తత్త్వమున కుపయోగింతురు.

"సూత్రే మణిగణా ఇవ"

"ఎనయుం దారము రత్నహారములయం దేరీతి"

(వ్యాఖ్యాతల శంకరవిజయమునుండి.)


మత్తకాశినీన్యాయము :

నడివయసుననున్న కులుకులాడియెదుటనుండఁ బశువును మోహించినట్లు.


మత్స్యకంటకన్యాయము :

ముల్లుగల చేపను బట్టి ముల్లు తీసివైచి చేపను వండుకొని తినినట్లు.

ఒకవస్తువు కించిద్దోషయుక్తమైనను ఆదోషమును తొలగించి, శిష్టవస్తువును గ్రహించుట లెస్స.


మధుమక్షికాన్యాయము :

ఈఁగలు కూర్చిన తేనె మనుష్యుల యధీన మైనట్లు.

"తేనెఁగూర్చి యీఁగ తెరువరి కియ్యదా" (వేమన.)


మధుకరరాజమధుమక్షికాన్యాయము :

పోతు తేనెటీఁగను తేనె సంపాదించు తక్కిన ఆడుతేనెటీఁగ లన్నియు అనుసరించి సేవించునట్లు.